వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే ప్రయాణికులకు దసరా గుడ్‌న్యూస్: దుర్గా పూజ స్పెషల్ మెనూ, ఇలా ఆర్డర్ చేయండి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విజయ దశమి ఉత్సవాల సందర్భంగా భారతీయ రైల్వే పలు ప్రత్యేక ఆహార పదార్థాలను తన మెనూలో పొందుపర్చింది. మొదటగా, దేశంలోని తూర్పు ప్రాంతంలో ప్రయాణించే ప్రయాణికులు విలాసవంతమైన బెంగాలీ వంటకాలను తినే అవకాశం ఉంటుందని, ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైళ్లలో ప్రత్యేక దుర్గా పూజ మెనూని అందజేస్తుందని అధికారులు తెలిపారు.

రైల్వే ప్రయాణికులకు దుర్గా పూజ స్పెషల్ మెనూ

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, సీల్దా, అసన్‌సోల్ స్టేషన్లు, ఐఆర్‌సీటీసీ ఇ- కేటరింగ్ సౌకర్యం ఉన్న జార్ఖండ్‌లోని జసిదిహ్ జంక్షన్‌ల మీదుగా వెళ్లే దాదాపు 70 రైళ్లలో మెనూ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణీకులు 1323 నంబర్‌కు కాల్ చేసి తమ భోజనాన్ని బుక్ చేసుకుని తమ సీట్లకు డెలివరీ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇది రైల్ పీఎస్‌యూ నుంచి తాజా ఆఫర్, ఇది గత సంవత్సరం పండుగ సమయంలో ఉపవాసం ఉండే ప్రయాణీకుల కోసం 'వ్రత్ నవరాత్రి' ప్రత్యేక థాలీలను ప్రారంభించింది.

పూజో మెనూలో ఏముంటాయంటే..?


పూజో మెనూలో మటన్ థాలీ - లూచీ (పూరీ), పులావ్, ఆలు పోస్టో (గసగసాలతో కూడిన బంగాళాదుంప), చికెన్, ఫిష్ థాలీస్ వంటి సాధారణ బెంగాలీ ప్రత్యేక వంటకాలతో ఉంటుంది. జాబితాలో ఫిష్ ఫ్రై, కోల్‌కతా బిర్యానీ, రోసోగొల్ల వంటి ఇతర వస్తువులు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది కూడా నవరాత్రుల సందర్భంగా ప్రయాణీకులకు తమ ప్రయాణంలో ఉల్లిపాయలు-వెల్లుల్లి లేకుండా భోజనం అందించనున్నట్లు వారు తెలిపారు.
ఈ ఆఫర్‌ను పొందేందుకు, ప్రయాణికులు 1323కు కాల్ చేయడం ద్వారా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.

IRCTC 400 స్టేషన్‌లలో ప్రత్యేక ఆహార పదార్థాలు


IRCTC 400 స్టేషన్‌లలో ఈ సౌకర్యాన్ని కల్పిస్తుందని, IRCTC ఫుడ్ మెనూ ప్రారంభ ధర రూ.99తో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. స్టార్టర్స్ మెనూలో 'ఆలూ చాప్, సబుదానా టిక్కీ' ఉన్నాయి. ప్రధాన కోర్సులో పరాఠాలతో కూడిన సబుదానా ఖిచ్డీ, పనీర్ మఖ్మాలి ఉన్నాయి. కోఫ్తా కర్రీ, సబుదానా ఖిచ్రీ నవరాత్రి థాలీ వంటి ఇతర ఆహార పదార్థాలు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.కాగా, IRCTC గత సంవత్సరం నుంచి తమ రైళ్లలో ప్రయాణీకులకు సందర్భానుసారంగా నిర్దిష్ట భోజనాన్ని అందిస్తోంది.

English summary
IRCTC Offers Durga Puja Special Menu For Passengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X