వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్తీకి చిదంబరం భరోసా: నేనున్నాగా!.. ఆందోళన చెందకు..

|
Google Oneindia TeluguNews

Recommended Video

INX Media Case : Karti Chidambaram in CBI Custody | Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ సంస్థలోకి అక్రమంగా విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

విచారణ నిమిత్తం కార్తీ చిదంబరంను సీబీఐ ఐదు రోజుల కస్టడీకి తీసుకుంది. కార్తీ అరెస్టయినప్పటికీ.. తండ్రి చిదంబరం మాత్రం ఏమి కాదన్న భరోసాతోనే ఉన్నారు. 'నువ్వేమి బాధపడకు.. నేనున్నాగా..' అంటూ కొడుకుకు భరోసా కూడా ఇచ్చారు.

ఆందోళన చెందవద్దన్న చిదంబరం..:

ఆందోళన చెందవద్దన్న చిదంబరం..:

గురువారం సీబీఐ కోర్టులో కార్తీని కలిసిన సందర్భంగా చిదంబరం ఆయనతో మాట్లాడారు. చిదంబరం కోర్టు వద్దకు చేరుకునేసరికి.. అప్పటికే ఆయన భార్య నళిని చిదంబరం ఆయన కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

కార్తీని కలిశాక.. అతని భుజంపై చేయి వేసి.. కేసు పట్ల అంతగా ఆందోళన చెందవద్దని చిదంబరం కార్తీకి భరోసా ఇచ్చారు. కాగా, ఈ కేసులో చిదంబరంను కూడా సీబీఐ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మాట్లాడేందుకు అనుమతి..:

మాట్లాడేందుకు అనుమతి..:

సీబీఐ కోర్టులో వాదనల సందర్భంగా చిదంబరం ఆయన భార్య ఇద్దరూ అక్కడ ఉన్నారు. దాదాపు మూడు గంటల పాటు కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. విచారణ మధ్యలో విరామ సమయంలో.. తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కార్తీకి న్యాయమూర్తి అనుమతినిచ్చారు. అయితే విచారణ అధికారి పర్యవేక్షణలోనే మాట్లాడాలని షరతు విధించారు.

తండ్రీకొడుకులు భయపడ్డారు: కార్తీ అరెస్టుకు ముందే సుప్రీంలో చిదంబరం పిటిషన్! తండ్రీకొడుకులు భయపడ్డారు: కార్తీ అరెస్టుకు ముందే సుప్రీంలో చిదంబరం పిటిషన్!

ఇంటి భోజనానికి 'నో':

ఇంటి భోజనానికి 'నో':

కస్టడీలో తనకు ఇంటి భోజనం తెప్పించాలన్న కార్తీ ప్రతిపాదకు న్యాయమూర్తి ఒప్పుకోలేదు. అయితే మెడిసిన్స్,హెల్త్ చెకప్‌కు మాత్రం అనుమతినిచ్చారు. అలాగే కార్తీని కలిసేందుకు ఆయన తరుపు న్యాయవాదికి కూడా అనుమతినిచ్చారు. ప్రతీ రోజు ఉదయం ఒక గంట పాటు, సాయంత్రం ఒక గంట పాటు ఆ వెసులుబాటు కల్పించారు.

కార్తీ చిదంబరం: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు ఏమిటి? కార్తీ చిదంబరం: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు ఏమిటి?

మార్చి 6వరకు కస్టడీ:

మార్చి 6వరకు కస్టడీ:

ప్రత్యేక న్యాయమూర్తి సునీల్ రానా కార్తీ కస్టడీని మార్చి 6, 2018వరకు పొడగించారు. తమ వద్ద నివ్వెరపోయే సాక్ష్యాధారాలు ఉన్నాయని, విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన ప్రమేయం ఉన్న కొన్ని వ్యవహారాలు అనుమానాస్పదంగా ఉన్నాయని సీబీఐ చేసిన ఆరోపణలతో.. కోర్టు కస్టడీ గడువును పెంచింది.

English summary
Hours after Karti Chidambaram was sent to Central Bureau of Investigation (CBI) custody for five days, senior Congress leader and former finance minister P Chidambaram told his son, "Dont worry, I am there."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X