వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 మార్గాలు.. భారత్ కరోనా సంక్షోభం గట్టెక్కాలంటే.. ఇవి చేసి తీరాల్సిందే..!

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దేశ జీడీపీ వృద్దిరేటు 1.9శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన నాటి నుంచి భారత్ ఇంత తక్కువ వృద్ధిరేటు కనబర్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. నిజానికి 2021లో భారత జీడీపీ 7.4శాతం మేర వృద్ది చెందుతుందని అంచనా వేశారు. కానీ కరోనా ఎఫెక్ట్‌తో పరిస్థితి తలకిందులైంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన 50 మంది ఐఆర్ఎస్ ఆఫీసర్స్ రంగంలోకి దిగారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడానికి 10 కీలక సలహాలు,సూచనలు చేశారు.

Taxing the wealthy:

Taxing the wealthy:

సంపన్నులైన ‘సూపర్ రిచ్' వర్గంపై పన్నులను మరింత పెంచాలని ఐఆర్ఎస్ టీమ్ కేంద్రానికి ప్రతిపాదించింది. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌ 2020-21లో సంపన్నులపై సర్‌చార్జిలను పెంచినప్పటికీ.. దాని ద్వారా కేవలం రూ.2700 కోట్లు మాత్రమే వసూలు అవుతాయని అంచనా వేస్తున్నారు. కాబట్టి అధిక ఆదాయం కోసం మరో రెండు ప్రత్యామ్నాయాలను సూచించారు. ఈ రెండింటినీ పరిమిత, నిర్ణీత కాలానికి విధించవచ్చు. ఇందులో 1). రూ.1కోటి ఆదాయం ఉన్నవారు ప్రస్తుతం 30శాతం ట్యాక్స్ స్లాబ్‌లో కొనసాగుతున్నారు. ఈ స్లాబ్‌ను ఇకపై 40శాతానికి పెంచడం. 2). రూ.5కోట్లు పైబడి ఆదాయం ఉన్నవారి కోసం కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం.

Tax India income of foreign companies:

Tax India income of foreign companies:

భారత్‌లోని తమ బ్రాంచ్‌లు లేదా శాశ్వత కార్యాలయాల ద్వారా ఆదాయాన్ని గడిస్తున్న విదేశీ కంపెనీలపై సర్‌చార్జిని పెంచాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం రూ.1కోటి నుంచి రూ.10కోట్లు ఆదాయం గడిస్తున్న విదేవీ కంపెనీలపై 2శాతం సర్‌చార్జి వసూలు చేస్తున్నట్టు చెప్పారు. రూ.10కోట్లు ఆదాయం గడిస్తున్న విదేశీ కంపెనీలపై 5శాతం సర్‌చార్జి వసూలు చేస్తున్నామన్నారు. అయితే చాలాకాలంగా ఈ సర్‌చార్జిలను సమీక్షించలేదని.. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముందని చెప్పారు.

COVID relief cess:

COVID relief cess:


ప్రతీ పన్ను చెల్లింపుదారుడిపై కోవిడ్-19 రిలీఫ్ సెజ్ విధించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రతీ పన్ను చెల్లింపుదారుడిపై ప్రభుత్వం 2శాతం విద్య,ఆరోగ్య సెజ్‌ను వసూలు చేస్తుందన్నారు. మూలధన పెట్టుబడిని పెంచేందుకు.. ప్రతీ పన్ను చెల్లింపుదారుడిపై అదనంగా 4శాతం వన్‌ టైమ్ కోవిడ్-19 రిలీఫ్ సెజ్‌ను విధించాలన్నారు. తద్వారా రూ.15వేల కోట్లు నుంచి రూ.18వేల కోట్లు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్టు అంచనా వేశారు. ఒకవేళ మధ్య తరగతిపై భారాన్ని తగ్గించాలనుకుంటే.. రూ.10లక్షలు పైబడి ఆదాయం ఉన్న ట్యాక్స్ పేయర్స్‌ పైనే ఈ సెజ్ విధించాలన్నారు.

Mobilisation of CSR funds for COVID relief:

Mobilisation of CSR funds for COVID relief:

ఈ జాతీయ విపత్తు సమయంలో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) పరిధిలోని యాక్టివిటీస్‌ను మరింత విస్తృతం చేయాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం కరోనా వైరస్ సంబంధిత రిలీఫ్ చర్యల్లో పాలుపంచుకునే కార్పోరేట్ కంపెనీలకు సెక్షన్ 37 కింద ఆ ఖర్చును 2021 ఆర్థిక సంవత్సరానికి క్లెయిమ్ చేసుకోవడానికి అనుమతించబడుతుంది. తద్వారా కరోనా నివారణ చర్యల కోసం అవసరమైన ఫండ్ సమకూరుతుందన్నారు.

coronavirus savings certificates

coronavirus savings certificates

కరోనావైరస్ రిలీఫ్ కోసం నిధులను సమీకరించడానికి కొత్త పన్ను పొదుపు పథకాన్ని రూపొందించాలని అధికారులు సూచించారు. ఇందులో u/s 80C కింద వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు (HUF లు) రూ .2.5 లక్షల వరకు పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. ఈ మొత్తానికి ఐదేళ్ల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. వీటిపై ప్రభుత్వం అధిక వడ్డీ ఇస్తే ఎక్కువమంది పెట్టుబడికి ముందుకొస్తారు.

New amnesty scheme

New amnesty scheme

వివాద్ సే విశ్వాస్ 2020 స్కీమ్ కేవలం వివాదాల్లో ఉన్న డిమాండ్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఆదాయం సమకూర్చుకోవడానికి I-T చట్టం వడ్డీ u/s 220 (2)ని కొంత లేదా పూర్తిగా వదులుకునే రుణమాఫీ పథకాన్ని ప్రతిపాదించారు. వివాదరహిత కేసుల్లోనూ పెండింగ్‌లో ఉన్న జరిమానా చెల్లింపులకు కూడా ఇలాంటి పథకాన్ని వర్తింపజేయడం ద్వారా ఆ సొమ్ము ప్రభుత్వానికి చేరే అవకాశం ఉందన్నారు.

Raise capital gains to 10% on overseas Indian citizens:

Raise capital gains to 10% on overseas Indian citizens:

OCI (ఓవర్సీస్ సిటిజెన్షిప్ ఆఫ్ ఇండియా) పౌరుల వారసత్వ సంపద నుండి వచ్చే మూలధన లాభాలను ప్రస్తుతం ఉన్న 30 శాతం నుంచి మరో 10 శాతం పెంచాలన్నారు. అలాగే స్వల్పకాలిక, దీర్ఘకాలిక లాభాలపై 20 శాతం పన్నును పెంచాలని ప్రతిపాదించారు. వారసత్వ ఆస్తులను కలిగివున్న ఓవర్సీస్ సిటిజెన్స్ ప్రభుత్వం నుంచి చాలావరకు సబ్సిడీలు,ఇతరత్రా ప్రయోజనాలు పొందుతున్నారు కాబట్టి.. వారిపై పన్నును పెంచాలన్నారు.

Google Tax :

Google Tax :


‘గూగుల్ టాక్స్' లేదా ఈక్వలైజేషన్ లెవీని ఫైనాన్స్ యాక్ట్, 2016లో ప్రవేశపెట్టింది. దీని ద్వారా కొన్ని నాన్-రెసిడెంట్ వ్యాపారాలు,కొన్ని ‘ప్రత్యేక సేవలపై' పన్ను విధిస్తున్నారు. ఇందులో ఎక్కువగా ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్ స్పేస్,సర్వీస్ అందిస్తున్న సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం వాటి స్థూల ఉత్పత్తి,సేవలపై 6శాతం పన్ను విధిస్తున్నారు. ఇటువంటి ఆదాయాలు ప్రస్తుతం స్థూల ప్రాతిపదికన 6 శాతం పన్ను విధించబడుతున్నాయి.బడ్జెట్-2020లో దీని పెంపుకు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుత లాక్ డౌన్ పీరియడ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నది ఎక్కువగా డిజిటల్/ఆన్‌లైన్/ఈకామర్స్,నెట్‌ఫ్లిక్స్,అమెజాన్ ప్రైమ్,జూమ్ వంటి సంస్థలే ఉన్నాయి. కాబట్టి వీటిపై పన్ను పెంపుపై దృష్టి సారించాలని కోరింది. ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్ సంస్థలపై 1శాతం నుంచి 7శాతం పన్ను పెంపుకు అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఇతరత్రా ఆన్‌లైన్ ఈకామర్స్ సంస్థలపై 2శాతం నుంచి 3శాతానికి పన్ను పెంపుకు అవకాశం ఉందని తెలిపింది.

Give It Up campaign

Give It Up campaign


సంపన్నులు ఎల్‌పీజీ సబ్సిడీ వదులుకోవాలని ప్రభుత్వం ఎలాగైతే 'గివ్ ఇట్ అప్' క్యాంపెయిన్ చేపట్టిందో.. ఇప్పుడు కూడా సూపర్ రిచ్ వ్యక్తులను కనీసం ఒక ట్యాక్స్ సబ్సిడీ నుంచి తప్పుకునేలా క్యాంపెయిన్ చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. ఉదాహరణకు ఎవరైనా స్వచ్చందంగా 80C డిడక్షన్ నుంచి ఏడాది పాటు తప్పుకునేందుకు సిద్దంగా ఉంటే.. అలాంటివారిని ప్రోత్సహించాలని చెప్పారు.

Reintroduction of the Inheritance Tax:

Reintroduction of the Inheritance Tax:

అభివృద్ధి చెందిన దేశాలలో వారసత్వ పన్ను 55 శాతం వృద్దితో వసూలు చేయబడుతోందని అధికారులు పేర్కొన్నారు. భారత్‌లో ఇది 1985లో అమలులోకి వచ్చిందన్నారు. ఇందులో 10శాతం నుంచి 85శాతం వరకు స్లాబ్స్‌ నిర్ణయించారు. దీన్నిపున:ప్రవేశ పెట్టాలని అధికారులు ప్రతిపాదించారు.

English summary
Around 50 Indian Revenue Service Officer of the Income Tax Department have suggested ways to help bring the economy back on track, which is in a 40-day lockdown due to the novel coronavirus,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X