వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16ఏళ్లుగా అద్దంలో చూసుకోలేదు: షర్మిల ప్రేమ పెళ్లి ఇతడితోనే!

|
Google Oneindia TeluguNews

ఇంఫాల్: ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారిణి, మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల(44) తన 16ఏళ్ల సుదీర్ఘ నిరాహార దీక్షను విరమించటానికి సోమవారం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యాయత్నం కేసులో జైలులో ఉన్న ఆగస్టు 9న దీక్ష విరమించటానికి నిర్ణయించుకున్నట్లు స్థానిక కోర్టులో హాజరవటానికి మంగళవారం వచ్చిన సందర్భంగా ఆమె ఈ విషయం తెలిపారు.

'నేను దీక్ష విరమిస్తాను. రాజకీయాల్లో చేరుతున్నాను. మణిపూర్ అసెంబ్లీకి త్వరలో జరగబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తాను' అని షర్మిల స్పష్టం చేశారు.

16ఏళ్లపాటు తల దువ్వుకోలేదు.. అద్దంలోనూ చూసుకోలేదు

మాలోమ్‌ ఘటనతో 28 ఏళ్ల వయసులో నిరశనకు దిగిన షర్మిల.. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేసేవరకు అన్నపానీయాలు తీసుకోనని.. తల దువ్వుకోనని, అద్దంలో కూడా చూసుకోనని, చివరికి తన తల్లిని కూడా కలవబోనని తనకు తాను కట్టుబాట్లు విధించుకున్నారు. వైద్యురాలు కావాలని కలలు కన్న షర్మిల తన పోరాటంతో ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు.

పదహారేళ్ల తన నిరశన కాలంలో ఆమె ఇంతవరకు తన ఇంటికి వెళ్లనప్పటికీ ఒక్కసారి మాత్రం యాదృచ్ఛికంగా తన తల్లిని కలిశారు. 2009లో ఆమె తల్లి సఖీదేవిని ఆనారోగ్య కారణాలతో షర్మిల ఉన్న ఆస్పత్రిలోనే చేర్చడంతో తల్లీకుమార్తెలు ఒకరినొకరు కలుసుకున్నారు.

త్వరలో ప్రేమ వివాహం?

ఆగస్టు 9న జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వివాహం చేసుకోవటానికి కూడా షర్మిల సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆమె సుమారు ఆరేళ్లుగా భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ పౌరుడు డెస్మండ్‌ కౌటిన్హో(53)తో ప్రేమలో ఉన్నారు. ఆయన్నే వివాహం చేసుకుంటారని తెలుస్తోంది. డెస్మండ్‌ సామాజిక కార్యకర్త, రచయిత కూడా. ప్రస్తుతం షర్మిలకు 42ఏళ్ళు.

షర్మిల

షర్మిల

ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల(44) తన 16 సంవత్సరాల సుదీర్ఘ నిరాహార దీక్షను విరమించటానికి నిర్ణయించుకున్నారు. ఆత్మహత్యాయత్నం కేసులో జైలులో ఉన్న ఆగస్టు 9న దీక్ష విరమించటానికి నిర్ణయించుకున్నట్లు స్థానిక కోర్టులో హాజరవటానికి మంగళవారం వచ్చిన సందర్భంగా తెలిపారు.

షర్మిల

షర్మిల

‘నేను దీక్ష విరమిస్తాను. రాజకీయాల్లో చేరుతున్నాను. మణిపూర్ అసెంబ్లీకి త్వరలో జరగబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తాను' అని షర్మిల వివరించారు.

షర్మిల

షర్మిల

భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పిఏ)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2000 సంవత్సరం నవంబర్‌లో షర్మిల(42) నిరాహార దీక్ష చేపట్టారు. అస్సాం రైఫిల్స్ దళాల చేతిలో 10మంది మణిపురి ప్రజలు చనిపోవటంతో ఆమె దీక్ష ప్రారంభమైంది.

షర్మిల

షర్మిల

అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఆహారం తీసుకోకుండా, నీరు కూడా తాగకుండా ఆమె దీక్ష చేస్తున్నారు. వైద్యులు ఆమెకు బలవంతంగా అందిస్తున్న ఫ్లూయిడ్స్‌పైనే ఆమె జీవిస్తున్నారు. ఆమెను చాలాసార్లు పోలీసులు అరెస్టు చేసి వదిలేశారు. ఆమెపై ఆత్మహత్యాయత్నం కేసు (309)ను నమోదు చేశారు.

English summary
Irom Sharmila, the iconic activist whose life was defined by a fast she began 16 years ago in protest against alleged army atrocities in Manipur, has decided to recast her struggle and contest elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X