వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్లుడి పందేలు: చెన్నై‌టీం వ్యూహాలు లీక్, శ్రీని స్పందన

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ఐపిఎల్ బెట్టింగు కేసులో శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సీనియర్ అధికారి గురునాథ్ మీయప్పన్ పైన శనివారం అభియోగపత్రం దాఖలైంది. శ్రీనివాస్ అల్లుడు పందేల రాయుడు, జట్టు సమాచారాన్ని బయటకు అందించాడని అభియోగాలు దాఖలు చేశారు.

ఐపిఎల్-6 బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ముంబై పోలీసులు శనివారం ముగ్గురిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. మీయప్పన్, బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్, పాక్ అంపైర్ అసద్ రవూఫ్‌తో పాటు ఆరోపణలెదుర్కొంటున్న మరో 15 మంది బెకీల పేర్లను కూడా చార్జ్‌షీట్‌లో చేర్చారు. రవూఫ్‌ను మోస్ట్ వాంటెండ్‌గా పేర్కొన్నారు. ఈ కేసు నవంబర్ 21న ముంబై ఖిలా కోర్టుకు వాదనలకు రానుంది.

Gurunath Meiyappan

ఐపిఎల్ బెట్టింగ్ కేసులో వీరు ఫోర్జరీ, చీటింగ్, నేరపూరిత కుట్రలకు పాల్పడ్డారని చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మీపప్పన్ సూపర్ కింగ్స్ వ్యూహాల్ని లీక్ చేయడంతో పాటు తన సొంత జట్టు పైనే భారీగా బెట్టింగ్‌కు పాల్పడ్డాడని అభియోగ పత్రంలో వెల్లడించారు. మేయప్పన్‌పై ఐపిసి 415, 420, 417, ముంబై పోలీస్ చట్టం 130, ఐటి చట్టం 66 ఎ కింద చార్జ్‌షీట్ నమోదు చేశారు. ఈ కుంభకోణంలో అరెస్టయిన 22 మంది లో 8 మందిని ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు.

ముంబై పోలీసులు 11,500 పేజీలతో కూడిన అభియోగ పత్రాలను రూపొందించారు. 200 మంది సాక్షుల వాంగ్ములాలను, ఆరు ఫోరెన్సిక్ నివేదికలతో 181 సీజ్‌లను, సిసి టివి ఫుటేజ్, సీమ్ కార్డ్ వివరాలు, ఇతర సాక్షాల్యను ఈ చార్జ్‌షీట్‌కు జత చేశారు.

చార్జ్‌షీట్ ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ సమచారాన్ని మీయప్పన్ బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్‌కు చెప్పాడు. దారాసింగ్ ఆ వివరాలను బుకీలకు చేరవేశాడు. విందూ తనతో పాటు మేయప్పన్ తరఫునా బుకీల ద్వారా బెట్టింగ్‌లు కాశాడు. కాగా, చార్జ్‌షీట్‌లో పాకిస్థాన్ అంపైర్ పేరు నమోదు చేయడంపై ఆ దేశ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రవూఫ్ అమాయకుడని అభిప్రాయపడ్డారు. బుకీలతో అతనికి ఎలాంటి సంబంధాలూ లేవని చెప్పుకొచ్చారు.

బెట్టింగ్ కుంభకోణంలో నిందితుడైన అల్లుడు మీయప్పన్ విషయంలో తానేమీ చేయలేనని శ్రీనివాసన్ తెలిపాడు. మీయప్పనే దీన్ని ఎదుర్కోవాలన్నాడు. చార్జ్‌షీట్‌లో అతను ఉంటే చట్టం తన పని తాను చేస్తుందని, ఇప్పటికే అతన్ని సస్పెండ్ చేశామని, ఇక క్రికెట్‌లో ఏమీ చేయలేడని శ్రీనివాసన్ చెప్పారు.

English summary
Mumbai police filed a voluminous chargesheet in the 
 
 Indian Premier League-6 (IPL-6) spot-fixing scam, 
 
 naming Bollywood actor Vindoo Dara Singh, cricket 
 
 board chief N. Srinivasan's son-in-law Gurunath 
 
 Meiyappan, Pakistani umpire Asad Rauf and many 
 
 others before a metropolitan magistrate here 
 
 Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X