వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసహనం: అమీర్‌కు షారుక్ మద్దతు, ఏమన్నారు?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: అసహనంపై అమీర్ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుక్, అమీర్‌కు మద్దతుగా నిలిచారు. అమీర్ ఖాన్ అసహనం వివాదంపై తొలిసారి స్పందించిన షారుక్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

అసహనం వివాదంపై ఓ ఇంగ్లీషు ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ దేశభక్తి అనేది తనకు తానుగా మనసులో ఉంచుకోవాల్సిన భావన అని చెప్పారు. దేశానికి మంచి జరగాలని ఆలోచించడం, మంచి చేయడం తప్ప దేశభక్తిని ఏ మార్గం ద్వారా నిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Intolerance Debate: Shahrukh Khan finally breaks silence on Aamir Khan; here's what he said

అలాకాకుండా నేను అవినీతికి పాల్పడితే, దేశానికి హాని కలుగుతుందన్నారు. తద్వారా నేను దేశానికి హాని చేసినట్లేనని షారుక్ తెలిపారు. ఎటువంటి విషయంపైన అయినా తనకు మాట్లాడే హక్కు ఉందని షారుక్ ఖాన్ అన్నారు. 25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నానని, ఎవరైనా ఏదైనా విషయంపైన తన అభిప్రాయం కావాలంటే దానిపై మాట్లాడుతానని షారుక్ ఖాన్ అన్నారు.

ఇక సోషల్ మీడియాపై కూడా షారుక్ తన అభిప్రాయాన్ని తెలిపారు. ట్విట్టర్‌తో పాటు ఇతర మీడియాల్లో ఎవరైనా స్వేచ్ఛగా సమాచారం పంచుకోవచ్చన్నారు. అయితే స్వేచ్ఛగా పంచుకునే అభిప్రాయమే సంచనాలుగా మారుతుందని వ్యాఖ్యానించారు. అందుకే సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని షారుక్ స్పష్టం చేశారు.

English summary
Shahrukh, while speaking on the controversy, said, "You don't have to be proving your patriotism in any other way, except for thinking good for the country and doing good."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X