వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోదీ మేకిన్ ఇండియా ఎక్కడ: నిలదీసిన త్రిపుర సీఎం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అగర్తల: ఎన్నికల సంగ్రామం అనేది ఎల్లవేళలా రాజకీయ పోరాటం అని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ పేర్కొన్నారు. రాజకీయ పోరాటానికి అత్యున్నత రూపమే ఎన్నికలని వ్యాఖ్యానించారు. ఈ నెల 18వ తేదీన త్రిపుర అసెంబ్లీకి పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. నమ్మకం, విశ్వాసంతో కూడిన పోరాటంతోనే తమను ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. తమకు ప్రత్యర్థులుగా ఉన్న వారు వారి ఆయుధ సంపత్తి, అస్త్రాలు ఉపయోగించి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుంటారని, కానీ తాము తమ ప్రత్యర్థులకు ఒక్క అవకాశం కూడా ఇవ్వబోమన్నారు.
గతంతో పోలిస్తే అన్ని విధాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని నాలుగోసారి సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాణిక్ సర్కార్ తెలిపారు. బీజేపీపై పోరాటానికి లెఫ్ట్ ఫ్రంట్ వ్యూహాన్ని వివరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, ప్రజా వ్యతిరేకత వంటి అంశాలు ప్రచారాస్త్రాలు కానున్నాయన్న సంగతి అంగీకరించారు. తామేం చేయదలిచామో ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించామని, సంస్థాగతంగా ప్రత్యర్థులకంటే పటిష్ఠంగా ఉన్నామన్నారు.

ప్రజానుకూల విధానాలతోనే లబ్ధి చేకూరుతుందన్న మాణిక్ సర్కార్

ప్రజానుకూల విధానాలతోనే లబ్ధి చేకూరుతుందన్న మాణిక్ సర్కార్

ఇటీవల త్రిపుర పర్యటనలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. ఇది సిద్దాంతాలు, రాజకీయాలు, కార్యక్రమాలు, వాటి అమలునకు సంబంధించిన పోరాటమని, ఆయన తన తరగతికి సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రాతినిధ్యం వహిస్తూ ప్రచారం చేశారన్నారు. తమ ప్రజానుకూల విధానాలే లబ్ధి చేకూరుస్తాయని మాణిక్ సర్కార్ చెప్పారు. క్రిందిస్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నానని చెప్పారు.

గిరిజనులు, గిరిజనేతరుల మధ్య చీలికకు యత్నాలు

గిరిజనులు, గిరిజనేతరుల మధ్య చీలికకు యత్నాలు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న ఇండిజినియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ)తో బీజేపీ పొత్తు అపవిత్రమని మాణిక్ సర్కార్ స్పష్టం చేశారు. త్రిపురలో నెలకొన్న ప్రజాతంత్ర వాతావరణం వల్లే గిరిజనులు, గిరిజనేతరుల మధ్య కొనసాగుతూ వచ్చిన ఐక్యతను చీల్చి, విభజన తెచ్చేందుకు బీజేపీ, ఐపీఎఫ్టీతో పొత్తు పెట్టుకున్నదని ఆరోపించారు. కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాలు సాధించిన వికాసం అదేనన్నారు. కేవలం 40 లక్షల జనాభా గల త్రిపురను మరో రాష్ట్రంగా చీల్చాలన్న ఐపీఎఫ్టీతో పొత్తు పెట్టుకోవడం వెనుక నేపథ్యమేమిటో అందరికీ తెలిసిందేనన్నారు.

ఐపీఎఫ్టీతో బీజేపీ అంటకాగాల్సిన అగత్యం ఏమిటి?

ఐపీఎఫ్టీతో బీజేపీ అంటకాగాల్సిన అగత్యం ఏమిటి?

నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఎన్ఎల్ఎఫ్టీ) అనే వేర్పాటువాద సంస్థ మార్గంలోనే ఐపీఎఫ్టీ ఆవిర్భవించిందే తప్ప అది చట్ట విరుద్ధ సంస్థ అని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది కూడా. బంగ్లాదేశ్ భూభాగంలో క్యాంపులు ఏర్పాటు చేసుకుని త్రిపురలోకి రావాలని చేసిన ప్రయత్నాలను తమ ప్రభుత్వం తిప్పికొట్టిందని అన్నారు. కానీ కేంద్రంలోని పాలకులు ఒకానొక దశలో కల్లోలిత ప్రాంతంగా త్రిపురను ప్రకటించి సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను అమలులోకి తేవాలని ప్రయత్నాలు సాగాయని తెలిపారు. కానీ తాము వీటన్నింటికీ చాలా దూరంగా ఉన్నామని తెలిపారు. తాము రాష్ట్రంలో శాంతి, ఐక్యత, ప్రశాంతత తీసుకు వచ్చామని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ అన్నారు. రాత్రీ పగలు కష్టపడితేనే అభివ్రుద్ధి సాధిస్తామని అన్నారు. ఒక పద్దతి ప్రకారం తాము పని చేస్తున్నామని తెలిపారు. కానీ ఐపీఎఫ్టీతో బీజేపీ అంటకాగాల్సిన అవసరం ఏమిటని మాణిక్ సర్కార్ ప్రశ్నించారు.

ప్రజానుకూల విధానాలు అమలుతోనే ప్రజామోదం

ప్రజానుకూల విధానాలు అమలుతోనే ప్రజామోదం

త్రిపురలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి దేశానికి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందజేయగలదని మాణిక్ సర్కార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా పోరాటాల నుంచి వచ్చిన నాయకులే ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. వారు (బీజేపీ) నాయకులను మార్చాలనే నినాదాన్ని ముందుకు తెచ్చారన్నారు. కానీ సామాన్య ప్రజల సమస్యలను నాయకులను మార్చడంతో సాధ్యం కాదన్నారు. ప్రజానుకూల, ప్రత్యామ్నాయ విధానాలు కావాల్సిన అవసరం ఉన్నదన్నారు. కేంద్రం మద్దతు లేకుండానే త్రిపురలో ప్రజల అనుకూల విధానాలు అమలు చేస్తున్నామని అన్నారు.

ఇలా కలత నిద్రకు దూరమవుతున్న బీజేపీ నేతలు

ఇలా కలత నిద్రకు దూరమవుతున్న బీజేపీ నేతలు

త్రిపుర ప్రజల ఆకాంక్షలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని మాణిక్ సర్కార్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అభివ్రుద్ధి చేపట్టినందు వల్లే లెఫ్ట్ ఫ్రంట్‌ను ఓడించేందుకు బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్నదన్నారు. కానీ బీజేపీ నేతలు రాత్రిళ్లు కలత నిద్రకు పరిమితం అవుతున్నారన్నారు. ప్రధాని, హోంమంత్రి, ఆర్థిక మంత్రి దాదాపుగా కేంద్ర క్యాబినెట్ అంతా క్యాంప్ వేయడానికి ఇది ఉత్తరప్రదేశ్ కాదని, కేవలం చిన్న రాష్ట్రం త్రిపురలో వారి ప్రచారమే పరిస్థితిని తెలియజేస్తున్నదన్నారు. సిద్ధాంతాల ప్రాతిపదికనే పోరాడతామని స్పష్టం చేశారు.

నోట్ల రద్దుతో 98 లక్షల ఉద్యోగాలు హాంఫట్

నోట్ల రద్దుతో 98 లక్షల ఉద్యోగాలు హాంఫట్

నిరుద్యోగ సమస్య అనేది జాతీయ సమస్య అన్నారు. ఇది కేవలం త్రిపురకు సంబంధించింది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల పరిధిలో 45 లక్షల ఉద్యోగాలు ఖాళీ అయ్యాయని మాణిక్ సర్కార్ గుర్తు చేశారు. నోట్ల రద్దు వల్ల 98 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు ప్రతియేటా కొత్తగా నిరుద్యోగులు బయటకు వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకదాని తర్వాత మరొకటి విక్రయానికి గురవుతుండటంతో అనిశ్చితి నెలకొంటున్నదన్నారు. దీంతో ఆయా సంస్థల్లోకి ప్రైవేట్ పెట్టుబడులు రావడంతో సిబ్బందిని తగ్గించి లాభాలకే ప్రాధాన్యం ఇస్తాయని చెప్పారు.

ప్రధాని మోదీ మేకిన్ ఇండియా ఎక్కడ

ప్రధాని మోదీ మేకిన్ ఇండియా ఎక్కడ

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతియేటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ నిలుపుకోనే లేదన్నారు. బీజేపీ నేతలు చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీల సంగతేమిటని మాణిక్ సర్కార్ ప్రశ్నించారు. కానీ తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు స్సష్టం చేశారు. నూతన ప్రాజెక్టుల తీసుకొస్తున్నామని మాణిక్ సర్కార్ అన్నారు. పారిశ్రామికంగా అనుకూల వాతావరణం కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం అని మాణిక్ సర్కార్ వివరించారు. ప్రధాని మోదీ ప్రకటించిన ‘మేకిన్ ఇండియా' ఎక్కడ ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించారు.

ప్రజల వ్యక్తిగత ఆదాయం పెరిగిందన్న త్రిపుర సీఎం

ప్రజల వ్యక్తిగత ఆదాయం పెరిగిందన్న త్రిపుర సీఎం

రైలు ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టుల కోసం పోరాడిన రోజులు ఉన్నాయని గుర్తు చేసిన మాణిక్ సర్కార్ ప్రస్తుతం తాము అదనంగా 140 మెగావాట్ల విద్యుత్.. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు విక్రయిస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ విద్యుత్‌ను ఇతర ప్రాంతాలకు సరఫరా చేయలేకపోయిందని మాణిక్ సర్కార్ మండిపడ్డారు. టెలీ కమ్యూనికేషన్లు, రోడ్ల అనుసంధానం పెరిగిందన్నారు. 15 ఏళ్ల క్రితం పరిస్థితితో పోలిస్తే చాలా పురోగతి సాధించామని మాణిక్ సర్కార్ చెప్పారు. ప్రజలు సగటున రూ.15 వేల నుంచి రూ.80 వేల వ్యక్తిగత ఆదాయం పెంచుకున్నారని చేశారు. త్రిపుర చిన్న రాష్ట్రమైనా మార్కెట్ అభివ్రుద్ధి చేస్తున్నామన్నారు. పారిశ్రామికీకరణకు అనుకూల వాతావరణం ఏర్పరరిచామన్నారు.

English summary
The four-time Tripura chief minister Manik Sarkar discusses the Left Front’s strategy to fight the BJP, the possible impact of anti-incumbency in the assembly elections, unemployment in the state and more. He said that his party well prepared for assembly elections and not afraid our opponents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X