వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రయాణీకులకు షాక్: అనివార్య కారణాల వల్ల ఒకేరోజు 149 రైళ్లు రద్దు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రతి రోజు 12,600 భారతీయ రైల్వేలు దాదాపు 23 మిలియన్ల మంది ప్రయాణీకులను ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేస్తుంటాయి. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్‌సీటీసీ) గురువారం (అక్టోబర్ 4) ఒక్కరోజే 149 రైళ్లను రద్దు చేసింది.

ప్రత్యేక కారణాలు ఏమీ తెలియకుండానే ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తుఫాన్‌లు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు, శాంతిభద్రత సమస్యలు తలెత్తినప్పుడు రైల్వే శాఖ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది.

IRCTC trains cancelled today (October 4, 2018): Check full list here

కొన్ని అనివార్య కారణాల వల్ల రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రద్దయిన రైళ్లలో అత్యధికం పాసింజర్ రైళ్లు కాగా, మిగిలినవి మెయిల్ రైళ్లు. వీటితో పాటు రాంపూర్ - షెల్డాల మధ్య తిరిగే ఇంటర్ సిటీ సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేసారు.

రైళ్ల రద్దు అంశాన్ని ప్రయాణీకులకు ఎస్ఎంఎస్‌ల ద్వారా తెలియజేశామని, ప్రయాణీకులు తాము ప్రయాణించే రైలు స్టేటస్ గురించి తెలుసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నామని రైల్వే శాఖ ప్రకటించింది.

English summary
Indian Railways used to run around 12,600 train every day carrying over 23 million passengers daily. Indian Railways Catering and Tourism Corporation (IRCTC) has displayed a list of cancelled trains (Fully Cancelled Trains - Not running from source to destination) on October 4 for various reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X