వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇర్ఫాన్ ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాడు.. నటనే కాదు,వ్యక్తిత్వంలోనే అరుదైనవాడు..

|
Google Oneindia TeluguNews

హీరోలు సూపర్ స్టార్స్ అవడం సాధారణం.. వాళ్ల సినిమా కలెక్షన్లను బట్టి,హిట్ రేటును బట్టి.. పేరు చివరన ఏదో ఒక ట్యాగ్ వచ్చి చేరిపోతుంది. కానీ ఒక నటుడు సూపర్ స్టార్ స్థాయికి వెళ్లడం అసాధారణం. హద్దులను చెరిపేసి గ్లోబల్ నటుడిగా ఎదగడం మరింత అసాధారణం. ఇర్ఫాన్ ఖాన్ విషయంలో ఈ రెండూ జరిగాయి. కానీ కెరీర్ పీక్స్‌లో ఉందనుకున్న సమయంలోనే క్యాన్సర్ అతన్ని లాక్కుపోయింది. కానీ ఆ చూపుల్ని.. మౌనంగానే అవి పలికించిన ఎన్నో హావభావాలను ఏ మృత్యువు మాత్రం ఎక్కడికి తీసుకెళ్లగలదు. చాలామంది నటులు బాడీ బిల్డింగ్‌పై,బైసెప్స్ పెంచుకోవడంపై దృష్టి సారిస్తే.. ఇర్ఫాన్ ఒక్కడే కళ్లతో హావభావాలను పలికించడంపై ఫోకస్ చేశాడు. వాళ్లంతా ఎక్స్‌ప్రెషన్స్‌లో తేలిపోతే.. ఇర్ఫాన్ మాత్రం తన కళ్లనే భుజాలుగా మార్చి సినిమాని మోశాడు. అలాంటి విలక్షణ నటుడి గురించి అనన్య భట్టాచార్య అనే ఓ జర్నలిస్ట్ అద్భుతమైన విషయాలను చెప్పారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..

మీడియాలోకి వచ్చిన కొత్తలో..

మీడియాలోకి వచ్చిన కొత్తలో..

అది 2013, ఫిబ్రవరి నెలాఖరు. ఇర్ఫాన్ సాహెబ్ బీవీ,గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్ టీమ్స్‌తో ఉన్నాడు. స్టూడియోలో పలు టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చి బయటకు నడుస్తున్నాడు. అప్పటికీ మీడియాలో నా అనుభవం కొద్ది నెలలు మాత్రమే. ఇర్ఫాన్ తన కారులో ఎక్కబోతుండగా.. నేను ఆయన వద్దకు వెళ్లాను. మా వెబ్ సైట్ కోసం చిన్న ఇంటర్వ్యూ ఇస్తారా అని అడిగాను. దాంతో తన డ్రైవర్‌ను,టీమ్‌ను వెయిట్ చేయమని చెప్పి నాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ రికార్డింగ్ ఫైల్ మిస్ అయిపోయింది. దాదాపుగా ఏడ్చేసినంత పనైంది. అయితే ఇది గమనించిన ఇర్ఫాన్ తన ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లారు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు రండి.. ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాడు.

ప్రామిస్ నిలబెట్టుకున్న ఇర్ఫాన్..

ప్రామిస్ నిలబెట్టుకున్న ఇర్ఫాన్..

ఆ తర్వాతి రోజు సాయంత్రం ఆయన వద్ద నుంచి కబురు వచ్చింది. వెళ్లి ఇంటర్వ్యూ తీసుకుని వచ్చాను. చెప్పినట్టుగానే ఇర్ఫాన్ తన ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. ఇర్ఫాన్ వ్యక్తిత్వానికి నేను ముగ్దురాలినయ్యాను. ప్రొఫెషన్ ముందు స్టార్‌డమ్ పెద్దదేమీ కాదనుకునేవాడు. కాబట్టే ఎప్పుడూ చాలా హుందాగా ప్రవర్తించేవాడు. ఆ తర్వాత కూడా చాలా ఏళ్లు మేమిద్దరం టచ్‌లో ఉన్నాం. చాలాసార్లు ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. కలిసిన ప్రతీసారి.. ఆయన మాటలు,ఆలోచనలు,అందులో ఉన్న స్పష్టత.. ఇంకా ఇంకా వినాలనిపించేది. సలాం బాంబేలో ఇర్ఫాన్ నటన చూశాక.. ఆ పెర్ఫామెన్స్‌ను ఎలా మర్చిపోగలను. అతనితో మాట్లాడుతున్న కొద్ది.. నటన పట్ల అతనికున్న ప్రేమ వ్యక్తమయ్యేది. ఇక ఆ కళ్లు.. వాహ్..!

ఒక అరుదైన వ్యక్తి..

ఒక అరుదైన వ్యక్తి..

2018లో తానో అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని ఇర్ఫాన్ ట్వీట్ చేసినప్పుడు నేను షాక్‌కి గురయ్యాను. అయితే ఇర్ఫాన్ ఒక ఫైటర్. అంత త్వరగా యుద్దాన్ని ముగించడు. గత రెండేళ్లుగా ఇర్ఫాన్ గురించి ఎప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందా.. అని ఆయన ట్విట్టర్‌ను ఫాలో అవుతూనే ఉన్నాను. అలాంటి సమయంలో ఆయనో రైటప్ పోస్ట్ చేశారు. మరణానికి చాలా దగ్గరగా ఉన్నానని.. అయితే ఈ అరుదైన వ్యాధి నుంచి బయటపడేందుకు పోరాడుతున్నానని చెప్పాడు. కొన్నాళ్లకు ఆంగ్రేజీ మీడియంతో తిరిగొచ్చాడు. అతనెలా ఉన్నాడో ఎవరికీ తెలియదు.మృత్యువును ఎదుర్కోవడానికి ప్రతీరోజూ ఎంతలా పోరాడుతున్నాడో కూడా తెలియదు. బహుశా అతని సన్నిహితులకు తప్ప. ఇప్పుడు ఆయన కళను ఆయన కోసం మాట్లాడనివ్వండి. ఇర్ఫాన్ ఒక అరుదైన వ్యక్తి.. చాలా త్వరగా మనందరిని వీడిపోయాడు.

Recommended Video

#IrrfanKhan : Indian Cricketers Pay Tribute To Irrfan Khan
అంత్యక్రియలు పూర్తి..

అంత్యక్రియలు పూర్తి..


చాలా కాలంగా క్యానర్స్‌తో పోరాడుతున్నారు. ఇటీవల తీవ్ర అస్వస్థకు గురై ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 29న ఆయన కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు.ఇర్ఫాన్ మృతిచెందిన కాసేపటికే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని వెర్సోవా ముస్లిం శ్మశాన వాటికలో ఇర్ఫాన్ పార్థివ దేహాన్ని ఖననం చేశారు. ఈ మేరకు ఇర్ఫాన్ కుటుంబం ప్రకటనను విడుదల చేసింది.

English summary
Ananya Bhattacharya,a journalist in national media shared her moments with actor Irrfan Khan after his demise on Wednesday. She said he was a rare man who left us too soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X