• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌లో విలయం: Sputnik V రాకతో భరోసా? -రష్యన్ వ్యాక్సిన్ ధర, సమర్థత ఎంత? -కీలక అంశాలివే

|

భారత్ లో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా మారింది. కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. విలయానికి అడ్డుకట్ట వేసే క్రమంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. విదేశాల్లో తయారైన వ్యాక్సిన్లను సైతం అత్యవసర వినియోగానికి అనుమతిస్తున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటి కొవిడ్ వ్యాక్సిన్ గా రష్యా అభివృద్ది చేసిన 'స్ఫుత్నిక్ వి' వ్యాక్సిన్ ను భారత్ లో వాడేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) మంగళవారం అనుమతి జారీ చేసింది. దీంతో..

  Russian vaccine In India : Is Sputnik V Effective Against Covid-19? రష్యన్ వ్యాక్సిన్ ధర, సమర్థత..!!

  జగన్‌పై వి'ప్లవ' పోరాటం: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ పిలుపు -కామెడీ పీస్ అంటూ విజయసాయిరెడ్డి ఫైర్జగన్‌పై వి'ప్లవ' పోరాటం: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ పిలుపు -కామెడీ పీస్ అంటూ విజయసాయిరెడ్డి ఫైర్

   భారత్‌లో మూడో వ్యాక్సిన్..

  భారత్‌లో మూడో వ్యాక్సిన్..

  మన దేశంలో కొవిడ్ కేసులకు సంబంధించి అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లను వాడుతున్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన అందరికీ టీకాలను ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్', బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలతో కలిసి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) తయారు చేసిన ‘కొవిషీల్డ్' వ్యాక్సిన్లకు తోడు మూడో టీకాగా రష్యా తయారీ ‘స్ఫుత్నిక్ వి' వ్యాక్సిన్ కు భారత్ అనుమతిచ్చింది. ఇప్పటికే 60కిపైగా దేశాలు ఆమోదించిన ఈ స్ఫుత్నిక్ వ్యాక్సిన్ ధ‌ర ఇండియాలో ఎంత ఉండ‌బోతోంది? ఈ వ్యాక్సిన్ వ‌ల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దీని సామ‌ర్థ్యం ఎంత? టీకా ఎలా వేస్తారు? స్టోరేజ్ ఎలా అన్న అంశాల‌పై చర్చ జరుగుతోంది..

   స్ఫుత్నిక్ వి సామ‌ర్థ్యం ఎంత?

  స్ఫుత్నిక్ వి సామ‌ర్థ్యం ఎంత?

  ప్రపంచ వ్యాప్తంగా టీకాలకు సంబంధించిన కీలక విషయాలను ప్రచురించే ప్రఖ్యాత లాన్సెట్‌ సంస్థ తన తాజా ప్రచురణలో స్ఫుత్నిక్ వి సమర్థతపై వివరణ ఇచ్చింది. లాన్సెట్ డేటా ప్ర‌కారం 60 ఏళ్లు పైబ‌డిన వాళ్ల‌లో స్పుత్నిక్ వి టీకా పనిచేసే సామ‌ర్థ్యం 91.8 శాతంగా ఉంది. మ‌ధ్య‌స్థ స్థాయి నుంచి తీవ్ర స్థాయి కొవిడ్‌-19 విష‌యంలో 100 శాతం స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న‌ట్లు తేలింది. కాగా, ఇండియాలో ప్రఖ్యాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో భాగస్వామ్యంలో స్ఫుత్నిక్ విపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. మొత్తం 13 వేల మంది క్లినిక‌ల్ ప్ర‌యోగాల్లో పాల్గొన్నారు. ఈ అధ్య‌య‌నం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇది జూన్‌లోగా పూర్తి కానుంది. ఆ త‌ర్వాతే ఇండియాలో దీని సామ‌ర్థ్యంపై స‌మ‌గ్ర వివ‌రాలు అందుతాయి.

  స్టోరేజీ, తరలింపు చాలా తేలిక..

  స్టోరేజీ, తరలింపు చాలా తేలిక..

  కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన తొలినాళ్లలో భారత్ లో కోల్డ్ స్టోరేజీ చైన్ పై ఆందోళనలను వ్యక్తమయ్యాయి. అంటే వ్యాక్సిన్లను ఆయా ఉష్ణోగ్రతల్లో నిల్వ ఉంచడానికి గ్రామీణ ప్రాంతాల వరకు వ్యవస్థ ఉందా అనే చర్చ జరిగింది. అయితే ఇప్పటిదాకా అందుబాటులోకి వచ్చిన కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు 2 డిగ్రీల ఉష్ణోగ్రతలో వాడేవే కావడంతో పెద్దగా ఇబ్బందులు రాలేదు. తాజాగా అనుమతి పొందిన స్ఫుత్నిక్ వి కూడా దాదాపు అలాంటిదే. ఈ వ్యాక్సిన్‌ను రెండు విధాలుగా స్టోర్ చేయ‌వ‌చ్చు. ద్రవ రూపంలో అయితే -18 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్ర‌త అవ‌స‌రం. పొడి రూపంలో అయితే 2-8 డిగ్రీల సెంటిగ్రేడ్ స‌రిపోతుంది. అంటే మ‌న ఇండ్ల‌లో ఉండే రిఫ్రెజిరేట‌ర్‌ల‌లోనూ దీనిని స్టోర్ చేసుకోవ‌చ్చు. ప్ర‌త్యేకంగా కోల్డ్‌-చెయిన్ అవ‌స‌రం లేదు.

   స్పుత్నిక్ ధ‌ర, సైడ్ ఎఫెక్ట్స్..

  స్పుత్నిక్ ధ‌ర, సైడ్ ఎఫెక్ట్స్..

  ప్ర‌స్తుతం ఇండియాలో ఇస్తున్న రెండు వ్యాక్సిన్ల (కొవిషీల్డ్, కొవాగ్జిన్) ధ‌ర ఒక్కో డోసుకు రూ.250 మాత్ర‌మే. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో అయితే ఉచితంగానే ఇస్తున్నారు. కాగా, స్పుత్నిక్ వి ధ‌ర ఇండియాలో ఎంత అన్న‌ది మాత్రం ఇంకా తెలియ‌లేదు. ఇత‌ర దేశాల్లో మాత్రం ప‌ది డాల‌ర్లు (రూ.750)లోపే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ స్పుత్నిక్ వితో తీవ్ర ప‌రిణామాలు ఎదురైన సంద‌ర్భాలు ఏమీ లేవు. జ‌లుపు, త‌ల‌నొప్పిలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్ర‌మే కనిపించిన‌ట్లు డేటా చెబుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న చెయ్యి నొప్పిగా ఉండ‌టం, అల‌సిపోయిన‌ట్లు ఉండ‌టం, కాస్త ఉష్ణోగ్ర‌త పెర‌గ‌డంలాంటి స్వ‌ల్ప ల‌క్ష‌ణాలే క‌నిపించిన‌ట్లు తేలింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ వ్యాక్సిన్ తాలూకు మ‌ర‌ణాలు ఏవీ సంభవించ‌లేదు. స్ఫుత్నిక్ ను ఆమోదించిన 60వ దేశంగా భారత్ నిలిచింది. ఏప్రిల్ చివరి వారం లేదా మే నెల మొదటి వారం నుంచి మన దేశంలో దీనిని పంపిణీ చేయనున్నారు. కాగా,

  స్పుత్నిక్ రెండో డోస్ భిన్నంగా..

  స్పుత్నిక్ రెండో డోస్ భిన్నంగా..

  మిగ‌తా రెండు వ్యాక్సిన్ల‌లాగే స్పుత్నిక్ వి కూడా రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో డోసు 0.5 మిల్లీలీట‌ర్లు. అయితే తొలి, మ‌లి విడ‌త డోసుల‌కు కాస్త వేరుగా ఉండే వెర్ష‌న్ల‌ను ఉప‌యోగించ‌డం స్పుత్నిక్ వి ప్ర‌త్యేక‌త‌. తొలి డోసు (rAd26) ఓ వెక్టార్ కాగా.. రెండో డోసు (rAd5) మ‌రో వెక్టార్‌. రెండు వేర్వేరు వెక్టార్ల‌ను వాడినా ఇవి రెండూ వైర‌స్ స్పైక్ ప్రొటీన్‌పై దాడి చేస్తాయి. ఒకే వెర్ష‌న్ కంటే రెండు వెర్ష‌న్లు వాడితే శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి మ‌రింత పెరుగుతుందని ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన వాళ్లు చెబుతున్న మాట‌. ఒక‌టి, రెండు డోసులను 21 రోజుల వ్య‌వ‌ధిలో ఇస్తారు.

  video leak: జగన్, దొంగ సాక్షి విష పన్నాగం -నారా లోకేశ్‌తో విడదీయలేరు: టీడీపీ అచ్చెన్నాయుడు రియాక్షన్video leak: జగన్, దొంగ సాక్షి విష పన్నాగం -నారా లోకేశ్‌తో విడదీయలేరు: టీడీపీ అచ్చెన్నాయుడు రియాక్షన్

  English summary
  The Drug Controller General of India (DCGI) on Tuesday approved the use of the Russian Sputnik V vaccine against coronavirus in the country. This is the third vaccine get emergency use authorisation in the country after Covishield, developed by Oxford University-AstraZeneca and manufactured by the Serum Institute of India (SII), and Bharat Biotech’s Covaxin. Is Sputnik V Effective Against Covid-19? All Your FAQs on Side Effects, Usage, Doses Answered
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X