వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్టులు: తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి సచిన్ పైలట్? రాహుల్, ప్రియాంకలతో భేటీ! బల నిరూపణపై ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాజకీయాలు మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడిన సీనియర్ నేత సచిన్ పైలట్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించినట్లుగా తెలుస్తోంది.

రాహుల్, ప్రియాంకలతో సచిన్ పైలట్ భేటీ!

రాహుల్, ప్రియాంకలతో సచిన్ పైలట్ భేటీ!

సచిన్ పైలట్.. తాజాగా సోమవారం కాంగ్రెస్ పార్టీ కీలక నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిసినట్లు సమాచారం. ఆగస్టు 14న రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను వ్యతిరేకించి 18 మంది ఎమ్మెల్యేలతో పార్టీని వీడిన సచిన్ పైలట్.. పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌తో టచ్‌లోనే ఉన్నారని గాంధీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

సచిన్ పైలట్ తిరిగి సొంతగూటికే చేరుతారా?

సచిన్ పైలట్ తిరిగి సొంతగూటికే చేరుతారా?

కాగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ అవినాశ్ పాండే ఇంఛార్జీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. హైకమాండ్ ఆదేశాల మేరకు రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, సచిన్ పైలట్ లాంటి సీనియర్ నేతను వదలుకునేందుకు సిద్ధంగా లేని కాంగ్రెస్ అధిష్టానం.. పార్టీలోకి తిరిగి వస్తే స్వాగతిస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సచిన్ పైలట్ మళ్లీ తన సొంతగూటికి చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

అశోక్ గెహ్లాట్ కీలక ప్రకటన..

అశోక్ గెహ్లాట్ కీలక ప్రకటన..


ఆగస్టు 14న రాజస్థాన్ అసెంబ్లీలో జరిగే బలనిరూపణ పరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేస్తే.. రెబల్ ఎమ్మెల్యేలను క్షమించి తిరిగి పార్టీలోకి తీసుకుంటామని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీర్ మీనా స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురు రెబల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారని, సచిన్ పైలట్ నిర్ణయం సోమవారం రాత్రి వరకు తెలిసే అవకాశం ఉందని చెప్పారు.

సచిన్ నిర్ణయం త్వరలోనే.. 14న బలనిరూపణపై ఉత్కంఠ

సచిన్ నిర్ణయం త్వరలోనే.. 14న బలనిరూపణపై ఉత్కంఠ

ఇక సచిన్ పైలట్ సహా కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి క్షమాపణలు చెబితే.. తాను వారిని తిరిగి ఆహ్వానిస్తానని సీఎం అశోక్ గెహ్లాట్ కూడా స్పష్టం చేశారు. కాగా, సచిన్ పైలట్ తోపాటు 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. దీంతో డిప్యూటీ సీఎం పదవి నుంచి సచిన్ పైలట్ నుంచి తప్పించారు సీఎం గెహ్లాట్. అయితే, సచిన్ పైలట్ తాను బీజేపీలో చేరడం లేదని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనతో మంతనాలు జరుపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆగస్టు 14న జరిగే బలనిరూపణ పరీక్షపై ఉత్కంఠ కొనసాగుతోంది.

English summary
Is Sachin Pilot Looking Back to join in Congress? Meeting With Rahul Gandhi, Priyanka Sparks Buzz.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X