వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎన్ఎఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు ఊరట, ‘అరెస్ట్ చేయొద్దు’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరంకు ఐఎన్ఎక్స్ మీడియా కేసులోనూ ఊరట లభించింది. ఆయనను సీబీఐ అరెస్ట్ చేయకుండా కోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది. జులై 3 వరకు చిదంబరంను అరెస్ట్ చేయొద్దని కోర్టు సీబీఐని ఆదేశించింది.

అయితే, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణకు సహకరించాలని కోర్టు చిదంబరాన్ని ఆదేశించింది. సీబీఐ పిలిచినప్పుడు వెళ్లాలని చిదంబరంకు స్పష్టం చేసింది. అలాగే చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీబీఐని స్పందన కోరింది.

INX Media Case: Chidambaram gets protection from arrest till July 3

కాగా, ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసులో జూన్ 5 వరకు చిదంబరాన్ని అరెస్ట్ చేయవద్దని బుధశారం ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం ఈడీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై చిదంబరం తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించగా, సీబీఐ తరపున ఏఎస్‌జీ తుషార్ మెహతా వాదించారు.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణకు హాజరయ్యేందుకు జూన్ 6 సమయం ఇవ్వాలని, ఆ తర్వాతే తనను ప్రశ్నించడానికి పిలవాలని చిదంబరం సీబీఐని కోరారు. ఇది ఇలా ఉండగా, గురువారం ఈ కేసులో సీబీఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సీబీఐ కార్యాలయానికి చిదంబరం బయల్దేరారు.

English summary
Former Union Minister P Chidambaram on Thursday got interim protection from arrest by CBI till July 3 in the INX Media Case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X