వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లు రీఓపెన్..

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా జూన్ 1 నుంచి దశలవారీగా అందుబాటులోకి రానున్న రైళ్లకు సంబంధించి ఆ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా ఐఆర్‌సీటీసీలో బుకింగ్స్ ప్రారంభించిన రైల్వే శాఖ.. శుక్రవారం నుంచి రైల్వే స్టేషన్లలోనూ టికెట్ విక్రయాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. పరిమిత స్థాయిలో, కొన్ని ఎంపిక చేసిన స్టేషన్లలో మాత్రమే రిజర్వషన్ కౌంటర్లను పున: ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఏయే స్టేషన్లలో కౌంటర్లు తెరుస్తారనే వివరాలను వెబ్ సైట్లో వెల్లడించనున్నారు.

జూన్ 1 నుంచి రైల్వే శాఖ 200 రైళ్లను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రైళ్లలో ప్రయాణాల కోసం బుకింగ్స్ ఆన్ లైన్ లో గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. తొలి రెండు గంటల్లో 73 ప్రత్యేక రైళ్ల మొదటి సెట్‌కు 1 లక్ష 49 వేల 025 టికెట్లు బుక్ అయినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఉదయం ఒక్కసారిగా అందరూ సైట్ ఓపెన్ చెయ్యడంతో ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ లో టెక్నికల్ సమస్యలు ఏర్పడి, కాసేపు సేవలు నిలిచిపోయాయి. దీనిపై రైల్వే శాఖ ఎప్పటికప్పుడు ట్విటర్ లో అప్ డేట్స్ పెడుతూ వచ్చింది. ఇప్పుడు రైల్వే స్టేషన్లలోనే నేరుగా టికెట్ బుకింగ్ కౌంటర్లు తెరవనుండడంతో ప్రయాణికులకు మరింత ఊరట కలగనుంది.

IRCTC reservation counters to re-open from friday for special trains

Recommended Video

Railways News : Key Changes In Train Tickets Booking

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా రాబోయే రోజుల్లో మరిన్ని రైళ్లను నడపబోతున్నామని మంత్రి పియూష్ గోయల్ ఒక ప్రకటన చేశారు. రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లు తెరవడంతోపాటు లోపల దుకాణ సముదాయాలను కూడా అనుమతిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ దుకాణాల ద్వారా ప్రయాణికులు తమకు కావలసిన వస్తువులను తీసుకోవచ్చన్నారు.

జూన్ 1న తెలుగు రాష్ట్రాల మీదుగా నడిపే రోజువారీ రైళ్ల వివరాలను రైల్వే బోర్డు ఆన్‌లైన్‌లో వెల్లడించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

(02701) - హైదరాబాద్ - ముంబయి

(02703) - హౌరా - సికింద్రాబాద్‌

(02805 )-విశాఖపట్నం- ఢిల్లీ

(02723 ) -హైదరాబాద్‌- న్యూఢిల్లీ

(02791 )-దానాపూర్‌- సికింద్రాబాద్‌

(07201)- గుంటూరు- సికింద్రాబాద్‌

(02793) - తిరుపతి- నిజామాబాద్‌

(02727)- హైదరాబాద్‌- విశాఖపట్నం

(02175) - నాందేడ్ - అమృత్ సర్

English summary
The Indian Railways announced that from friday (22 May), it will resume reservation counters for booking of the 200 special trains which are scheduled to run from 1 June, 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X