వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపి యేతర రాష్ట్రాల మనుగడ కష్టమేనా..? బెంగాల్లో రావణ కాష్టం ఆరేదెప్పుడు..??

|
Google Oneindia TeluguNews

కోల్ కత/హైదరాబాద్ : శివసేప ఛీప్ మొన్నామద్య ఇచ్చిన ప్రకటన ప్రకారం బీజేపి యేతర రాష్టాలు మనగలగడం కష్టమేనా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు రిగిల్చిన చిచ్చు రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. తాజాగా, టీఎంసీ నాయకుడిని దుండగులు కాల్చి చంపారు. బీజేపీ-టీఎంసీ శ్రేణుల మధ్య పరస్పర దాడులు ఇప్పట్లో ఆగేలా లేవు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి యాభై రోజులు గడిచినప్పటికి కూడా అక్కడ రాజకీయ హింస తగ్గలేదు.

Recommended Video

అధిష్టానం ఆదేశించింది, మేము ఆచరిస్తాం - మురళీధర్ రావు

రాజకీయ రౌడీయిజమనేది పశ్చిమ బెంగాల్లో దశాబ్దాల నుంచి రాజ్యమేలుతోంది. లెఫ్ట్ ప్రభుత్వం హయాంలో దీనికి బీజాలు పడ్డాయి. అవి మొలకెత్తి, మొక్కల నుంచి వటవృక్షాలుగా మారాయి. మమతా బెనర్జీ అధికారాన్ని చేపట్టిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. లెఫ్ట్ పార్టీల వారిని మమతా బెనర్జీ తీవ్రంగా అణిచి వేసింది. రాజకీయ హింస విషయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా లెఫ్ట్ పార్టీలనే ఫాలో అయ్యిందనే అభిప్రాయాలు వినిపించాయి.

 భగ్గుమంటున్న బెంగాల్..! రాజకీయ కక్ష్యలతో రగిలి పోతున్న నేతలు..!!

భగ్గుమంటున్న బెంగాల్..! రాజకీయ కక్ష్యలతో రగిలి పోతున్న నేతలు..!!

ఇక గత కొంతకాలంలో అక్కడ భారతీయ జనతా పార్టీ ఉనికి చాటుతూ ఉంది. ఇటీవలి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో టీఎంసీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. షాకింగ్ రిజల్ట్స్ ను నమోదు చేసింది కమలం పార్టీ. దీంతో టీఎంసీ - బీజేపీల మధ్యన రచ్చ రాజుకుంది. యాభై రోజులు అయినా ఇంకా అది కొనసాగుతూ ఉండటం గమనార్హం. సార్వత్రిక ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కూడా పశ్చిమబెంగాల్ లో రాజకీయ ప్రశాంతత లేకుండా పోయింది. తాజాగా ముర్షిదాబాద్ జిల్లాలో ఒక టీఎంసీ నేతలను కొంతమంది కాల్చి చంపారు! పట్టపగలే ఇలా బహిరంగంగా కాల్చి చంపే రాజకీయాలు అక్కడ కొనసాగుతూ ఉంది. ఒకవైపు బీజేపీ బెంగాల్ లో తమ పార్టీ కార్యకర్తలు అనేక మంది మరణించారని అంటోంది.

రాజకీయ పైచేయి కోసం దాడులు..! చెలరేగుతున్న హింస..!!

రాజకీయ పైచేయి కోసం దాడులు..! చెలరేగుతున్న హింస..!!

టీఎంసీ దాడుల్లో చనిపోయిన కార్యకర్తల కుటుంబీకులను ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ప్రత్యేకంగా తీసుకెళ్లారు. ఇలాంటి పరిస్థితి ఉందక్కడ. ఇరు పార్టీలూ తమ తమ కార్యకర్తలను కోల్పోతూ ఉన్నాయి. రాజకీయ దాడులు ప్రతిదాడుల ఫలితంగానే ఈ పరిస్థితి నెలకొందని పరిశీలకులు అంటున్నారు. ఒకప్పుడు బెంగాల్ రాష్ట్రానికి చాలా మంచి పేరు ఉండేది. ‘బెంగాల్ ప్రజలు ఈ రోజు ఆలోచిస్తే... దానిని రేపు దేశం ఫాలో అవుతుంది. బెంగాల్ ప్రజలు ఈ రోజు ముందడుగు వేస్తే... రేపు దేశం దానిని అనుసరిస్తుంది' అనే మాట, గొప్పగా వినిపించేది. దీనికిప్పుడు కాలం చెల్లింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా అక్కడ రాజకీయ హింస పేట్రేగిపోతోంది. కక్షలు కార్పణ్యాలు, దాడులు ప్రతిదాడులు, హత్యలు ప్రతీకార హత్యలు, ఇలా, రావణ కాష్టంలాగా బెంగాల్ తగలబడుతూనే ఉంది.

 బీజేపిపై మండిపడుతున్న తృణమూల్..! మమత ఒంటెద్దు పోకడ అంటున్న బీజేపి..!!

బీజేపిపై మండిపడుతున్న తృణమూల్..! మమత ఒంటెద్దు పోకడ అంటున్న బీజేపి..!!

అంతే కాకుడా పశ్చిమ బెంగాల్‌లో పాఠశాల సిలబస్‌లో స్వాతంత్ర్య సమరయోధులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం వివాదాస్పదంగా మారింది. విప్లవ వీరులు కుదీరాం బోస్, ప్రఫుల్లా చాకీల చర్రితను బెంగాల్‌లో పాఠశాలలో పాఠ్యాంశంగా చేర్చారు. అయితే వారిని ఉగ్రవాదులంటూ తప్పుగా ముద్రించారు. దీనిపై రాష్ట్రంలో పెద్ద దుమారమే చెలరేగింది. సంబంధిత అంశంపై ప్రతిపక్ష వామపక్షాలు, కాంగ్రెస్‌ సభ్యులు అసెంబ్లీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్యం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం ఏంటనీ ప్రశ్నించారు. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠికి కూడా ఫిర్యాదు చేశారు.

 ఆరని మంటలు..! చల్లారేదెప్పుడో..!!

ఆరని మంటలు..! చల్లారేదెప్పుడో..!!

అయితే దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ తప్పును సరిదిద్దుకుంటామని తెలిపారు. అతివాదులుగా ముద్రించబోయి ఉగ్రవాదులుగా తప్పద్దం జరిగిందని వివరించారు. కాగా వారి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంపై జేడీయూ ఇదివరకే తప్పుబట్టిన విషయం తెలిసిందే. అతివాదులైన వారిద్దరి పేర్లు సిలబస్ నుంచి తక్షణం తొలగించాలని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి జేడీయూ లేఖ రాయడం కూడా సంచలనంగా మారింది.

English summary
According to a statement by Shiv Sena chief says that it is difficult for non-BJP states to survive. In West Bengal, the polls that have sparked elections are still raging. Recently, a TMC leader was shot dead by thugs. The mutual attacks between the BJP and TMC lines are no longer abrupt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X