బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కంగ్రాట్స్ : మదర్స్ డే రోజున కవలలకు జన్మనిచ్చిన "ఉక్కుమహిళ" ఇరోమ్ షర్మిల

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మాతృదినోత్సవం రోజున ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల పండంటి కవలలకు జన్మనిచ్చారు. మణిపూర్ మాణిక్యంగా పిలువబడే ఇరోమ్ షర్మిలా ఆ రాష్ట్రంలో సైనిక బలగాల ప్రత్యేక చట్టం ఆఫ్స్పా (AFSPA)ను ఎత్తివేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ 16 ఏళ్ల పాటు నిరాహారదీక్ష చేశారు. బెంగళూరులో ఆమె ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చారు. మల్లేశ్వరంలోని క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌ అనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సిజేరియన్ ద్వారా కవలలకు జన్మనిచ్చారు. 2017లో గోవాలో పుట్టి బ్రిటీష్ జాతీయత కలిగిన వ్యక్తి డెస్మండ్ కొటిన్హోను ఇరోమ్ షర్మిల వివాహమాడారు.

ఇద్దరు పిల్లలకు నిక్స్ సఖి, ఆటం తారా అనే పేర్లను పెట్టారు ఇరోమ్ దంపతులు. ఇద్దరు పిల్లలు ఒకరు 2.16 కేజీల బరువుండగా మరొకరు 2.15 కేజీల బరువుతో జన్మించారు. తమ జీవితం కొత్త దశలోకి ప్రవేశించిందని ఇరోమ్ షర్మిళ పేర్కొన్నారు.ఇక 46 ఏళ్ల ఇరోమ్ షర్మిళ కవలలకు జన్మనిచ్చారన్న సంగతి తెలియగానే ఆమెకు అభినందనల వెల్లువ ప్రారంభమైంది.

Iron lady Irome Sharmila gives birth to twins in Bengaluru hospital

ఇరోమ్ షర్మిళతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ఆమెకు డెలివరీ చేసిన డాక్టర్ వినేకర్. గర్భం దాల్చినప్పటి నుంచి ఇరోమ్ షర్మిళ తన వద్దకే వచ్చేదని చెప్పారు. లేటు వయస్సులో గర్భం దాల్చడంతో ఆమెకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తాను భావించినట్లు డాక్టర్ చెప్పారు. డయాబెటిస్, హైపర్ టెన్షన్‌లాంటి సర్వసాధారణం అని చెప్పిన డాక్టర్... ఇవేమీ ఇరోమ్ షర్మిళలో కనిపించలేదని ఆమె నిజంగానే ఉక్కుమహిళ అని అన్నారు. ప్రతీ సారి గంటలు తరబడి ఎంతో ఓపికతో తన కోసం వేచి ఉండేవారని డాక్టరు గుర్తు చేసుకున్నారు.

డెస్మండ్ కూడా ఎంతో ఓపికతో ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చి చెకప్ చేయించేవారని కొనియాడారు. ప్రస్తుతం తల్లీ బిడ్డల ఆరోగ్యం చాలా బాగుందని డాక్టర్ వినేకర్ చెప్పారు. ఇరోమ్ షర్మిళ ఎంత పట్టుదల మహిళనో అందరికీ తెలుసని కానీ ఆమెలో మృధు స్వభావాన్ని కూడా చూసి తెలుసుకునే అదృష్టం తనకు దక్కిందని డాక్టర్ వినేకర్ తెలిపారు.

English summary
Civil rights activist Irom Sharmila, known across the world as the Iron Lady of Manipur for her 16-year hunger strike against the imposition of the Armed Forces Special Powers Act (AFSPA) in the state, gave birth to twin girls on Mother’s Day in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X