బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైల్వే ఐఆర్ సీటీసీ నకిలి ఇ-టికెట్ బుకింగ్ దందా, అరెస్టు, పాక్ ఉగ్రవాదులతో లింక్ ?, డిజిటల్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో భారతీయ రైల్వే ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ హ్యాక్ చేసి నకిలి ఇ- టికెట్ బుకింగ్ చేస్తూ అరెస్టు అయిన వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని విచారణ చేస్తున్న పోలీసు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అరెస్టు అయిన వ్యక్తి పాకిస్థాన్, బాంగ్లాదేశ్ ఉగ్రవాదులతో లింక్ ఉందని, ఆ కోణంలో విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడి డిజిటల్ ఉగ్రవాదం లింక్ పై ఆరా తీస్తున్నారు.

ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!

ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ హ్యాక్

ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ హ్యాక్

భారతీయ రైల్వే శాఖకు చెందిన ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ హ్యాక్ చేసి నకిలి ఇ- టికెట్ బుకింగ్ చేస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు నిఘా వేశారు. నకిలి ఇ- టికెట్ బుకింగ్ చేస్తున్న గులామ్ ముస్తఫా అనే వ్యక్తిని బెంగళూరులో పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

మసీదులో నకిలి ఇ- టికెట్ బుకింగ్ !

మసీదులో నకిలి ఇ- టికెట్ బుకింగ్ !

బెంగళూరు నగరగంలోని రాజగోపాలనగరలోని ఓ మసీదులో నిందితుడు గులామ్ ముస్తఫా ఐఆర్ సీటీసీ నకిలి ఇ-టికెట్ బుకింగ్ చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నిందితుడు గులామ్ ముస్తఫా గత రెండు సంవత్సరాల నుంచి ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లోని పూర్తి వివరాలు సేకరిస్తున్నాడని, అందులోని సమాచారం ఆధారంగా ఇతను నకిలి ఇా- టికెట్ బుకింగ్ కు తెర తీశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

పాకిస్థాన్, బాంగ్లాదేశ్ ఉగ్రవాదులతో లింక్ ?

పాకిస్థాన్, బాంగ్లాదేశ్ ఉగ్రవాదులతో లింక్ ?

నిందితుడు గులామ్ ముస్తఫా డార్క్ వెబ్ ద్వారా పాకిస్థాన్, బాంగ్లాదేశ్ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్నాడని విచారణ చేస్తున్న పోలీసు అధికారులు అంటున్నారు. అంతే కాకుండా గులామ్ ముస్తఫా పాకిస్థాన్, బాంగ్లాదేశ్ కు చెందిన అనేక సంస్థలతో లింక్ పెట్టుకున్నాడని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఒడిశా, ఉత్తర కన్నడ జిల్లా !

ఒడిశా, ఉత్తర కన్నడ జిల్లా !

ఉత్తర కన్నడ జిల్లాలోని భట్కల్, ఒడిశాలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించిన వారితో గులామ్ ముస్తఫాకు లింక్ ఉందని విచారణలో వెలుగు చూసిందని, ఇతని డిజిటల్ ఫుట్ ప్రింట్ కార్యకలాపాల గురించి వివరాలు సేకరిస్తున్నామని కేసు విచారణ చేస్తున్న బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

English summary
IRCTC website hacker arrested in Bengaluru. He had connections with terrorist organizations police investigation says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X