వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశమంతా సంచలనం సృష్టించి ఆర్థిక మాజీ మంత్రిని చిక్కుల్లో పడేసిన ఐఎన్ఎక్స్ కేసు ఏంటో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఎన్‌ఎక్స్‌ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ఉందంటూ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరం, పీటర్ ముఖర్జీలు నిందితులుగా ఉన్నారు. గతేడాది కార్తిని అరెస్ట్‌ చేసిన దర్యాప్తు సంస్థలు 23 రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారణ చేపట్టాయి. అయితే ఇటీవల పీటర్ అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే.

మే 15. 2017 : ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు నిబంధనలను ఉల్లంఘించి ఐఎన్ఎక్స్ మీడియాలో పెట్టుబడులు పెట్టారని .. అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ ప్రమేయంతో జరిగిందని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

inx case timeline of events

జూన్ 16 2017 : ఐఎన్ఎక్స్ కేటాయింపుల్లో కార్తీ పాత్ర ఉందని ఫారినర్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, బ్యూరో ఇమ్మిగ్రేషన్ సంస్థలు కార్తీపై లుక్ ఔట్ సర్క్యులర్ నోటీసులు జారీచేశారు.

ఆగస్టు 10, 2017 : లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన కార్తీ, మరో నలుగురు. దీనిపై స్టే విధించిన న్యాయస్థానం

ఆగస్టు 14, 2017 : లుక్ ఔట్ నోటీసులపై మద్రాస్ హైకోర్టు విధించిన స్టేపై స్టే వేసిన సుప్రీంకోర్టు.

ఆగస్టు 18, 2017 : నోటీసుల కేసులో ఆగస్టు 23న సీబీఐ ముందు హాజరుకావాలని కార్తీకి సుప్రీంకోర్టు స్పష్టీకరణ

సెప్టెంబర్ 22, 2017 : విదేశాల్లో ఉన్న బ్యాంకు ఖాతాలను మూసివేసేందుకు కార్తీ ఫారిన్ వెళ్తున్నారని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్

డిసెంబర్ 8 2017 : ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో సీబీఐ జారీచేసిన సమన్లను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కార్తీ

జనవరి 31 2018 : కార్తీ, ఇతరులపై జారీచేసిన నోటీసులపై రిమాండ్ విధించిన సుప్రీంకోర్టు

ఫిబ్రవరి 16, 2018 : అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి దేశం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన కార్తీ సీఏ భాస్కర రామన్ అరెస్ట్

ఫిబ్రవరి 28, 2018 : చెన్నై ఎయిర్‌పోర్టులో కార్తీ అరెస్ట్, అక్కడినుంచి ఢిల్లీ తరలింపు, అతనికి ఒకరోజు కస్టడీ విధించిన కోర్టు

మార్చి 1, 2018 : ఐదురోజుల సీబీఐ కస్టడీకి కార్తీ

మార్చి 5, 2018 : మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ జారీచేసిన సమన్లను సుప్రీంకోర్టులో చాలెంజ్ చేసిన కార్తీ

మార్చి 6, 2018 : కార్తీకి స్పెషల్ కోర్టు మూడురోజుల కస్టడీకి అప్పగించింది. కార్తీ బెయిల్ పిటిషన్‌ విచారణ మార్చి 9కి వాయిదా పడింది.

మార్చి 9, 2018 : కార్తీని మరో మూడురోజుల సీబీఐ కస్టడీకి అప్పగించిన ప్రత్యేక కోర్టు

మార్చి 12, 2018 : కార్తీకి మరో 12 రోజుల జ్యుడిషీయల్ కస్టడీకి ఇస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు. మార్చి 24 వరకు కస్టడీలోనే కార్తీ.

మార్చి 13, 2018 : కార్తీ సీఏ భాస్కర రామన్‌కు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు

మార్చి 15, 2018 : ఈ కేసులో కార్తీని మార్చి 26 వరకు అరెస్ట్ చేయొద్దని ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు

మార్చి 16, 2018 : ఐఎన్ఎక్స్ మీడియా అవినీతిలో కార్తీ బెయిల్ పిటిషన్‌ను రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు

మార్చి 23, 2018 : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు

మార్చి 26, 2018 : మీడియా అధినేత పీటర్ ముఖర్జీని మార్చి 31 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు

మార్చి 26, 2018 : మనీ ల్యాండరింగ్ కేసులో కార్తీకి ఏప్రిల్ 2 వరకు సుప్రీంకోర్టులో ఊరట

మార్చి 31, 2018 : జ్యుడిషీయల్ కస్టడీకి పీటర్ ముఖర్జీ. ఏప్రిల్ 13 వరకు అని ఢిల్లీ కోర్టు స్పష్టీకరణ

మే 30, 2018 : ఐఎన్ఎక్స్ కేసులో ఈడీ మనీ ల్యాండరింగ్, సీబీఐ సమన్లు .. దీనిపై ఢిల్లీ కోర్టులో బెయిల్ కోసం చిదంబరం పిటిషన్

మే 31, 2018 : ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట. జూలై 3 వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశం

జూలై 23, 2018 : మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీని చాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో చిదంబరం పిటిషన్

జూలై 25, 2018 : ఈ రెండు కేసుల్లో చిదంబరం అరెస్ట్‌ను నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు

జనవరి 25, 2019 : రెండు కేసులకు సంబంధించి చిదంబరం బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్

ఆగస్ట్ 20, 2019 : ఐఎన్ఎక్స్ మీడాియా కేసులో చిదంబరానికి బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. సుప్రీంకోర్టుకు వెళ్లేవరకు మూడురోజుల వరకు అరెస్ట్‌పై స్టే ఇవ్వాలని కోరినా నిరాకరించిన హైకోర్టు.

English summary
In a setback for former Union minister P. Chidambaram, the Delhi High Court on Tuesday dismissed his anticipatory bail plea in the corruption and money laundering cases related to INX Media scam. The Delhi High Court also declined interim protection from arrest to the Congress leader for approaching the Supreme Court in the corruption and money laundering cases. This means that the former minister could be arrested for custodial questioning in the case. The following is the chronology of events in the INX Media corruption and money laundering cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X