వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీ దెబ్బకు కేంద్ర మాజీ హోం మంత్రి చిదంబరం అరెస్టు, అప్రూవర్, ఏం జరిగిందంటే !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ హోం మంత్రి పి. చిదంబరం, అంతుకు ముందు ఆయన కుమారుడు కార్తి చిదంబరం అరెస్టుకు కారణం ఓ మహిళ. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అప్రూవర్ గా మారిన ఆ లేడీ ఇచ్చిన సమాచారం మేరకు సీబీఐ, ఈడీ అధికారులు మొదట కార్తీ చిదంబరం, తరువాత ఆయన తండ్రి కేంద్ర మాజీ హోం మంత్రి పి. చిదంబరంను అరెస్టు చేశారు. చిదంబరం అరెస్టు కావడానికి కారణం అయిన ఆ లేడీ పేరు మీడియా కింగ్ గా పేరు తెచ్చుకున్న పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణి ముఖర్జియా. కుమార్తె షీనా బోరే హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియా ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

ఇంద్రాణి ఏం చెప్పింది !

ఇంద్రాణి ఏం చెప్పింది !

2018, ఫ్రిబవరి 17వ తేదీ ఇంద్రాణి ముఖర్జియా అసలు విషయం బయటపెట్టంది. ఐఎన్ఎక్స్ మీడియాలో పెట్టబడులు పెట్టడానికి FIPB నుంచి అనుమతి రాలేదు. అప్పటి ఆర్థిక శాఖా మంత్రి పి. చిదంబరంను తాము కలిశామని, మద్యవర్థిత్వం చెయ్యడానికి కార్తి చిదంబరంను కలవాలని ఆయన సూచించారని ఇంద్రాణి ముఖర్జీయా కోర్టు ముందు, సీబీఐ అధికారుల ముందు అంగీకరించింది. తరువాత ఢిల్లీలోని హోటల్ హయాత్ హోటల్ లో కార్తి చిదంబరంతో భేటీ అయ్యామని, డీల్ కుదిరిన తరువాత కార్తీ చిదంబరం కంపెనీలకు నగదు బదిలీ (కిక్ బ్యాక్) చేశామని ఇంద్రాణి ముఖర్జీయా అంగీకరించింది. దీనికి సంబంధించి పీటర్ ముఖర్జీయా సంతకాలు చేసిన వోచర్లు బయటకు వచ్చాయి. వాటినే సీబీఐ, ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు.

కార్తి చిదంబరం బినామీ కంపెనీ ?

కార్తి చిదంబరం బినామీ కంపెనీ ?

ఢిల్లీలోని హోటల్ హయాత్ లో జరిగిన డీల్ ప్రకారం కార్తి చిదంబరం సూచించిన చెస్ మేనేజ్ మెంట్ గ్లోబల్ ప్రై. లిమిటెడ్ ను మధ్యవర్థిగా పెట్టుకుని ఎఎస్ సీఎల్ సంస్థకు ఐఎన్ఎస్స్ మీడియా సంస్థ నగదు బదిలీ చేసింది. ఈ పూర్తి వివరాలు లెగ్జర్ లో నమోదైనాయి. చెస్ మేనేజ్ మెంట్ గ్లోబల్ సంస్థ, ఐఎన్ఎస్స్ మీడియా సంస్థల మధ్య ఇదే విషయంలో సుమారు 200కు పైగా ఇ-మెయిల్స్ వచ్చి వెళ్లాయని సీబీఐ అధికారులు గుర్తించారు.

సీబీఐ చేతికి అస్త్రం

సీబీఐ చేతికి అస్త్రం

2018, ఫిబ్రవరి 17వ తేదీ ఇంద్రాణి ముఖర్జియా అప్రూవర్ గా మారారు. కార్తి చిదంబరం, ఆయన తండ్రి చిదంబరంకు వ్యతిరేకంగా న్యాయమూర్తి ముందు సాక్షం చెప్పింది. ఇంద్రాణి ముఖర్జియా ఇచ్చిన సాక్షంతో కార్తి చిదంబరం, ఆయన తండ్రి పి. చిదంబరంను అరెస్టు చెయ్యడానికి సీబీఐకి సాధ్యం అయ్యింది. ఇంద్రాణి ముఖర్జియా ఇచ్చిన ఇ-మెయిల్ సాక్షాలు, హోటల్ హయాత్ లో భేటీ వివరాలు, చిదంబరం ఇచ్చిన సూచనలు తదితర సాక్షాలు ఇప్పుడు సీబీఐ, ఈడీ అధికారులకు ఆస్త్రాలుగా మారాయి.

సింగపూర్ కంపెనీలు !

సింగపూర్ కంపెనీలు !

ఇంద్రాణి ముఖర్జియా ఇచ్చిన సమాచారం మేరకు కార్తి చిదంబరం అకౌంటెంట్ (సీఏ) భాస్కర్ రావ్ ను అరెస్టు చేశారు. ఎఎసీపీఎల్ కు ఎఫ్ ఐపీబీ అనుమతి రావడానికి రూ. 35 లక్షలు, 20, 000 యూఎస్ డాలర్లు, రూ. 60 లక్షలు, 500.000 యూఎస్ డాలర్లు ఇచ్చారని (కిక్ బ్యాక్) సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం సింగపూర్ కు చెందిన కంపెనీ, నార్త్ స్టార్ సాఫ్ట్ వేర్ సెల్యూషన్స్ పై. లి. గ్రీస్ దేశానికి చెందిన గబెన్ ట్రేడింగ్ లిమిటెడ్ కంపెనీల నుంచి వచ్చిందని సీబీఐ అధికారులు అంటున్నారు.

రూ. 305 కోట్లు బదిలి

రూ. 305 కోట్లు బదిలి

ఈ లావాదేవీలకు సంబంధించిన వోచర్స్ మొత్తం కార్తీ చిదంబరం కార్యాలయంలో సీబీఐ అధికారులకు చిక్కాయి. విదేశాల నుంచి నగదు బదిలీ చేసుకోవడానికి ఐఎన్ఎస్ మీడియా సంస్థకు 2008లో కేంద్ర హోం శాఖ కార్యాలయం నుంచి అనుమతి వచ్చింది. కార్తి చిదంబరం కార్యాలయంలో చిక్కిన వోచర్స్, నగదు బదిలీ అయిన తేదీలకు ట్యాలీ అయ్యిందని సీబీఐ అధికారులు అంటున్నారు. కార్తి చిదంబరం ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. ఐఎన్ఎక్స్ మీడియాలో రూ. 4.6 కోట్లు విదేశీ పెట్టుబడులు పెట్టడానికి FIPB అనుమతి ఇచ్చింది. కార్తి చిదంబరం ఎంట్రీతో సీన్ మారిపోయి రూ. 305 కోట్లు అక్రమంగా పెట్టబడులు వచ్చాయని ఆరోపణలు ఉన్నాయి.

ఐఎన్ఎక్స్ మీడియా కేసు

ఐఎన్ఎక్స్ మీడియా కేసు

యూపీఏ ప్రభుత్వం (యూపీఏ1) అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఆర్థిక శాఖా మంత్రి పి. చిదంబరం 2007లో ఐఎన్ఎక్స్ మీడియాలో రూ. 305 కోట్ల విదేశీ పెట్టుబడులు అక్రమంగా అనుమతి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. 2007లో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు రూ. 4.6 కోట్లు విదేశీ పెట్టుబడులు పెట్టడానికి FIPB అనుమతి ఇచ్చింది. అయితే పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జియాకు చెందిన కంపెనీలకు విదేశాలకు చెందిన రెండు కంపెనీల నుంచి అక్రమంగా రూ. 305 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఆర్థిక శాఖా విచారణకు ఆదేశించింది. ఈ కేసు నుంచి తప్పించడానికి కార్తి చిదంబరం రూ. 10 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

జైల్లో మీడియా రారాజు, ఇంద్రాణి !

జైల్లో మీడియా రారాజు, ఇంద్రాణి !

అప్పటి మీడియా రారాజుగా పిలిచే పీటర్ ముఖర్జియా ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జియా పేరుతో ఐఎన్ఎక్స్ బ్యానర్ మీద అనేక కంపెనీలు స్థాపించారు. ఐఎన్ఎక్స్ మీడియా ప్రై.లి, ఐఎన్ఎక్స్ న్యూస్ ప్రై.లి, ఐఎన్ఎక్స్ ఎక్సిక్యూటివ్ సర్చ్ ప్రై.లి. తదితర కంపెనీలు ప్రారంభించారు. 2012 ఏప్రిల్ 24వ తేదీ ఇంద్రాణి ముఖర్జియా ఆమె కుమార్తె షీనా బోరాను పక్కా ప్లాన్ తో దారుణంగా హత్య చేసిందని కేసు నమోదైయ్యింది. అంతుకు ముందే ఐఎన్ఎక్స్ గ్రూప్స్ కంపెనీల్లో పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జియా పెట్టుబడులు పెట్టారు. షీనా బోరా హత్య కేసులో అరెస్టు అయిన పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జియా ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

English summary
INX Media case: First it was Karti P. Chidambaram, now P Chidambaram, Here is How Indrani Mukerjea confession lead to downfall of father and son.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X