వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏమి కష్టం వచ్చిందో: ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఐపీఎస్ అధికారి..పరిస్థితి విషమం

|
Google Oneindia TeluguNews

కాన్పూర్ : ఉత్తర్ ప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారి విషం మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. కాన్పూర్‌లోని తన నివాసంలో ఐపీఎస్ అధికారి సురేంద్ర కుమార్ దాస్ ఆత్మహత్యాయత్నం చేశారు. విషం తాగిని ఆయన అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. తన విధుల్లో భాగంగా ఉదయాన్నే సురేంద్రకుమార్ దాస్ నివాసానికి చేరుకున్న పోలీస్ కానిస్టేబుల్... సురేంద్ర అలా అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించాడు.

సురేంద్ర కుమార్‌కు వెంటనే చికిత్స ప్రారంభించారు వైద్యులు. అతని పరిస్థితి విషమంగా ఉందని ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ రాజేష్ అగర్వాల్ తెలిపారు. 30 ఏళ్ల ఐపీఎస్ అధికారి సురేంద్ర దాస్ కుమార్ చాలా సీరియస్ కండీషన్‌లో బుధవారం ఉదయం ఆరుగంటలకు హాస్పిటల్‌కు తీసుకురావడం జరిగిందన్నారు. పల్స్ చాలా పడిపోయిందని బీపీకూడా చాలా పడిపోయిందని డాక్టర్ వివరించారు. వెంటనే వెంటిలేటర్‌పై ఉంచి సురేంద్రదాస్‌కు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

IPS officer attempts suicide, condition critical says doctors

ఇదిలా ఉంటే ఐపీఎస్ అధికారి సురేంద్రదాస్ కుమార్ తూర్పు కాన్పూర్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక నెల క్రితమే ఆయన బాధ్యతలు స్వీకరించారు. తొలిసారిగా ఒక జిల్లాకు ఎస్పీ అయ్యే అవకాశం సురేంద్రదాస్ కుమార్‌కు దక్కింది. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన సురేంద్ర కుమార్ దాస్ సివిల్ సర్వీసెస్‌లో ఐదేళ్ల క్రితం చేరారు. ఆయన 2014వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. సురేంద్రకుమార్ దాస్ గదిలో ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని వెస్ట్ కాన్పూర్ జిల్లా ఎస్పీ సంజీవ్ సుమన్ తెలిపారు. అయితే కొద్దిరోజులుగా ఎస్పీ ముభావంగా ఉన్నారని అతని క్యాంప్ ఆఫీస్ సిబ్బంది చెప్పినట్లు సుమన్ తెలిపారు. ఇదిలా ఉంటే సురేంద్ర కుమార్ పురుగుల మందు తాగి ఉంటాడన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు వైద్యులు.

English summary
A young Indian Police Service (IPS) officer has allegedly attempted suicide at his official residence in Kanpur. Surendra Kumar Das was found unconscious at home early on Wednesday morning by policemen assigned to him.He was rushed to a city hospital where he is being treated for poisoning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X