IPL betting: భార్యకు మ్యాటర్ లీక్ అవుతుందని కన్న కొడుకును చంపేసిన తండ్రి, శవం !
బెంగళూరు/ కోలారు/ చింతామణి: వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. వ్యవసాయం, వ్యాపారం చేస్తున్న భర్త విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటుపడ్డాడు. స్కూల్ కు వెళ్లిన అతని కొడుకు కనపడకుండా పోయాడు. పక్క జిల్లాలో కనపడుకుండా పోయిన అబ్బాయి శవమై కనపించాడు. అబ్బాయి హత్య కేసులో అతని తండ్రి అరెస్టు కావడం కలకలం రేపింది.
కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లాలోని చింతామణి తాలుకాలోని మాదరకల్లు గ్రామంలో మణికంఠ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మణికంటకు నిఖిల్ (12) అనే కొడుకు ఉన్నాడు నిఖిల్ 6వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజు ఎప్పటిలాగే మణికంఠ అతని కొడుకు నిఖిల్ ను స్కూల్ దగ్గర వదలడం, సాయంత్రం ఇంటికి పిలుచుకుని రావడం చేస్తున్నాడు. స్కూల్ కు వెళ్లిన నిఖిల్ తరువాత తిరిగిరాలేదు.

మా కొడుకు నిఖిల్ కనపడటం లేదని అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ఇదే సమయంలో చిక్కబళ్లాపురం పక్క జిల్లా అయిన కోలారు జిల్లాలోని శెట్టిమాదమంగల ప్రాంతంలోని చెరువులో నిఖిల్ శవమై కనిపించాడు. అనేక కోణాల్లో కేసు విచారణ చేసిన పోలీసులు నిఖిల్ తండ్రి మణికంఠ అతని కొడుకును హత్య చేశాడని పోలీసులు అన్నారు.
ఐపీల్ బెట్టింగ్ కోసం మణికంఠ లక్షల రూపాయల అప్పు చేశాడు. కొడుకు నిఖిల్ ను స్కూల్ కు పిలుచుకుని వెలుతున్న సమయంలో అప్పులు ఇచ్చిన వాళ్లు మణికంఠను డబ్బులు తిరిగి ఇవ్వాలని బూతులు మాట్లాడారు. ఆ సమయంలో మణికంఠ ఎంత వేడుకున్నా అప్పులు ఇచ్చిన వాళ్లు బూతులు తిట్టారని, ఆ విషయం కొడుకు నిఖిల్ భార్యకు చెబుతాడనే భయంతో కన్న కొడుకు నిఖిల్ ను మణికంఠ హత్య చేశాడని పోలీసులు అన్నారు.












Click it and Unblock the Notifications