వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎన్బీ స్కాం: నీరవ్ మోడీపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Interpol Issues Red Corner Notice Against Nirav Modi

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో సుమారు 13వేల కోట్ల రూపాయలకుపైగా కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీపై ఎట్టకేలకు రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. భారత దర్యాప్తు సంస్థ సీబీఐ అభ్యర్థన మేరకు నీరవ్ మోడీపై ఇంటర్‌పోల్ ఈ నోటీసు జారీ చేసింది.

విదేశాలకు వెళ్లి తలదాచుకుంటున్న నిందితులను అరెస్ట్ చేసేందుకు ఈ రెడ్ కార్నర్ నోటీసు ఉపయోగపడుతుంది. రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ తన సభ్య దేశాలకు జారీ చేస్తుంది.

Interpol issues Red Corner Notice against Nirav Modi for money laundering

ఒక దేశానికి సంబంధించిన నేరస్తుడు ఇతర దేశాల్లో ఉంటే.. అతడ్ని అరెస్ట్ చేయాలని ఇంటర్ పోల్ తన సభ్య దేశాలను కోరుతోంది. నీరవ్ మోడీ కేసులో సీబీఐ ఇప్పటికే ముంబైలోని ప్రత్యేక కోర్టులో ఛార్జీషీట్లు దాఖలు చేసింది.

నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీ, నీరవ్ సోదరుడు నిషాలపై ఇంటర్‌పోల్ ద్వారా సీబీఐ ఫిబ్రవరి 15న డిఫ్యూజన్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసు ద్వారా
నిందితుడు ఏ ప్రదేశంలో ఉన్నాడనే సమాచారాన్ని ఇంటర్ పోల్ సభ్య దేశాలు పంచుకుంటాయి. దీని ద్వారా నీరవ్ ను తొందగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.

English summary
The Interpol has issued a red corner notice against PNB Fraud accused Nirav Modi. With the notice being issued, it would restrict the moves of the accused who has been moving from one country to another.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X