వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ వచ్చి చూడాలని కోరితే.. ఏం చేశావ్ రాహుల్.. ఎప్పుడూ స్వార్థ రాజకీయాలేనా అని సత్యపాల్ మాలిక్

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దగ్గరుండి చూడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కోరానని గుర్తుచేశారు కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. కానీ ఆయన అఖిలపక్ష నేతలను తీసుకొచ్చి రాజకీయం చేశారని విమర్శించారు. ఇది సరికాదని .. మంచి మాటతో వచ్చి చూడాలని కోరితే .. తన స్వార్థ రాజకీయాలు చేయడం తగదన్నారు.

వచ్చి చూడమని కోరితే ..

వచ్చి చూడమని కోరితే ..


తాను మంచితనంతో, మంచి మనస్సుతో కశ్మీర్ వచ్చి పరిస్థితిని చూడాలని కోరితే .. రాహుల్ రాజకీయం చేశారని విమర్శించారు సత్యపాల్ మాలిక్. రాజకీయ పార్టీలు ఎప్పుడూ జాతీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని సూచించారు. కశ్మీర్ అంశంపై పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ నోరు మెదపలేరని పేర్కొన్నారు. అతని సహచరులు మాట్లాడారే తప్పా .. రాహుల్ ఎందుకు ప్రసంగించలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో ఉండి ఏం మాట్లాడలేదని రాహుల్ .. కశ్మీర్‌కు వచ్చి ఏం పరిశీలిస్తారు అని నిలదీశారు.

కశ్మీర్‌కు అఖిలపక్షం ..

కశ్మీర్‌కు అఖిలపక్షం ..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు కశ్మీర్ వెళ్లారు. గులాం నబీ, కేసీ వేణుగోపాల్, ఆనంద్ శర్మ, టీఎంసీ నుంచి దినేశ్ త్రివేది, డీఎంకే నుంచి తిరుచ్చి శివ, సీపీఎం నుంచి సీతారాం ఏచూరీ, సీపీఐ నుంచి రాజా, లోక్‌తాంత్రిక్ జనతాదళ్ శరద్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ మనోజ్ ఝా, ఎన్సీపీ నుంచి మజీద్ మెమన్, జనతాదళ్ సెక్యులర్ నుంచి డీ కుపేంద్ర రెడ్డి బృందం కశ్మీర్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లింది. అయితే వీరు శ్రీనగర్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. కశ్మీర్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతుందని ... మీ పర్యటనతో పరిస్థితి చేయి దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని సూచించారు.

నేతలపై నిషేధం ..

నేతలపై నిషేధం ..

కశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దుచేసిన తర్వాత కశ్మీర్, లడాఖ్‌లలో రాజకీయ నేతల పర్యటనపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్భందంలో ఉంచారు. ఈ క్రమంలో అఖిలపక్ష సమావేశం కశ్మీర్ రావడంతో పోలీసులు ముందే అలర్టయ్యారు. వారిని అడ్డుకొని .. తిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీచేశారు.

English summary
jammu and Kashmir (J&K) Governor Satya Pal Malik on Saturday said that he had invited Congress leader Rahul Gandhi to Kashmir out of goodwill. Satya Pal Malik also said that while he had invited Rahul Gandhi purely out of goodwill, the Congress leader started politicising the J&K issue. Satya Pal Malik's statement came hours after a delegation of opposition leaders including Rahul Gandhi was denied permission to step out of Srinagar airport and was sent back an hour after landing in the city. The delegation was visiting Srinagar to review the situation, weeks after Satya Pal Malik invited Rahul Gandhi to visit the Valley.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X