వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్పీ ఆత్మహత్యాయత్నం: సూసైడ్ పై గూగుల్‌లో సెర్చ్ చేశారు...ఆపై ఎలుకలమందు తాగాడు

|
Google Oneindia TeluguNews

లక్నో: తూర్పు కాన్పూర్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సురేంద్ర కుమార్ దాస్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. వివాహం ఇష్టంలేక తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఆయన పరిస్థితి మరింత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 36 గంటలు గడిస్తేకానీ ఏమీ చెప్పలేమని వైద్యులు చెప్పినట్లు అడిషనల్ డీజీపీ అవినాష్ చంద్ర తెలిపారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఐపీఎస్ అధికారిఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఐపీఎస్ అధికారి

ఎక్మోపై సురేష్ కుమార్ దాస్‌కు చికిత్స అందిస్తున్నారు. విషం తీసుకున్న పేషంట్ల పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిన సమయంలోనే ఎక్మోపై ఉంచి చికిత్స అందిస్తారని అడిషనల్ డీజీపీ అవినాష్ చంద్ర తెలిపారు. ముంబై నుంచి ప్రత్యేక ఎక్విప్‌మెంట్ తీసుకొచ్చినట్లు డీజీపీ తెలిపారు. ముంబై నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా స్థానిక డాక్టర్లకు సహకారం అందించేందుకు వచ్చారు.

IPS officer Surendra kumar Das googled suicide,condition critical

ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎస్పీ రాతను ధృవీకరించేందుకు నిపుణుల దగ్గరకు పంపినట్లు పోలీసులు చెప్పారు. భార్యతో విబేధాలతోనే తాను ఈ దారుణానికి పాల్పడి ఉంటాడనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. గతకొన్ని రోజులుగా ఎస్పీ సురేంద్ర కుమార్ దాస్ డిప్రెషన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలనే ఆయన ఆత్మహత్యలపై గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు సమాచారం. ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని వాటిని చంపేందుకు ఎలుకల మందు తీసుకురావాల్సిందిగా పనిమనిషికి చెప్పినట్లు ఎస్‌ఎస్పీ చెప్పారు.

ఎస్పీ సురేంద్ర కుమార్ దాస్ తన భార్యతో విబేధాలు వచ్చాయని గత 40 రోజులుగా తన తల్లితో కూడా మాట్లాడటం లేదని ఎస్ఎస్పీ వివరించారు. త్వరలోనే తన భార్యను కూడా విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.

English summary
The condition of 2014-batch IPS officer Surendra Kumar Das, who had allegedly consumed poison due to marital discord, continued to be very critical on Thursday.Das, who had attempted suicide yesterday (Wednesday), is on a ventilator for respiratory support and the next 36 hours are very crucial," said Kanpur's Additional DGP Avinash Chandra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X