Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చక్రం తిప్పిన ప్రశాంత్ కిషోర్ : మోడీ-నితీష్ బ్రేకప్ వెనుక: తెర పైకి కొత్త ఫార్ములా..!!

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ బిహార్ వైపు చూపులు సారించాయి. ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలను కూల్చుకుంటూ వెళ్లిన భారతీయ జనతా పార్టీకి తొలిసారిగా రివర్స్ షాక్ తగిలిందక్కడ. బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జనత దళ్ (యునైటెడ్) అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాలను సరికొత్త మలుపు తిప్పగలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. బీజేపీకి బ్యాడ్ టైమ్ మొదలైందనే వాదనలు వినిపిస్తోన్నాయి.

2 గంటలకు

2 గంటలకు

ఉన్నట్టుండి నితీష్ కుమార్- బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. దీనితో బీజేపీ-జేడీయూ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. అదే జేడీయూ తాజాగా ప్రతిపక్ష స్థానంలో ఉన్న రాష్ట్రీయ జనతా దళ్‌తో పొత్తు పెట్టుకుని.. ప్రభుత్వాన్ని నెలకొల్పబోతోంది. ఇవ్వాళే నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఫగు చౌహాన్.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

8వ సారి ప్రమాణం..

8వ సారి ప్రమాణం..

బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతోండటం ఇది ఎనిమిదవ సారి. కాగా- ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి లభించే అవకాశం ఉంది. జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి ప్రభుత్వానికి నితీష్ కుమార్ సారథ్యాన్ని వహించనున్నారు. ఆయా పార్టీల శాసన సభ్యులకు మంత్రివర్గంలో చోటు లభించనుంది. తొలి విడత నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.

బీజేపీకి రివర్స్ షాక్..

బీజేపీకి రివర్స్ షాక్..

కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత.. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోనూ అలాంటి ప్రయత్నమే జరిగినప్పటికీ.. అది సాధ్యపడలేదు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీలోకి తీసుకున్నట్టుగానే రాజస్థాన్‌లో సచిన్ పైలెట్‌తో కాంగ్రెస్‌లో చీలికను తెచ్చే ప్రయత్నం చేసింది బీజేపీ అధిష్ఠానం. అది కాస్తా బెడిసి కొట్టింది.

నితీష్ వెనుక..

నితీష్ వెనుక..

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, మహారాష్ట్రలో శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్-కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వాలను బీజేపీ కుప్పకూల్చింది. వాటి స్థానంలో తాను అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆపరేషన్ లోటస్‌ను దీనికోసం ప్రయోగించింది. బిహార్‌లో కూడా అలాంటి ప్రయత్నమే సాగుతోందని ముందుగానే నితీష్ కుమార్ పసిగట్టడం వల్లే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారనే ప్రచారం దేశ రాజకీయాల్లో ఊపందుకుంది.

ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ..

ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ..

బీజేపీకి రివర్స్ షాక్ తగలడం వెనుక ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రమేయం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఆయన స్వరాష్ట్రం.. బిహార్. ఇదివరకు జేడీయూ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ పార్టీకి ప్రధాన రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్ట దలిచిన కొన్ని వివాదాస్పదమైన బిల్లులకు నితీష్ కుమార్ మద్దతు ప్రకటించడంతో ప్రశాంత్ కిషోర్.. విభేదించారు. పార్టీ నుంచి బయటికి వచ్చారు.

అప్పుడు విడిపోయినా..

అప్పుడు విడిపోయినా..

ఆ తరువాత కూడా నితీష్ కుమార్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ వచ్చారనేది ఈ తాజాగా ఉదంతంతో స్పష్టమైంది. చాపకింద నీరులా ఆయన వ్యవహరించారు. బీజేపీకి ఎసరు పెట్టారు. ప్రస్తుతం జేడీయూ .. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ మళ్లీ- నితీష్ కుమార్‌తో జట్టుకట్టే అవకాశాలు లేకపోలేదు. భవిష్యత్‌లో ఆయనను ప్రధానిమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే అవకాశాలు లేకపోలేదనే అంచనా ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+