వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో తెరమీదకు సీబీడీ ఆయిల్ వినియోగం .. చట్టబద్ధం చెయ్యాలని ఇర్ఫాన్ భార్య డిమాండ్

|
Google Oneindia TeluguNews

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో సీబీడీ ఆయిల్ అనే ఒక డ్రగ్ పేరు బయటకు వచ్చింది. జయా సాహా రియా చక్రవర్తి తో చేసిన వాట్సప్ చాట్ లో సుశాంత్ సింగ్ కు సీబీడీ ఆయిల్ ఆయన తాగే టీలో కలిపి ఇవ్వాలని చెప్పినట్లుగా ఎన్సీబీ అధికారుల ముందు ఒప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే నటి శ్రద్ధా కపూర్ కోసం కూడా సీబీడీ ఆయిల్ డ్రగ్ ను ఆర్డర్ చేశానని జయాసాహా చెప్పినట్టు సమాచారం. అప్పటినుండి సీబీడీ ఆయిల్ పై బాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతోంది.

బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. జయసాహా సంచలనం : శ్రద్ధా కోసం డ్రగ్ ఆర్డర్ .. సుశాంత్ తాగే టీలో ఆ డ్రగ్బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. జయసాహా సంచలనం : శ్రద్ధా కోసం డ్రగ్ ఆర్డర్ .. సుశాంత్ తాగే టీలో ఆ డ్రగ్

 సీబీడీ ఆయిల్ ను చట్టబద్ధం చెయ్యాలని ఇర్ఫాన్ ఖాన్ భార్య డిమాండ్

సీబీడీ ఆయిల్ ను చట్టబద్ధం చెయ్యాలని ఇర్ఫాన్ ఖాన్ భార్య డిమాండ్

చిత్ర నిర్మాత మరియు దివంగత నటుడు అయిన ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతాపా సికదర్ భారతదేశంలో సీబీడీ ఆయిల్ ను చట్టబద్ధం చేయాలని విజ్ఞప్తి చేయడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుతాపా సికదర్ , ఇర్ఫాన్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న ఆసుపత్రి ఫోటోను షేర్ చేశారు . ఇర్ఫాన్ ఖాన్ అక్కడ ఉన్నప్పుడు ఆయన గదిని బయటినుండి ఎలా చూసానో గుర్తుచేసుకున్నారు. సుతాపా తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు .

 గంజాయి ఆకుల నుండి తయారుచేసే సీబీడీ ఆయిల్ .. క్యాన్సర్ రోగులకు ప్రిస్క్రైబ్

గంజాయి ఆకుల నుండి తయారుచేసే సీబీడీ ఆయిల్ .. క్యాన్సర్ రోగులకు ప్రిస్క్రైబ్

క్యాన్సర్ బాధితులకు వినియోగించే సిబిడి ఆయిల్ ను దేశంలో చట్టబద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ ఇర్ఫాన్ ఈ ఏడాది ఏప్రిల్ 29 న కన్నుమూశారు. సీబీడీ ఆయిల్ ను క్యాన్సర్ కోసం రోగులకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఇర్ఫాన్ సతీమణి సీబీడీ ఆయిల్ ను భారతదేశంలో చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీబీడీ ఆయిల్ ను గంజాయి ఆకుల నుండి తయారు చేస్తారు. ఇది క్యాన్సర్ పై చాలా సమర్థవంతంగా పనిచేసే డ్రగ్ . ఇందులో 40 శాతం గంజాయి ఉంటుంది . దీనిని కన్నాబిడియోల్ అని కూడా పిలుస్తారు.

సీబీడీ ఆయిల్ ప్రయోజనాలను చెప్పిన గాయని సోనా మోహపాత్రా

సీబీడీ ఆయిల్ ప్రయోజనాలను చెప్పిన గాయని సోనా మోహపాత్రా

భారతదేశంలో ఈ సీబీడీ ఆయిల్ ను నిషేధిత డ్రగ్స్ గా పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే గాయని సోనా మోహపాత్రా సీబీడీ ఆయిల్ చాలా ప్రయోజనకరమైనదని ఫేస్‌బుక్‌లోఒక పోస్ట్ పెట్టారు.గతఏడాది తన సోదరి క్యాన్సర్ చికిత్ససందర్భంగాపలు,శస్త్రచికిత్సలుచేయించుకున్నప్పుడునొప్పి నివారణకు,త్వరగా కోలుకోవటానికి ఈ డ్రగ్ చాలా మ్యాజికల్ గా పనిచేసిందని పేర్కొనడం విశేషం. అంతేకాదు ఈ ఆయిల్ ను ఇండియాలో అందుబాటులోకి తీసుకురావాలని కూడా దీని గురించి తెలిసిన పలువురు కోరుతున్నారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Devi Nagavalli Re Entry? | Oneindia Telugu
 బాలీవుడ్ డ్రగ్స్ కేసులో .. సుశాంత్ తో సహా సెలబ్రిటీలు సీబీడీ ఆయిల్ వాడకం

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో .. సుశాంత్ తో సహా సెలబ్రిటీలు సీబీడీ ఆయిల్ వాడకం

తాజాగా బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు రియా చక్రవర్తి ఈ సీబీడీ ఆయిల్ ను ఇచ్చినట్టుగా తెలుస్తుంది . డ్రగ్స్ కేసులో ఇటీవల నార్కోటిక్స్ విచారణ ఎదుర్కొన్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ సి బి డి ఆయిల్ ను వినియోగించినట్లుగా సమాచారం.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు జయసాహా కీలక విషయాలను చెప్పినట్లుగా తెలుస్తుంది . బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది సీబీడీ ఆయిల్ ను వాడుతున్నట్టు సమాచారం .జయా సాహా సుశాంత్ , రియా , శ్రద్దా కపూర్, మధు మంతెన తో పాటు తనకు కూడా సీబీడీ ఆయిల్ ను ఆర్డర్ చేసినట్టు నార్కోటిక్స్ అధికారులకు చెప్పారు. అదలా ఉంటే ఈ నిషేధిత డ్రగ్ క్యాన్సర్ కు బాగా పని చెయ్యటం వల్ల ఇండియాలో కూడా దీనిపై నిషేధం తొలగించి చట్టబద్ధం చెయ్యాలని డిమాండ్ వినిపిస్త్జుంది .

English summary
Sutapa Sikdar, film producer and wife of late actor Irrfan Khan, made an appeal for the legalisation CBD oil in India. Taking to her unverified Instagram account, Sikdar, while sharing a photograph of the hospital where Irrfan was undergoing treatment for cancer, recalled how she would look at the late actor's room from outside while he was there. With her caption, Sutapa also put forth her viewpoint, appealing that CBD oil be made legal in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X