బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెంట్రల్ జైల్లో శశికళ ఎఫెక్ట్: డీఐజీ రూపకు పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి మద్దతు !

బెంగళూరు నగర శివారల్లోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ .

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగర శివారల్లోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూపకు పలువురు మద్దతు ఇస్తున్నారు.

తాజాగా మాజీ ఐపీఎస్ అధికారిని, పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి సోషల్ మీడియాలో కర్ణాటక జైళ్ల శాఖ డిఐజీ రూపను అభినందించారు. మహిళ అయినా మీరు ఎవ్వరికీ భయపడకుండా ధైర్యంగా నిజాలు భయటపెట్టడం సాటి మహిళగా గర్వపడుతున్నానని అభినందించారు.

IPS officer Roopa gets Puducherry governor KiranBedi support

దేశంలోని మహిళా అధికారులు అందరూ ఇలాగే ధైర్యంగా విధులు నిర్వహించాలని కోరుకుంటున్నానని కిరణ్ బేడి సోషల్ మీడియాలో రూపను అభినందించారు. డీఐజీ రూప కూడా సోషల్ మీడియాలో కిరణ్ బేడికి ధన్యవాదాలు తెలిపారు.

థ్యాక్స్ మేడమ్, మీరు నన్ను అభినందించడంతో తనకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు ఉందని రూప సోషల్ మీడియాలో కిరణ్ బేడికి కృతజ్ఞతలు తెలిపారు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైళ్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ దగ్గర రూ. 2 కోట్లు లంచం తీసుకుని వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని, ఈ విషయంపై దర్యాప్తు చేయించాలని రూప ప్రభుత్వానికి, పై అధికారులకు లేఖ రాసి సంచలనానికి తెర తీసిన విషయం తెలిసిందే.

English summary
Karnataka IPS officer Roopa gets Puducherry governor KiranBedi support in Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X