• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రత్యక్ష రాజకీయాలకు అద్వాని గుడ్ బై

|
  ప్రత్యక్ష రాజకీయాలకు అద్వాని గుడ్ బై...!! | Oneindia Telugu

  రాజకీయా కురువృద్దుడు,బిజేపి జాతియ పార్టికి దిశనిర్ధేశనం చేసిన నేత, అర్ధశాతాబ్ధానికి పైగ రాజకీయాల్లో చురుకుగా పార్టీకి సేవలందిచి, కొత్త ట్రెండ్ కు నాందిపలికిన ఎల్.కే ఆద్వాని ప్రత్యక్ష రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడనుంది.అద్వాని రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటినుండి స్వఛ్చంధంగా తప్పుకోనున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి..దీంతో 91 ఏళ్ల అద్వాని ప్రత్యక్ష రాజకీయ జీవితానికి తెరపడనుంది.

  జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి ఆకుల రాజీనామా:మాగంటి రూప గెలుపు కోసం టీడీపీతో లోపాయకారి ఒప్పందాలే కారణమా?

  1991 గాంధినగర్ లో మొదలైన ప్రస్థానం

  1991 గాంధినగర్ లో మొదలైన ప్రస్థానం

  గుజరాత్ లోని గాంధినగర్ లోక్ సభ స్థానం నుండి 1991 నుండి పోటి చేస్తున్న ఎల్ కే అద్వాని ఈసారి ఎన్నికల్లో స్వచ్చందంగా తప్పుకోనున్నట్టు తెలుస్తోంది.ప్రధానంగా 75 కు పై బడిన వారు పార్లమెంట్ కు పోటి చేసే అవకాశాన్ని బిజేపి కల్పించింది..అయినా గాంధినగర్ స్థానం కోసం సెర్చ్ కమిటికి ఎలాంటి ప్రతిపాదనలు అద్వాని పంపలేదు. మరోవైపు గాంధినగర్ స్థానం నుండి అద్వాని స్థానంలో ఎవర్ని పోటిచేయించాలనే అంశంపై పార్టీలో చర్చ జరిగింది. ప్రధానంగా ఓబిసి ,పటిదార్ లేదా బ్రహ్మిణ్ ను పోటి చేయించాలనే ఆలోచనల్లో కూడ ఉన్నట్టు తెలుస్తోంది.. మరోవైపు అక్కడి నుండి పార్టీ చీఫ్ అమిత్ షా పోటి చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.

  అద్వానికి ఎదురు లేరు,

  అద్వానికి ఎదురు లేరు,

  కాగా గాంధినగర్ నుండి అద్వాని ఆరు సార్లు పోటిచేశారు.పోటి చేసిన ప్రతి సారి ఆయన ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు..సాధరణంగా అద్వాని పోటి చేసిన గాంధినగర్ లో ప్రత్యర్థులు పోటి చేయాడానికి కూడ సహసించరు.ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ చాల మంది అభ్యర్థులను మార్చిన గెలపుమాత్రం అద్వానినే వరించింది.ఈనేపథ్యంలోనే అద్వాని పై పోటి చేసిన వారిలో ముఖ్యంగా మాజి ఎన్నికల కమిషన్ చైర్మన్ టిఎన్ శేషన్, సామాజిక ఉద్యమ నేత , శాస్త్రియ నృత్యకారిణి మల్లికా సారాబాయ్, లాంటి కూడ పోటి చేసిన వారిలో ఉన్నారు.

  రథ యాత్రతో చరిత్ర సృష్టించిన అద్వాని

  రథ యాత్రతో చరిత్ర సృష్టించిన అద్వాని

  బిజేపి చరిత్రలోనే అద్వాని చేసిన రథ యాత్ర మిగిలిపోతుంది..1990 లో అద్వాని రామ మందిరం నిర్మాణమే లక్ష్యంగా ఆయన చేసిన రథ యాత్ర పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని నింపింది..దీంతో పాటు దేశంలో పలు విమర్శలు సైతం వచ్చాయి..అయినా అద్వాని మాత్రం రథయాత్రను ఆపలేదు..దీంతో 1991 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజేపి మొదటి సారి 120 సీట్లను గెలుచుకుంది.కాగా గాంధినగర్ నుండి ఆయన పోటి చేసి గెలిచారు.

  యాత్రలతో పార్టిని గట్టేక్కించిన అద్వాని

  యాత్రలతో పార్టిని గట్టేక్కించిన అద్వాని

  ముఖ్యంగా రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా చేసిన యాత్ర అద్వాని కి జాతియ స్థాయిలో పట్టు సాధించారు..1990 సెప్టెంబర్ లో గుజరాత్ లోని సోమ్ నాథ్ నుండి ఆయన యాత్రను ప్రారంభించి అక్టోబర్ 30న ఆయోధ్యకు చేరుకుంది..ఈ యాత్రే బిజేపి కేంద్ర రాజకీయాలకు కీలకంగా మారింంది.ఇక ఈ యాత్రల అనంతరం అద్వాని 1193 లో జనదేశ్ యాత్ర, 1197 లో స్వర్ణజయంతి రథయాత్ర, 2004 లో భారత్ ఉదయ్ యాత్ర, 2006 లో భారత్ సురక్షా యాత్ర తోపాటు చివరగా 2011 సైతం జన్ చేతనయాత్ర ను చేపట్టారు.

  కలగా.. మిగిలిన ప్రధానమంత్రి కుర్చి

  కలగా.. మిగిలిన ప్రధానమంత్రి కుర్చి

  అయితే పార్టీకి ఇంత చేసి గట్టిక్కించిన అద్వానికి దేశ ప్రధాని కావాలనే కోరిక ఉండేది .అయితే పార్టీ పూర్తి స్థాయిలో 2014లో ఎంపీ సాధించడతో అప్పుడు ప్రధానిగా ఎన్నిక అవుతారని భావించారు..కాని ఆర్ఎస్ఎస్ అండతో మోడి ప్రధాని అయ్యారు .ఇక అప్పటి నుండి ఆయన పార్టి పరంగా కోన్ని ఇబ్బందులు ఎదుర్కోన్నారు. క్రియాశీల రాజకీలకు దూరంగా ఉన్నారు..ఈనేపథ్యంలోనే ఆయన ఈ ఎన్నికల్లో సైతం పోటి చేయకుండా స్వచ్చందంగా తప్పుకుంటున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Gandhinagar Lok Sabha seat has almost become synonymous with lk advani,all of the six general elections he has won from Gandhinagar his victory margin has been of over a lakh votes in 2014 in fact, the BJP leadership has already begun deliberating about who will replace Advani as candidate from Gandhinagar ,On his part, Advani chose not to talk about his candidature,
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more