• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీ, జేజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో జేజేపీ ఎన్నికల హామీల అమలు సాధ్యమేనా?

|

హర్యానాలో ఏ పార్టీకి మెజార్టీ దక్కకపోవడంతో జననాయక్ జనతా పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్ ఖట్టర్ ,ఆయనతోపాటు జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ సక్సెస్ కాదు అనే టాక్ వినిపిస్తుంది.

ఎన్నికల ముందు హర్యానాలోని ప్రజలకు జెజేపి తన మేనిఫెస్టోలో కీలకమైన వాగ్దానాలు ఇచ్చింది. అయితే ఆ వాగ్దానాలను బిజెపితో పొత్తు కారణంగా నెరవేర్చలేదు అన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రైతులు మరియు వ్యాపారస్తులకు రుణమాఫీ, నిరుద్యోగ యువతకు నెలవారి 11000 రూపాయల భత్యం ఇస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చడం కష్టమని తెలుస్తుంది. ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ గా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలు చేసిన వాగ్దానాలు రాష్ట్రం భరించే పరిస్థితిలో లేదని, రాష్ట్రానికి అంత ఆదాయవనరులు లేవని, అవన్నీ ఉత్త మాటలని ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.

Is it possible for the BJP and the JJP coalition government to implement the JJPs election guarantees?

ఇక జెజేపి తరహాలోనే కాంగ్రెస్ పార్టీ కూడా హామీలను గుప్పించింది. ఇక తాజాగా బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జే జే పి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై ఏం చేయబోతున్నారు అన్న అంశంపై ఆసక్తి సర్వత్రా నెలకొంది. కమిటీ ఏర్పాటు చేసి వాగ్దానాల మలుపై ఏకాభిప్రాయం సాధించాలనే ఆలోచనలో దుష్యంత్ చౌతాలా ఉన్నారు . బిజెపి, జేజెపి లతో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఏకాభిప్రాయానికి రావటానికి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ను రూపొందించి ఇక అందులో ఎన్నికల వాగ్దానాలను చేర్చే ఆలోచనలో ఉన్నారు.

ఇక ఈ నేపధ్యంలో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా సిర్సా లో పేర్కొన్నారు. హర్యానా లోని అన్ని రకాల ఉద్యోగాలను స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించడం, నెలవారి వృద్ధాప్య పెన్షన్లు 5 100 రూపాయలకు పెంచటం, రైతులకు కనీస మద్దతు ధర అందించడం వంటి హామీలను ఇచ్చిన జెజెపీ ఈ హామీల అమలుకు బిజెపి సర్కారును ఒప్పిస్తుందా అన్నది అనుమానమే. ఎందుకంటే బిజెపి ఎన్నికల హామీలో వృద్ధాప్య పెన్షన్ ను మూడు వేల రూపాయలకు పెంచుతామని మాత్రమే హామీ ఇచ్చింది. ఇక ఈ నేపద్యంలో జేజేపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు బీజేపీతో కలిసి సాగుతున్న తరుణంలో కష్టమే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Dushyant Chautala led Jannayak Janata Party (JJP) may not be able to fulfil some of the key promises made by it in its manifesto, such as a loan waiver for farmers and small shopkeepers and a monthly allowance of Rs 11,000 to unemployed youth, following its alliance with the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more