వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెహుల్ చోక్సీ కోసం ప్రత్యేక విమానం: వెస్టిండీస్‌కు ఈడీ సీబీఐ అధికారులు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక ఉగ్రవాది మెహుల్ చోక్సీ కోసం వేట మొదలైందా... విదేశాల్లో తలదాచుకున్న మెహుల్ చోక్సీని తిరిగి భారత్ రప్పించే ప్రయత్నాలు తారాస్థాయిలో జరుగుతున్నాయా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే మెహుల్ చోక్సీని భారత్‌కు రప్పిస్తారని ప్రభుత్వంలోని అత్యంత విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

మెహుల్ చోక్సీ.... ప్రముఖ వజ్రాల వ్యాపారి మరో ఆర్థిక నేరగాడైన నీరవ్ మోడీకి మేనమామ. బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వెస్టిండీస్‌లో ఉన్న మెహుల్ చోక్సీని తిరిగి భారత్ రప్పించేందుకు ఉన్నత స్థాయి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ అధికారులు ప్రత్యేక బోయింగ్ విమానంలో వెస్టిండీస్‌కు బయలు దేరి అతన్ని భారత్‌కు తీసుకురానున్నారు.

Is Mehul Choksi being brought back? Long-range Boeing with ED, CBI officials may head for West Indies

వివాదాస్పదమైన పెయిడ్ సిటిజన్‌షిప్ కింద మెహుల్ చోక్సీ కరేబియన్ దీవుల్లో తలదాచుకుంటున్నాడు. అతనితో పాటు డైమండ్ ప్రమోటర్ జతిన్ మెహతా కూడా అక్కడే ఉన్నాడు. జతిన్ మెహత సెయింట్ కిట్స్ మరియు నెవిస్ పౌరసత్వం కలిగి ఉన్నాడు. మరోవైపు చోక్సీ అంటిగ్వా మరియు బార్బోడా పౌరసత్వం ఈ మధ్యే పొందాడు. ఈ రెండు దీవులు వీసాలు లేకుండానే ఇక్కడికి వచ్చేందుకు దాదాపు 132 దేశాల వారికి అవకాశం కల్పిస్తోంది. దీన్నే అదనుగా భావిస్తున్నారు ఆర్థిక నేరగాళ్లు. పెట్టుబడుల నెపంతో ఇక్కడ పౌరసత్వాన్ని సులభంగా పొందుతున్నారు.

చోక్సీని కరేబియన్ దీవుల నుంచి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నీరవ్ మోడీని కూడా తీసుకురావాలని ప్రయత్నిస్తున్న కొన్నిఆయన తలదాచుకుంటున్న దేశానికి భారత్‌ల మధ్య కొన్ని సాంకేతిక చిక్కులు ఉండటంతో కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Top government sources have confirmed that India is moving ahead to bring back high-value economic offenders from the West Indies.A long-range Air India Boeing has been commissioned to handle this mission. Central Bureau of Investigation (CBI) and Enforcement Directorate (ED) officials will fly to the West Indies to bring these persons back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X