వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ అల్లర్లకు పాకిస్థాన్ బడ్జెట్ లో నిధులు: నేరుగా ఉగ్రవాదులకు, ఆర్మీనే స్వయంగా!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ, కాశ్మీర్ లో అల్లర్లు సృష్టించడానికి పాకిస్థాన్ రూ. 34,00,00,000 కేటాయించిందా ? అంటే అవును అంటున్నాయి భారత ఇంటిలిజెన్స్ వర్గాలు. జమ్మూ కాశ్మీర్ లో అల్లర్లు సృష్టించడానికి పాకిస్థాన్ తన వార్షిక బడ్జట్ లో 5% నిధులు కేటాయించిందని ఇంటిలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి.

పాకిస్థాన్ వార్షిక బడ్జెట్ 42 మిలియన్ అమెరికన్ డాకర్లు. అందులో పాకిస్థాన్ ఆర్మీకి ప్రతి సంవత్సరం 6,8 మిలియన్ అమెరికన్ డాలర్లు కేటాయిస్తోంది. అందులో ఐదు శాతం అంటే దాదాపు రూ. 34,00,00,000 మొత్తం జమ్మూ కాశ్మీర్ లో అల్లర్లు సృష్టించడానికి పాకిస్థాన్ ఖర్చు చేస్తోందని భారత ఇంటిలిజెన్స్ వర్గాలు ఆధారాలు సేకరించాయి.

కాశ్మీర్ అల్లర్లు పాక్ ఆర్మీకి ఆహారం!

కాశ్మీర్ అల్లర్లు పాక్ ఆర్మీకి ఆహారం!

జమ్మూ కాశ్మీర్ లో నిత్యం అల్లర్లు జరగాలని పాకిస్థాన్ ఆర్మీ గట్టిగా కోరుకుంటోందని సమాచారం. అక్కడ అల్లర్లు జరుగుతున్నంత కాలం పాక్ ఆర్మీకి కడుపునిండా ఆహారం చిక్కినట్లే అని వారు భావిస్తున్నారని, అందుకే అంత మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడానికి పాక్ ఆర్మీ సిద్దం అయ్యిందని వెలుగు చూసింది.

ఈ ఉగ్రవాదులకే పాక్ నిధులు !

ఈ ఉగ్రవాదులకే పాక్ నిధులు !

జమ్మూ కాశ్మీర్ లో అల్లరు సృష్టించడానికి పాకిస్థాన్ ఆర్మీ కొన్ని ఉగ్రవాద సంస్థలను పెంచిపోషిస్తోందని భారత ఇంటిలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. లష్కర్-ఏ-తోయిబా, హిజ్బల్ ముజాహిద్దీన్, జైష్ -ఎ- అహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు పాక్ ఆర్మీ నిధులు కేటాయిస్తోందని భారత నిఘా వర్గాలు పసిగట్టాయి.

కాశ్మీర్ లో వీరి సహకారంతోనే ఇలా !

కాశ్మీర్ లో వీరి సహకారంతోనే ఇలా !

కాశ్మీర్ లోయలో ప్రత్యేకనినాదం చేస్తున్న యువతను ఉగ్రవాద కార్యకలాపాల వైపు ఆకర్షించడానికి పాక్ ఆర్మీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది. ప్రత్యేక కాశ్మీర్ అంటున్న వారిని గుర్తించి వారికి నిధులు కేటాయించి రెచ్చగొడుతున్నారని నిఘా వర్గాలు పసిగట్టాయి.

ఎన్ఐఏ అధికారుల విచారణలో !

ఎన్ఐఏ అధికారుల విచారణలో !

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల విచారణలో అనేక విషయాలు వెలుగు చూశాయి. కాశ్మీర్ లోయలో ప్రతేక నినాదాలు చేస్తున్న వారికి పాకిస్థాన్ నుంచి పెద్ద మొత్తంలో నిధులు అందుతున్నాయని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.

పాక్ నుంచి నిధులు ఎవరెవరికి వచ్చాయి !

పాక్ నుంచి నిధులు ఎవరెవరికి వచ్చాయి !

కాశ్మీర్ లోయలో ప్రత్యేక నినాదం చూస్తూ ప్రజలను రెచ్చగొడుతున్న అల్లరిమూకలు ఎవరు ? పాక్ నుంచి ఎవరెవరికి నిధులు వచ్చాయి ? ఎంత పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయి ? అనే వివరాలు సేకరించిన ఎన్ఐఏ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలు పెట్టడానికి సిద్దం అయ్యారు.

కొందరు ఉగ్రవాదుల మీద నిఘా ?

కొందరు ఉగ్రవాదుల మీద నిఘా ?

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఇప్పటికే ఉగ్రవాదుల సానుభూతిపరులు కొందరిని గుర్తించారని వెలుగు చూసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించాలని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అన్నీ సిద్దం చేసుకుంటున్నారని తెలిసింది.

పోయేకాలం దగ్గరకు వచ్చింది !

పోయేకాలం దగ్గరకు వచ్చింది !

జమ్మూ కాశ్మీర్ లొ అల్లర్లు సృష్టించడానికి పాకిస్థాన్ రూ. 34,00,00,000 కేటాయించిందని వెలుగు చూడటంతో భారత నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. పాక్ ఆర్మీ స్వయంగా ఆ నిధులు పంపిణిచేస్తోందని గుర్తించారు. పాక్ కు పోయేకాలం దగ్గర పడే ఇలా తన బడ్జెట్ లో కాశ్మీర్ లో అల్లర్లు సృష్టించడానికి నిధులు కేటాయించిదని భారత నిఘా వర్గాలు అంటున్నాయి.

English summary
Is Rs 340,000,000 the annual budget that the Pakistan army has allocated for funding trouble in Kashmir? An Intelligence Bureau report states that the Pakistan army has allocated 5 per cent of its annual budge for the Kashmir battle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X