వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

INX Media case: చిదంబరంకు షాక్, ఈడీ విచారణకు ఢిల్లీ కోర్టు గ్రీన్ సిగ్నల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరంకు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మరో షాక్ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నవంబర్ 22-23 వరకు తీహార్ జైలులో చిదంబరంను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఢిల్లీ కోర్టు అనుమతిచ్చింది.

90 రోజులుగా జైల్లోనే: బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు చిదంబరం90 రోజులుగా జైల్లోనే: బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు చిదంబరం

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో చిదంబరంను విచారించేందుకు అనుమతివ్వాలంటూ గురువారం రోజ్ ఎవెన్యూ కోర్టులో ఈడీ కోరింది. కాగా, ఇంతకుముందు ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

INX Media case: Delhi court allows ED to interrogate Chidambaram

ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ విచారణకు అంగీకరించింది.

గత 90 రోజులుగా చిదంబరం జైల్లోనే ఉన్నారని వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని చిదంబరం తరపున కోరారు. దీనిపై విచారించిన జస్టిస్ బోబ్డే మంగళవారం లేదా బుధవారం విచారిస్తామని స్పష్టం చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో అరెస్టైన చిదంబరం బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించిన విషయం తెలిసిందే.

అలాగే కస్టడీని పొడిగించాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన పిటిషన్ ను ఆమోదిస్తూ నవంబర్ 27 వరకు చిదంబరం జుడీషియల్ రిమాండ్ ను పొడిగించింది. కాగా, ఈ నేపథ్యంలో ఆయన సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

చిదంబరం అరెస్ట్ కూడా గందరగోళం మధ్య సాగిన విషయం తెలిసిందే. సీబీఐ అధికారులు ఆయన కోసం నిఘా పెట్టిమరీ అదుపులోకి తీసుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో రూ. 305 కోట్ల నిధులు అక్రమమార్గంలో ఐఎన్ఎక్స్ మీడియాకు వెళ్లేందుకు చిదంబరం కీలక పాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. 2017లో చిదంబరంపై మనీలాండరింగ్ కేసులో అభియోగాలు నమోదు చేసింది ఈడీ. మనీలాండరింగ్ కేసును సీబీఐ కూడా విచారిస్తోంది. ఆగస్టు 21న ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను సీబీఐ మొదటిసారి అరెస్ట్ చేసింది.

English summary
ADelhi court has allowed the Enforcement Directorate (ED) to interrogate former Union minister P Chidambaram in Tihar jail on November 22-23 in connection with the INX Media case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X