• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుజరాతీ అమ్మాయిలపై అత్యాచారం కేసు: పీకల్లోతులో నిత్యానంద: ఇంటర్‌‌పోల్ ఎంట్రీ.. !

|
  Interpol Issues Blue Corner Notice Against Godman Nithyananda || Oneindia Telugu

  అహ్మదాబాద్: వివాదాస్పద స్వామిజీ నిత్యానంద పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఇద్దరు గుజరాతీ అమ్మాయిలను తన ఆశ్రమంలో నిర్బంధించి, అత్యాచాారానికి పాల్పడ్డారంటూ ఆయనపై నమోదైన కేసు.. ఆయన మెడకు చుట్టుకుంది. అటు తిరిగి, ఇటు తిరిగి.. ఏకంగా ఇంటర్‌పోల్‌కు చేరింది. నిత్యానంద కోసం ఇంటర్‌పోల్ బుధవారం బ్లూ కార్నర్ నోటీసులను జారీ చేసింది. నిత్యానందను అరెస్టు చేయడానికి సహకరించాలంటూ గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన విజ్ఙప్తిపై ఇంటర్‌పోల్ సానుకూలంగా స్పందించింది.

  దేశం విడిచి పారిపోయిన నిత్యానంద..

  దేశం విడిచి పారిపోయిన నిత్యానంద..

  గుజరాతీ అమ్మాయిలపై అత్యాచారం కేసులో నిత్యానంద దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో నిత్యానందకు చెందిన యోగిణి సర్వజ్ఙపీఠంలో తన ఇద్దరు కుమార్తెలు లోపముద్ర, నందితలను నిర్బంధించారని, వారిపై నిత్యానంద అత్యాచారాలకు పాల్పడుతున్నారంటూ జనార్ధన శర్మ అనే వ్యక్తి గుజరాత్ హైకోర్టులో ఆశ్రయించారు. యోగిని సర్వజ్ఞపీఠం పేరుతో అహ్మదాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఈ ఆశ్రమం కొనసాగుతోంది. అదే ఆశ్రమంలో తన కుమార్తెలు బందీలుగా ఉన్నారంటూ గత ఏడాది నవంబర్‌లో జనార్ధన్ శర్మ హైకోర్టులను ఆశ్రయించారు.

  బందీలుగా లోపముద్ర, నందిత..

  బందీలుగా లోపముద్ర, నందిత..

  నిత్యానంద ధ్యానపీఠం ఆశ్రమంలో తమ ఇద్దరు కుమార్తెలు బందీలుగా ఉన్నారంటూ గుజరాత్ కు చెందిన దంపతులు ఆరోపించారు. తమ కుమార్తెలను విడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో పిటీషన్ ను దాఖలు చేశారు. పీటీషన్ ను విచారణకు స్వీకరించిన గుజరాత్ హైకోర్టు పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. వారం రోజుల వ్యవధిలో నిత్యానంద న్యాయస్థానానికి హాజరు కావాలని, లోపముద్ర, నందితలను తల్లిదండ్రులకు అప్పగించాని అప్పట్లో ఈ ఉదంతం అనంతరం నిత్యానంద అదృశ్యం అయ్యారు. అజ్ఞాతంలోకి వెళ్లారు.

  కొత్త ద్వీప దేశాన్ని ఏర్పాటు చేశారంటూ..

  కొత్త ద్వీప దేశాన్ని ఏర్పాటు చేశారంటూ..

  దేశం విడిచి పారిపోయిన నిత్యానంద ట్రినిడాడ్ సమీపంలో ఓ ప్రైవేటు ద్వీపాన్ని కొనుగోలు చేశాడని, దీనికి కైలాస అనే పేరు పెట్టారంటూ గత ఏడాది వార్తలు వెలువడ్డాయి. దీనికోసం ప్రత్యేక పాస్‌పోర్టును సైతం రూపొందించారంటూ స్పష్టమైంది. వాటన్నింటిపైనా గుజరాత్ పోలీసులు ఆరా తీశారు. ఆయన ఎక్కడున్నాడనే విషయాన్ని తెలియజేస్తూ కొద్దిరోజుల కిందట ఇంటర్‌పోల్‌కు లేఖ రాశారు. నిత్యానందను అరెస్టు చేయడానికి సహకరించాలని కోరారు.

  సానుకూలంగా స్పందించిన ఇంటర్‌పోల్..

  సానుకూలంగా స్పందించిన ఇంటర్‌పోల్..

  గుజరాత్ పోలీసుల అభ్యర్థనపై ఇంటర్‌పోల్ సానుకూలంగా స్పందించింది. గుజరాత్ పోలీస్ డైరెక్టర్ జనరల్ పంపించిన కేసు వివరాలు, అహ్మదాబాద్ హైకోర్టు ఆదేశాలు.. ఇవన్నీ క్షున్నంగా పరిశీలించింది. అనంతరం నిత్యానందను అరెస్టు చేయడానికి తాజాగా బ్లూ కార్నర్ నోటీసులను జారీ చేసింది. బ్లూ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ జారీ చేసినట్టు అహ్మదాబాద్ నగర డిప్యూటీ కమిషనర్ కేటీ కమారియా తెలిపారు. దీన్ని రెడ్ కార్నర్ నోటీసుగా బదలాయించాలని కోరుతూ మరో ప్రతిపాదనలను పంపిస్తామని వెల్లడించారు.

  English summary
  The Interpol issued a blue corner notice against self-styled godman Nithyananda, who has been accused of rape and wrongful confinement on the request of Gujarat police. The state police revealed the move in a charge sheet filed in a local court in connection with an FIR lodged against Nithyananda in November last year, after two girls went missing from his ashram here.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X