వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శబరిమల భక్తుల నిరసనలు, కేరళ సీఎంకు చెమటలు, ఒక్కటి అవుతున్న హిందూ సంఘాలు!

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునే విషయంలో మహిళలకు ప్రవేశం కల్పించకూడదని డిమాండ్ చేస్తూ హిందూ సంఘ, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. శబరిమల విషయంలో కేరళ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. శబరిమల భక్తుల చేస్తున్న డిమాండ్ల విషయంలో కేరళ ప్రభుత్వం నిర్లక్షం చేస్తోందని, వారి మనోభావాలను కించపరుస్తోందని, సరైన నిర్ణయం తీసుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు.

అధికారం

అధికారం

కేరళలో కమ్యూనిస్టు, ఎల్డీఎఫ్ నువ్వానేనా అంటూ పోటీపడుతాయి. 2016లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడంలో విఫలం కావడంతో పినరయి విజయన్ ఆధ్వరంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందు సంఘ సంస్థల కార్యకర్తలు దారుణ హత్యకు గురైనారని ఆరోపణలు ఉన్నాయి.

బీజేపీకి అనుకూలం

బీజేపీకి అనుకూలం

కేరళలో 2011లో బీజేపీ 6.3 శాతం ఓట్లు సంపాధించింది. 2016లో జరిగిన ఎన్నికల్లో 16 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఆరాష్ట్రంలో బలపడటానికి ప్రయత్నాలు చేస్తోంది. కేరళలో బీజేపీ 25 శాసన సభ నియోజక వర్గాల్లో బలంగా ఉన్నా ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంలో విఫలం అయ్యింది.

150 మంది బలి

150 మంది బలి

శబరిమల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తామని చెబుతున్న కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం అసలు సమస్య పరిష్కరించకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాలను దూషించడం మొదలుపెట్టింది. 2010-17 మధ్య కాలంలో 160 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హత్యకు గురైనారని హిందూ సంఘ, సంస్థలు ఆరోపిస్తున్నాయి.

తుపాను, వరదలు

తుపాను, వరదలు

కేరళలో ఇటీవల సంభవించిన తుపాన్లు, వరదల సమయంలో కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయం, సామాగ్రిని వరద బాధితులకు అందించడంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శక్తి వంచనలేకుండా పని చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందూ సంఘ, సంస్థలు ముందుకు వచ్చి వారి నుంచి శభాష్ అనిపించుకున్నాయి.

సుప్రీం కోర్టు ఆదేశాలు

సుప్రీం కోర్టు ఆదేశాలు

శబరిమల అయ్యప్పస్వామిని మహిళలు దర్శించుకోవడానికి అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను తాము పాటిస్తామని కేరళ ప్రభుత్వం తేల్చి చెప్పడంతో హిందూ సంఘ, సంస్థలు మండిపడుతున్నాయి.

హిందూ సాంప్రధాయాలు

హిందూ సాంప్రధాయాలు

ఎన్నో ఏళ్ల నుంచి ఉస్తున్న సాంప్రధాయలను ఎలా పక్కన పెడుతారని, శబరిమల భక్తులు, హిందువులకు మద్దతుగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ సమర్పించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్, హిందు సంఘ, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే పినరయి విజయన్ ప్రభుత్వం ఆవిధంగా చర్యలు తీసుకోకపోవడంతో హిందూ సంఘ, సంస్థలు విరుచుకుపడుతున్నాయి.

బీజేపీకి లాభం

బీజేపీకి లాభం

కేరళ ప్రభుత్వం తీరుపై హిందు, సంఘ, సంస్థలు ఒక్కటి కావడంతో వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కేరళ ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తున్న అయ్యప్పస్వామి భక్తులకు బీజేపీ మద్దతు ఇస్తోంది. పినరయి విజయన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేరళలో సోమవారం ఆందోళనలు ఎక్కువ అయ్యాయి.

స్థానిక ఎన్నికలు

స్థానిక ఎన్నికలు

కేరళలో త్వరలో సంఘ, సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక ఎన్నికల్లో లబ్దిపోందడానికి ఇటు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసి హిందువులకు మద్దతు ఇస్తోంది. కేరళ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చెయ్యాలని అన్ని సంఘ, సంస్థలు ఒక్కటి అవుతున్నాయి.

English summary
Is BJP getting advantge in Kerala, after flood and Sabarimala issue. BJP has got 16% vote share during 2016 Kerala assembly election. Sabarimala issue spreading across the city and BJP is leading this protest, chances of BJP getting mileage of this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X