• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లాక్‌డౌన్ ఎఫెక్ట్: మోదీకి అది తప్పలేదా? ప్రధాని కూడా చేసిచూపారుగా! వైన్ షాపు దగ్గరా ‘లక్ష్మణ రేఖ’

|

''ఈ 21రోజులు మనం స్వీయనియంత్రణ పాటిద్దాం.. సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేద్దాం.. ఇంటిగడపనే లక్షణరేఖగా భావించి దాన్ని దాటకుండా లోపలుందాం'' అంటూ లాక్ డౌన్ ప్రకటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలకు పిలుపునిచ్చారు. ఇవ్వడమేకాదు.. స్వయంగా ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మోదీ 'లక్షణ రేఖ' పిలుపు అందుకున్న దేశం అదీఇదనే తేడాల్లేకుండా అన్ని చోట్లా దాన్ని అమలు చేస్తుండటం గమనార్హం. అలాగే, కేంద్ర సంస్థల ఆఫీసులన్నీ బుధవారం నుంచి మూతపడిన నేపథ్యంలో ప్రధానికి కూడా వర్క్ ఫ్రమ్ హోం తప్పనట్లు తెలుస్తోంది.

మోదీ నివాసంలో ఇదీ సీన్..

మోదీ నివాసంలో ఇదీ సీన్..

గత పద్ధతులకు భిన్నంగా మోదీ హయాంలో ప్రతి బుధవారం కేంద్ర కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తుండటం తెలిసిందే. లాక్ డౌన్ ఆదేశాల నేపథ్యంలో ఇవాళ్టి భేటీ ఇంకాస్త స్ఫూర్తిమంతంగా జరిగింది. ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్ లో మంత్రులు ఒకరికొకరు కనీసం మీటరు దూరంలో కూర్చొని మాట్లాడుకున్నారు. తద్వారా ఎవరి లక్ష్మణ రేఖ పరిధిలో వాళ్లు ఉంటూ.. అనవసర కాంటాక్ట్ కు దూరంగా ఉన్నారు. మోదీ కేబినెట్ సోషల్ డిస్టెన్స్ ఫొటో వైరలైంది.

ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తారా?

ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తారా?

కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజులపాటు(ఏప్రిల్ 14 వరకు) దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన దరిమిలా తదుపరి చర్యలపై మోదీ కేబినెట్ సమాలోచనలు జరిపింది. దేశంలో హెల్త్ కేర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.15వేల కోట్ల నిధుల్ని కేటాయిస్తున్నట్లు చెప్పిన ప్రధాని.. ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రులకు సూచించారు. వైరాలజీ ల్యాబ్స్ విస్తరణతోపాటు వైద్య సిబ్బంది ధరించే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్వీప్ మెంట్(పీపీఈ), కొత్తగా ఐసీయూ విభాగాలు, వెంటిలేటర్ల ఏర్పాటు, మెడికల్ సిబ్బంది శిక్షణ తదితర అవసరాల కోసం ఆ రూ.15వేల కోట్లను ఖర్చుచేయనున్నారు. అలాగే, పలు రాష్ట్రాల్లో పౌరసరఫరాల శాఖ ద్వారా బియ్యం, నిత్యావసరాలు పపిణీ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం తరఫున ఇంకేదైనా అదనపు సాయం, రోజు కూలీలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని ఆదుకునేలా ప్యాకేజీ రూపొందించే అంశంపైనా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

మోదీ వర్కింగ్ ఫ్రమ్ హోం?

మోదీ వర్కింగ్ ఫ్రమ్ హోం?

దేన్నైనా చెప్పడంతోపాటు ఆచరించే అలవాటున్న ప్రధాని మోదీ.. ఆదివారం నాటి ‘జనతా కర్ఫ్యూ'రోజునా ఇంటికే పరిమితమయ్యారు. సోమ, మంగళవారాల్లోనూ వీడియో కాన్ఫరెన్సుల్లోనే ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ పరిమిత సిబ్బందితో, అది కూడా వర్క్ ఫ్రమ్ హోం చేయడమే బెస్టని ఆయన సూచించారు. ఇక బుధవారం నాటి కేబినెట్ సమావేశాన్ని కూడా ఇంట్లోనే నిర్వహించారు. అత్యవసర సేవలు మినహా కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని కార్యాలయాలు ఏప్రిల్ 14 వరకు మూగబడి ఉంటాయని హోం శాఖ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

అధినేతే మార్గదర్శి..

అధినేతే మార్గదర్శి..

డిఫెన్స్, సెంట్రల్ పోలీస్, ట్రెజరీ, పెట్రోలియం, గ్యాస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ సరఫరా, పోస్ట్ ఆఫీసులు, సమాచార వ్యవస్థలు, ముందస్తు హెచ్చరికల విభాగాలు మినహా అన్ని ఆఫీసులు బుధవారం నుంచి బంద్ అయ్యాయి. వీటిలో ప్రధాని మోదీ నేరుగా నిర్వహిస్తోన్న శాఖలేవీ లేవు. అయితే ప్రభుత్వాధినేతగా అందరికీ మార్గదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని వ్యవహారాలను ఆయన ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన పూర్తిగా వర్క్ హోంకు పరిమితమయ్యారా? లేదా? అనేది స్పష్టంగా తెలియాల్సిఉంది.

వైన్ షాపుల వద్దా గీతలే..

వైన్ షాపుల వద్దా గీతలే..

వచ్చే 21 రోజుల పాటు ఎవరికివారు లక్షణరేఖలు గీసుకుని సోషల్ డిస్టెన్స్ పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపుతో దేశం నలుమూలలా కొత్త సంసృతి కనిపిస్తున్నది. సరుకుల దుకాణాలు, పాల బూత్ లు, కూరగాయల షాపులు, ఏటీఎంలు, బ్యాంకులు.. చివరికి వైన్ షాపుల దగ్గర కూడా జనం సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. ఇందుకోసం ముగ్గుతో గీతలు గీసి అందులో మాత్రమే నిలబడుతున్నారు. ఈ లక్షణ రేఖల ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే,

తెలుగులో మోదీ..

తెలుగులో మోదీ..

నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది. ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నాను''అని ఆయన ట్విటర్ లో రాసుకొచ్చారు. ఉగాదితోపాటు ఆయా రాష్ట్రాల్లో చేసుకునే గుడి పాడవా, నవ్రేష్ పండుగల సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్పారు.

  Karthik Aryan Spreading Awareness On Covid 19

  English summary
  A day after PM Modi lockdown call, the ministers were seated with enough distance from each other in cabinet meet held at pms residence. it is unclear that whether pm modi is working from home or not. while all indians follows is 'Lakshman Rekha' call
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X