వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవీఎంల రిగ్గింగులో ప్రమేయం ఉందా? సుప్రీంకోర్టుపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసులో సుప్రీంకోర్టు వైఖరిని తప్పుబడుతూ కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వందశాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న పిల్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చడంపై వాయువ్య ఢిల్లీ మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల డిమాండ్‌ను సుప్రీంకోర్టు ఎందుకు పట్టించుకోవడంలేదన్న ఆయన.. రిగ్గింగ్‌లో కోర్టు సైతం పాలుపంచుకుందా అని ప్రశ్నించారు.

హవ్వా .. బాలుడితో ఈవీఎం మోయిస్తారా : ఈసీపై తేజస్వి గుస్సాహవ్వా .. బాలుడితో ఈవీఎం మోయిస్తారా : ఈసీపై తేజస్వి గుస్సా

మూడు నెలలుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియతో పాలన అటకెక్కిందన్న విషయం సుప్రీంకోర్టు మర్చిపోయిందని ఉదిత్ రాజ్ అభిప్రాయపడ్డారు. మరో రెండు ముడ్రోజులు ఓట్ల లెక్కింపులో జాప్యాన్ని ఎందుకు తీవ్రంగా పరిగణిస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానాన్ని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు. లెక్కించే వీవీ ప్యాట్ స్లిప్పుల సంఖ్యను పెంచాలని కోరుతూ 22 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. ఓట్ల లెక్కింపులో జాప్యం చేసుకుంటుందని న్యాయస్థానం తిరస్కరించడాన్ని ఉదిత్ రాజ్ తప్పుబట్టారు.

Is SC also involved in EVM rigging: Udit Raj

మూడు నెలల పాటు సాగిన ఎన్నికల ప్రక్రియతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఉదిత్ రాజ్ విమర్శించారు. స్లిప్పుల లెక్కింపునకు మరో ఒకట్రెండు రోజులు సమయంపడితే ఏమవుతుందని ప్రశ్నించారు. తాను సుప్రీంకోర్టుపై ఎలాంటి ఆరోపణలు చేయడంలేదని, తన ఆందోళనను మాత్రమే వెలిబుచ్చుతున్నానని స్పష్టం చేశారు.

English summary
Congress leader Udit Raj on Wednesday in a serious development raised questions over the way the Supreme Court has dealt with complaints of EVM rigging and with petitions seeking review of 100 per cent VVPAT slips along with electronic voting machines on vote counting day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X