వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమాజ్ మసీదులోనే చేయాలా...1994 సుప్రీం తీర్పును పునఃపరిశీలించనున్న జస్టిస్ దీపక్ మిశ్రా బెంచ్

|
Google Oneindia TeluguNews

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆ పదవిలో మరో వారం రోజుల పాటు మాత్రమే ఉంటారు. ఈ సమయంలో ఆయన పలు కీలక కేసులపై తీర్పు ఇవ్వనున్నారు. ఇందులో ముఖ్యంగా అయోధ్యలో రామమందిర నిర్మాణంపై తీర్పు చెప్పనున్నారు. అయితే ఇక్కడ రామమందిర నిర్మాణ అంశం ముఖ్యం కాదు... 1994లో డాక్టర్ ఇస్మాయిల్ ఫరూకీ ఇచ్చిన తీర్పులో చట్టానికి సంబంధించిన అంశంపై తీర్పు ఇవ్వనున్నారు జస్టిస్ దీపక్ మిశ్రా. మసీదు అనేది ఇస్లాం మతంలో భాగామా కాదా అనే అంశంపై తీర్పు ఇవ్వనున్నారు.

2010 రామజన్మభూమి వివాదంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కొందరు ఆశ్రయించారు. ఈ కేసును విచారణ చేస్తున్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల ధర్మాసనం మరో కొత్త పాయింట్‌ను వెలికితీసింది. అసలు మసీదు ఇస్లాం మతంలో భాగమేనా అనే కొత్త పాయింట్ తెరపైకొచ్చింది.

Is a Mosque essential for Islam and Namaz: De-coding the 1994 SC verdict

అయోధ్య చట్టం 1993 రాజ్యాంగ బద్ధమేనా అన్న అంశంపై విచారణ జరిపింది జస్టిస్ ఎంవీ వర్మ, రే, బరూచాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం. దీనిపై తీర్పును కూడా వెలువరించింది. ఈ సందర్భంగా మసీదు ఇస్లాంలో భాగమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ముస్లిం మతానికి చెందిన వ్యక్తి కేవలం మసీదులోనే ప్రార్థనలు చేయాలని ముస్లిం మతం ఎక్కడా బోధించలేదని... ఎక్కడైనా ప్రార్థనలు చేసుకోవచ్చని పేర్కొందని న్యాయమూర్తులు గుర్తు చేశారు. ఇతర మతాలు కూడా ఇదే అనుసరిస్తున్నాయని వారు పేర్కొన్నారు.

ఇక ఇదే అంశంపై ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేయనుంది. 1994లో వచ్చిన తీర్పునే బెంచ్ సమర్థించే అవకాశం ఉంది..లేదా అందులోని అంశాలను అర్థం చేసుకోవాలని సూచించే అవకశం ఉందని అదీ కాకపోతే మొత్తంగా ఆ తీర్పునే కొట్టేసే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు. రామజన్మభూమి విషయంలో చట్టపరమైన అంశాలకు సమాధానం ఇచ్చిన తర్వాత కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశముంది. ఇక్కడే అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేపట్టొచ్చా లేదా అనేదానిపై తుది తీర్పు వెలువడుతుంది.

English summary
In his final week in office, Chief Justice of India, Dipak Misra would pronounce an important verdict relating to the Ram Temple issue. It must be clarified here that the verdict is not relating to the title suit, but regarding a point of law that arose out of the Dr. Ismail Faruqui verdict of the Supreme Court in 1994.The point of contention is whether a Mosque is an essential part of Islam. This point came up when the Bench comprising CJI Misra and Justices Ashok Bhushan and Abdul Nazeer were hearing a batch of appeals arising out of the 2010 verdict of the Allahabad High Court in the Ram Janmabhumi case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X