వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధార్ లేకుంటే.. మధ్యాహ్నం భోజనం?: సుప్రీం ఆదేశాలకు విరుద్ధమే

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న వంటవారు, విద్యార్థులకు ఆధార్‌ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న వంటవారు, విద్యార్థులకు ఆధార్‌ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందని తెలుస్తోంది.

కాగా, ఇప్పటికీ ఆధార్‌కార్డు లేనివారికి జూన్‌ 30 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించింది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రత్వశాఖ నిర్ణయించింది. పాఠశాల విద్యకు సంబంధించిన రాయితీ పథకాలను ఆధార్‌తో అనుసంధానించడానికి కేంద్రం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ఉపక్రమించింది.

మధ్యాహ్న భోజన పథకంలో పారదర్శకతకు, సమర్థంగా అమలు చేసేందుకు ఆధార్‌తో అనుసంధానించాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ మేరకు పాఠశాలలకు నోటిఫికేషన్‌ పంపించనున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. వంటవారు/సహాయకులను కూడా లబ్ధిదారులుగానే పరిగణిస్తున్నామని, అందుకే వారు కూడా ఆధార్‌ను చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

mid day meal

అయితే, పాఠశాలల్లో చదువుకుంటున్న చిన్నారులకు కూడా ఆధార్ తప్పనిసరి చేయడం పట్ల పలువురు తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. మధ్యాహ్న భోజనం కావాలంటే చిన్నారులు కూడా ఆధార్ కార్డు కోసం తిరుగాలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆధార్ కార్డు లేని చిన్నారులకు మధ్యాహ్న భోజనం దూరం చేస్తారా? అని మండిపడుతున్నారు.

సాధ్యమేనా?: 'ఇక మధ్యాహ్న భోజనానికి ఆధార్ తప్పనిసరి' సాధ్యమేనా?: 'ఇక మధ్యాహ్న భోజనానికి ఆధార్ తప్పనిసరి'

కాగా, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్ణయం నేపథ్యంలో సుప్రీంకోర్టు 2014లో విడుదల చేసిన తీర్పును పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అన్ని పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయడం కుదరని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

తాము స్పష్టతనిచ్చే వరకూ ఏ పథకంపైనా ఆధార్ గుర్తింపును తప్పనిసరి చేయకూడదని కూడా సుప్రీంకోర్టు 2015లో తేల్చి చెప్పింది. ఆధార్ గుర్తింపు లేని విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి నోచుకోలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉండటంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ పునరాలోచించాల్సిన అవసరం ఉంది.

English summary
On Saturday the Ministry of Human Resource Development announced that the midday meal would no longer be free for those children without an Aadhaar card.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X