వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మూడు సినిమాల సూత్ర‌దారి ఆయ‌నేనా..? మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట్లు రాలుస్తాయా..?

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : కాదే్దీ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌కు అన‌ర్హం..! ఏంచేసినా, ఎలా చేసినా, ఎప్పుడు చేసినా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధిపైన ఆదిప‌త్యం సాదించామా..? లేదా అన్న‌దే ముఖ్యం..! ప్ర‌స్తుత రాజ‌కీయాలు ఇదే సూత్రాన్ని అనుస‌రిస్తున్నాయి. అది అదికార పార్టీ కానివ్వండి, ప్ర‌తిప‌క్ష పార్టీ కానివ్వండి ఏ మేర పైచేయి సాధించామ‌న్న‌దే లెక్క‌. ఇదే లెక్క జాతీయ స్ధాయిలో స‌మీక‌ర‌ణాల‌ను సరిచేయ‌బోతోంది. అదికారంలోకి రావాల‌న్నా అదికారం నిల‌బెట్టుకోవాల‌న్నా ప్ర‌త్య‌ర్థి పార్టీ పైన ఎంత‌ విరుచుకుప‌డితే అంత మేలు జ‌రుగుతుంద‌ని రాజ‌కీయ పార్టీలు పావులు క‌దుపుతున్నాయి. అందులో భాగంగానే ఆ పార్టీ సినిమా అస్త్రాన్ని ప్ర‌యోగింస్తోందా..? దాని వెన‌క ఉంది కూడా ఆ పెద్ద త‌ల‌కాయేనా..?

ఒక‌ప్పుడు సోష‌ల్ మీడియా..! ఇప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ‌..బీజేపి వినూత్న ప్ర‌యోగం..!!

ఒక‌ప్పుడు సోష‌ల్ మీడియా..! ఇప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ‌..బీజేపి వినూత్న ప్ర‌యోగం..!!

ఎన్నికల వేళ బీజేపి వేసే ఎత్తుగడలు, వ్యూహాలు, మిగ‌తా పార్టీల‌కు అంత సులువుగా అర్థం కావు. ఆ పార్టీల‌ను అందుకోవడం కూడా కష్టమే. 2014 ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారంతో మొత్తం దేశాన్ని తనవైపు తిప్పుకొన్న మోదీ ఈసారి ఎన్నికలకు మరో కొత్త అస్త్రంతో వచ్చినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియా ఈసారి త‌న‌కు వ‌ర్క‌వుట్ కాద‌ని తెలిసిపోవడంతో ఈసారి ఎంటర్టైన్‌మెంట్ మీడియాతో ఎన్నిక‌ల ప్ర‌ణాళిక ర‌చించిన‌ట్టు తెలుస్తోంది.

హిందీలో వ‌రుస బ‌యోపిక్ లు..! ఎవ‌రికి లాభం..? ఎవ‌రికి న‌ష్టం..!!

హిందీలో వ‌రుస బ‌యోపిక్ లు..! ఎవ‌రికి లాభం..? ఎవ‌రికి న‌ష్టం..!!

దేశ ఆర్ధిక రాజ‌ధానిలో వరుసగా వస్తున్న కొన్ని సినిమాలను చూస్తే ఇందులో కేంద్ర బీజేపి పాత్ర ఉంద‌నే అంశం పై సందేహాలు క‌లుగుతున్నాయి. అదేసమయంలో ఎలక్షన్ల సీజన్‌ను సినిమా ప‌రంగా వాడుకుని కలెక్షన్లు సంపాదించడానికి బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులే ఈ మార్గం పట్టారన్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' సినిమా గురించి కొన్నాళ్లుగా ఎంతగా చర్చ జరుగుతోందో తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ గురించి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ బారు రాసిన పుస్తకంలోని క‌థా వ‌స్తువు సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువ‌యింది.

కాంగ్రెస్ అనుమ‌తి లేకుండా ది యాక్సిడెంట‌ల్ పీయం..! చిత్ర నిర్మాణం వెన‌క బీజేపి..?

కాంగ్రెస్ అనుమ‌తి లేకుండా ది యాక్సిడెంట‌ల్ పీయం..! చిత్ర నిర్మాణం వెన‌క బీజేపి..?

సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మలా మన్మోహన్ పనిచేశారన్నది చూపించారు. కాంగ్రెస్‌కు భావ‌జాలానికి పూర్తి వ్యతిరేకంగా నిర్మించిన చిత్ర‌మిది. దీని పైన కాంగ్రెస్ నాయ‌కులు పెద్ద యెత్తున నిర‌శ‌న‌లు తెలిపిన సంద‌ర్బాలు కూడా ఉన్నాయి. మరో సినిమా ‘ఉరీ.. ది సర్జికల్ స్ట్ర‌యిక్స్' కూడా ఇదే సమయంలో విడుదలైంది. మోదీ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే పాకిస్థాన్‌పై జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్‌కు సంబంధించిన సినిమా. ఇది చూడ్డానికి దేశభక్తి సినిమాలా ఉన్నా మోడీ ఎంత సాహ‌సోపేత ప్ర‌ధాన మంత్రో చాటి చెప్పే సినిమా, మొత్తం బీజేపీ కి అనుకూలంగా ఉండే సినిమా. ఇక మూడోది., ‘నరేంద్ర మోదీ'. ఇంకా విడుదల కాని ఈ సినిమాలో మోదీ పాత్రను అనుపమ్ ఖేర్ పోషిస్తున్నారు. మోదీకి సానుకూలంగా ఉండే ఈ సినిమానే లోక్ సభ ఎన్నికలకు ముందే విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

బ‌యోపిక్ వెన‌క మోదీ..! ప్ర‌చారాస్త్రాలుగా మార్చుకోవ‌ల‌ని ప్ర‌ణాళిక‌..!

బ‌యోపిక్ వెన‌క మోదీ..! ప్ర‌చారాస్త్రాలుగా మార్చుకోవ‌ల‌ని ప్ర‌ణాళిక‌..!

కాగా ఇటీవ‌ల విడుద‌లై రాజ‌కీయ దుమారాన్ని రేపుతున్న ఆ రెండు సినిమాల వెన‌క ప్ర‌ధాని మోదీ ప్ర‌మేయం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల ముందు మ‌న్ మోహ‌న్ సింగ్ అనే ప్ర‌ధాన మంత్రిని కాంగ్రెస్ పార్టీ ఎంత కీలుబొమ్మ‌ను చేసి ఆడించిందో చెప్పే ప్ర‌య‌త్నం చేసార‌ని, ఇదే అంశాన్ని బీజేపి త‌మ‌కు అనుకూలంగా మార్చ‌కునే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు ఈ సినిమాల నిర్మాణాల‌కు, విడుద‌ల‌కు ప్ర‌ధాని మోదీ స‌హ‌కారం ఎంత‌గానో ఉంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి సినిమా హాళ్ల‌లో చిత్రాల‌ను చూసిన ప్ర‌జ‌లు వారి మ‌న‌సుల‌ను అంత తేలిగ్గా మార్చుకుంటారా అన్న‌ది కూడా పాయింటే..! సోష‌ల్ మీడియాను విప‌రీతంగా న‌మ్ముకునే ప్ర‌ధాని మోదీ చిత్ర‌రంగాన్ని న‌మ్ముకోవ‌డం వ‌ల్ల లాభ‌ప‌డ‌తాడా..? న‌ష్ట‌పోతాడా..! శ‌భం కార్డు ప‌డితే గాని తెలియ‌దు..!

English summary
It seems that the Prime Minister is involved in the two films. The BJP seems to have attempted to change the issue by saying that the Congress party had tried to tell the Prime Minister Manmohan Singh how much he had played in the election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X