బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో శశికళ రాచమర్యాదలు: సీఎం సీరియస్; విచారణకు ఆదేశం, చిన్నమ్మ కథ కంచికే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని ఓ ఐపీఎస్ అధికారి అంటే, అలాంటిది ఏమీ లేదని మరో ఐపీఎస్ అధికారి పోట్లాడుకుంటున్నారు.

ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సీరియస్ అయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు ఇలా నియమాలు, నిబంధనలు గాలికి వదిలేసి పోట్లాడుకుంటే మన పరువే పోతుందని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో అసలు ఏమి జరుగుతోంది ? వెంటనే నాకు తెలియాలి, నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో అధికారులు ఎవరైనా నియమాలు ఉల్లంచి ప్రవర్తించి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దరామయ్య హెచ్చరించారు.

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని. ప్రత్యేక వంట గది ఏర్పాటు చేసి ఆమెకు భోజనం తయారు చేయిస్తున్నారని ఆరోపిస్తూ జైళ్లు శాఖ డీఐజీ డి. రూప ప్రభుత్వానికి లేఖ రాయడంతో సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో వివాదం తలెత్తింది.

English summary
We have taken serious cognizance of the allegation of irregularities in Bengaluru Central Prison. And ordered a high level inquiry," tweeted chief Minister Siddaramaiah on DIG prisons D Roopa's letter over special facilities to Sasikala in jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X