వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ పోలీసుల సాయంతో ఎట్టకేలకు చిదంబరం అరెస్ట్, రాత్రికి సీబీఐ ఆఫీస్‌లోనే..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఎట్టకేలకు ఆజ్ఞాతం వీడి ఏఐసీసీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు అంశాలు ప్రస్తావించారు. అసలు ఐఎన్‌ఎక్స్ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో చిదంబరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంతో సీబీఐ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఆ నేపథ్యంలో అక్కడ హై డ్రామా నెలకొంది. సీబీఐ అధికారులు లోనికి రాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అదలావుంటే అక్కడి నుంచి చిదంబరం ఆయన నివాసానికి బయలుదేరారు.

INX Media case LIVE Updates: Chidambarams lawyer writes to CBI, requests not to take any action till SC hearing

Newest First Oldest First
11:25 PM, 21 Aug

బీజేపీ చేతిలో ప్రజస్వామ్యం చచ్చిపోయిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా అన్నారు. మోడీ ప్రభుత్వం రెండోసారి గెలిచిన తర్వాత సీబీఐ, ఈడీని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయినందుకు సిగ్గుపడుతున్నామని ట్వీట్ చేశారు.
11:04 PM, 21 Aug

చిదంబరంను తీసుకు వెళ్తుండగా ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు కారు వైపు దూసుక వచ్చారు. వారిని పోలీసులు తొలగించారు.
10:46 PM, 21 Aug

తన తండ్రి చిదంబరం అరెస్టుపై కార్తి చిదంబరం మాట్లాడుతూ.. ఇదంతా బీజేపీ తప్ప ఎవరు చేస్తున్నారని, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారని భావిస్తున్నారా? అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
10:37 PM, 21 Aug

తన తండ్రి ఏ రోజు కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేయలేదని కార్తి చిదంబరం మండిపడ్డారు. 2008లో జరిగిన దానికి 2017లో కేసు నమోదు చేశారని, సమన్లు అందిన ప్రతిసారి విచారణకు హాజరయ్యారన్నారు.
10:37 PM, 21 Aug

తనపై రాజకీయ కక్షతో బీజేపీ విచారణ సంస్థలను ఉసిగొల్పుతుందని చిదంబరం ఆరోపించారు. ఆయన ప్రెస్ మీట్‌కు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
10:36 PM, 21 Aug

తన తండ్రి చిదంబరం అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమని కార్తి చిదంబరం బుధవారం ఆరోపించారు. దర్యాఫ్తు సంస్థల తీరును ఆయన తప్పుబట్టారు.
10:18 PM, 21 Aug

చిదంబరం అరెస్టును ఆయన కొడుకు కార్తి చిదంబరం ఖండించారు.
10:10 PM, 21 Aug

రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సీబీఐ హెడ్ క్వార్టర్‌కు తరలించారు.
10:05 PM, 21 Aug

చిదంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ, రాత్రి హెడ్ క్వార్టర్‌లోనే ఉంచనుంది.
10:00 PM, 21 Aug

చిదంబరం అరెస్ట్ రాజకీయ ప్రేరణతో కూడుకున్నదని కార్తి చిదంబరం ఆరోపించారు.
9:54 PM, 21 Aug

చిదంబరం అరెస్ట్‌తో కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం
9:52 PM, 21 Aug

ఏఐసీసీ కార్యాలయం, చిదంబరం ఇంటి వద్ద దాదాపు గంట సేపు హైడ్రామా
9:52 PM, 21 Aug

ఐఎన్ఎక్స్ కేసులో రూ.305 కోట్ల అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు
9:52 PM, 21 Aug

ఐఎన్ఎక్స్ కేసులో ఇప్పటికే చిదంబరం కుమారుడు కార్తీ అరెస్ట్, అప్రూవర్‌గా మారిన పీటర్ ముఖర్జీ
9:50 PM, 21 Aug

సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు చిదంబరం తరలింపు
9:49 PM, 21 Aug

ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరాన్ని అదుపులోకి తీసుకున్న సీబీఐ
9:49 PM, 21 Aug

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అరెస్ట్
9:12 PM, 21 Aug

పోలీసుల సాయం తీసుకొని చిదంబరం ఇంటికి వచ్చిన సీబీఐ, ఈడీ
9:12 PM, 21 Aug

అర్ధరాత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసే అవకాశం
9:11 PM, 21 Aug

చిదంబరం ఇంటి వద్ద ఉద్రిక్తత
9:11 PM, 21 Aug

చిదంబరం ఇంటికి చేరుకున్న ఈడీ బృందం
9:10 PM, 21 Aug

చిదంబరం ఇంటికి సమీపంలో రెండు సీబీఐ బృందాలు
8:58 PM, 21 Aug

చిదంబరం ఇంటి ముందు 2 నిమిషాలు వేచిచూసిన సీబీఐ అధికారులు, చివరకు గోడ దూకి ఇంటిలోకి ప్రవేశం
8:56 PM, 21 Aug

చిదంబరం ఇంటికి చేరుకుంటున్న పార్టీ సీనియర్ నేతలు
8:55 PM, 21 Aug

చిదంబరం ఇంటికి చేరుకున్న ఈడీ, సీబీఐ అధికారులు
8:55 PM, 21 Aug

కాంగ్రెస్ కార్యాలయం నుంచి జోర్‌బాగ్‌లోని తన ఇంటికి వెళ్లిపోయిన చిదంబరం
8:41 PM, 21 Aug

హడావిడిగా ప్రెస్ మీట్ ముగించి వెళ్లిపోయిన చిదంబరం
8:41 PM, 21 Aug

ఐఎన్‌ఎక్స్ కేసుతో సంబంధం లేదన్న చిదంబరం
8:40 PM, 21 Aug

ఏఐసీసీ కార్యాలయం లోనికి సీబీఐ అధికారులు రాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అలర్ట్
8:40 PM, 21 Aug

ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంటున్న కాంగ్రెస్ సీనియర్లు
READ MORE

English summary
Congress leader P Chidambaram suffered a major setback Tuesday as the Delhi High Court dismissed his anticipatory bail in the INX Media scam, paving way for the investigating agencies, CBI and ED, to arrest him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X