వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాధ్యతా రాహిత్యం ... సి విజిల్ ని కూడా సిల్లీగా వాడేస్తున్నారా ?

|
Google Oneindia TeluguNews

త్వరలో జరగనున్న ఎన్నికల్లోరాజకీయ పార్టీలు నిబంధనలను ఉల్లంఘించకుండా ఉండేందుకు , రాజకీయ నాయకులు ఎలక్షన్ కోడ్ ను పాటించకుండా అడ్డదారులు తొక్కి తే వారికి చెక్ పెట్టడానికి ' సీ విజిల్ ' మొబైల్ యాప్ ను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్లలో వినియోగించే ' సీ విజిల్ ' మొబైల్ యాప్ ద్వారా ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి సమాచారాన్ని చేరవేసిన 45 నిమిషాల వ్యవధిలోనే చర్యలు తీసుకుంటారు.
అలాంటి ' సీ విజిల్ ' యాప్ ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు అవగాహన లేని ప్రజలు.

టిడిపి అభ్య‌ర్ది పై పోటీ దారుడి భౌతిక దాడి ..ముఖ్య‌మంత్రి ఇంటి వ‌ద్ద హ‌ల్‌చ‌ల్‌..! <br>టిడిపి అభ్య‌ర్ది పై పోటీ దారుడి భౌతిక దాడి ..ముఖ్య‌మంత్రి ఇంటి వ‌ద్ద హ‌ల్‌చ‌ల్‌..!

' సీ విజిల్ ' యాప్ లో ఎన్నికల నియమావళిని అతిక్రమించిన వారి ఫోటోలు, వీడియోలు, తత్సంబంధిత ఆధారాలను మాత్రమే అప్లోడ్ చేయాలి. కానీ అవగాహన లోపంతో కొంతమంది' సీ విజిల్ ' యాప్ లో స్వీయ చిత్రాలు, కంప్యూటర్ స్క్రీన్ లు, దీపాలు ,చెట్లు ఇలా రకరకాల ఫోటోలను, అసలు ఆ యాప్ దేనికోసం పెట్టారో తెలియని వాళ్లు అందులో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలకు సంబంధించి కంటే , ఎన్నికల నిబంధనావళి తో సంబంధం లేని వీడియోలను ఎక్కువగా పెడుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఈ యాప్ ను ఉపయోగిస్తున్న ప్రజలు ఈ యాప్ లో 60 శాతం ఏ మాత్రం ఉపయోగం లేని వీడియోలను, ఫోటోలని అప్లోడ్ చేస్తున్నారు అంటే ' సీ విజిల్ ' అసలు దేని కోసం నిర్దేశించిన యాప్ అనేది వారింకా అర్థం చేసుకోలేదు అని తెలుస్తుంది.

Irresponsible ... even the C whistle also misused

ఏది ఏమైనప్పటికీ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చేసే అక్రమాలను, వారి తొక్కే అడ్డదారులను, ఎన్నికల నియమావళి ఉల్లంఘనను ప్రజల నుండి నేరుగా ఫిర్యాదు రూపంలో తీసుకొని వారిపై చర్యలకు ఉపక్రమించాలని అని భావించిన ఎన్నికల సంఘానికి ప్రజలు' సీ విజిల్ ' యాప్ ఉపయోగిస్తున్న తీరు అసంతృప్తిని కలిగిస్తుంది.

English summary
The C-Vigil mobile application gives the common man the opportunity to click pictures and take videos of violations and send it to concerned election officers. People who use this app in Punjab are uploading videos and photos that are not reliable to 60 per cent of the app, which means they do not understand yet what the app is meant for.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X