వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరంకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ తేల్చి చెప్పింది.

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: 5 వరకు చిదంబరం కస్టడీ పొడిగింపు, తీహార్‌కు వద్దుఐఎన్ఎక్స్ మీడియా కేసు: 5 వరకు చిదంబరం కస్టడీ పొడిగింపు, తీహార్‌కు వద్దు

ఇలాంటి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. బెయిల్ ఇస్తే చిదంబరం ఈ కేసుపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఆర్టికల్ 32 ప్రకారం ముందస్తు బెయిల్ ఇవ్వడం అనేది ప్రాథమిక హక్కేమీ కాదని స్పష్టం చేసింది. తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తెలిపింది.

 INX Media case: SC rejects anticipatory bail to P Chidambaram in ED case

కాగా, చిదంబరంను ప్రశ్నించిన విధానాన్ని, ప్రశ్నలను సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు ఈడీ సమర్పించింది. జస్టిస్ ఆర్ బానుమతి, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఎదుట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ నివేదికను సమర్పించారు.

ఆగస్టు 21న రాత్రి చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 15రోజులపాటు సీబీఐ కస్టడీకి ఇచ్చింది కోర్టు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నాటి నుంచి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు చిదంబరం. అయితే, ఇక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. తాజాగా చిదంబరం ముందస్తు పిటిషన్ తిరస్కరించడంతో ఆయనను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

English summary
The Supreme Court refused to grant a pre-arrest bail to former Finance Minister P Chidambaram in INX Media money laundering case lodged by Enforcement Directorate (ED).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X