వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్స్ పేరుతో సుశాంత్ సింగ్ మృతి కేసు సైడ్ ట్రాక్ పట్టిందా..? సీబీఐ ఏం చెబుతోంది..?

|
Google Oneindia TeluguNews

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్...బాలీవుడ్ హార్ట్ థ్రోబ్.. అనుకోని పరిస్థితుల్లో తనవు చాలించారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అది కచ్చితంగా హత్యే అని తన స్నేహితులు గణేష్ మరియు అంకిత్ చెబుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు న్యాయం జరగాలంటూ వారు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇంతకీ సుశాంత్ సింగ్ కేసు మరుగున పడిందా..? సీబీఐ కేసును పక్కనపెట్టేసిందా.. సీబీఐ వెర్షన్ ఏంటి..?

 కొన్ని రోజుల పాటు హడావుడి

కొన్ని రోజుల పాటు హడావుడి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత కొన్ని రోజుల వరకు అన్ని జాతీయ ఛానెళ్లు హడావుడి చేశాయి. సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్య కాదు హత్యే అని రుజువు చేసే ప్రయత్నం చేశాయి. కొన్ని రోజుల పాటు సుశాంత్ సింగ్ మృతిపై జస్టిస్ ఫర్ సుశాంత్, జస్టిస్ ఫర్ ఎస్ఎస్ఆర్ అనే హ్యాష్ ట్యాగ్స్‌ కూడా ట్రెండ్ అయ్యాయి. అయితే సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఇక ఇటు రాజకీయంగా అటు అభిమానుల నుంచి సుశాంత్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ఆ కేసను సీబీఐకి అప్పగించడం జరిగింది. సీబీఐ విచారణకు రియా చక్రవర్తి హాజరైంది. తన వెర్షన్ వినిపించింది. ఈ విచారణ సందర్భంగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. దీంతో అసలు కేసు అంటే సుశాంత్ సింగ్ మృతి కేసు విచారణ మరుగున పడిపోయిందని, కేసు మొత్తం డైవర్షన్ తీసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

డ్రగ్స్ వైపు మరలిన కేసు

డ్రగ్స్ వైపు మరలిన కేసు


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై విచారణ సందర్భంగా డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో ఫోకస్ మొత్తం డ్రగ్స్ వైపు మరలింది. డ్రగ్స్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో కేసు కాస్త సీబీఐ నుంచి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు మారింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా రియా చక్రవర్తిని చేర్చారు అధికారులు. ఆమెను పలుమార్లు విచారణకు పిలిచి విచారణ చేసిన తర్వాత ఆమెను అరెస్టు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ అగ్రతారల పేర్లుకూడా వెలుగులోకి రావడంతో ఈ కేసు మరో టర్న్ తీసుకుంది. ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్న డ్రగ్స్ కేసులో దీపికా పదుకోన్, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌ల పేర్లు బయటకు వచ్చాయి. అయితే వీరిని విచారణ చేసిన ఎన్‌సీబీ మరోసారి వీరిని విచారణ చేసే అవాకాశాలున్నాయని చెబుతూ వీరిలో ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఇక డ్రగ్స్ వ్యవహారంతో సుశాంత్ సింగ్ మృతి కేసు మొత్తం పక్కదారి పట్టడంతో అతని స్నేహితులు గణేష్ మరియు అంకిత్ నిరాహార దీక్షకు దిగారు.

 డ్రగ్స్ పేరుతో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు

డ్రగ్స్ పేరుతో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు

డ్రగ్స్ వ్యవహారం పేరుతో కావాలనే సుశాంత్ సింగ్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారేమో అనే అనుమానం తమకు కలుగుతోందని సుశాంత్ సింగ్ మిత్రులు గణేష్ మరియు అంకిత్ చెబుతున్నారు. డ్రగ్స్ వ్యవహారం వెలికి తీయడం సరైందే అని చెబుతున్న వీరిద్దరూ... అదే సమయంలో సుశాంత్ సింగ్ మృతి కేసుపై సీబీఐ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు . కేసు నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నీరజ్, సిద్ధార్థ్ పితానీలతో పాటు ఇతరులను కూడా సీబీఐ ప్రశ్నించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు సుశాంత్ సింగ్ అభిమానులు కూడా ఉన్న చోటనే ఉండి న్యాయం కోసం నిరాహాద దీక్ష చేయాలని పిలుపునిచ్చారు.

 లాయర్ ప్రశ్న.. సీబీఐ సమాధానం

లాయర్ ప్రశ్న.. సీబీఐ సమాధానం

జూన్ 14న సుశాంత్ సింగ్ మృతి చెందగా.. కొన్ని రోజులు హడావుడి చేసి డ్రగ్స్ పేరుతో ఒక్కసారిగా కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సుశాంత్ సింగ్ కేసులో వాదిస్తున్న అతని లాయర్ అనుమానం వ్యక్తం చేశారు. కేసు మొత్తం పక్కదారి పట్టిందని కేసుకు సంబంధించి తమ నిస్సహాయతను లాయర్ వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేసు ఎంతవరకు వచ్చిందో సీబీఐ చెప్పడం లేదని మృతుడి తరపున లాయర్ వికాస్ సింగ్ చెప్పారు. ఇక డ్రగ్స్ పేరుతో సుశాంత్ సింగ్ మృతి కేసు పక్కదోవ పడుతోందని ఇటు రాజకీయంగాను అటు సుశాంత్ అభిమానులు కూడా అనుమానం వ్యక్తం చేస్తుండటంతో సీబీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. సుశాంత్ సింగ్ మృతి కేసులో సీబీఐ వెనకడుగు వేయలేదని విచారణ చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో హత్య జరిగిందా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ పేర్కొంది. అన్ని అంశాల్లో లోతుగా విచారణ చేస్తున్నట్లు సీబీఐ ప్రకటన ద్వారా పేర్కొంది.

మొత్తానికి సుశాంత్ సింగ్ మృతితో ప్రారంభమైన కేసు మెల్లగా డ్రగ్స్ వైపు మరలింది. సుశాంత్ సింగ్ కేసు మరుగున పడిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇంకా ఈ ఎపిసోడ్‌లో ఎంతమంది ఉన్నారు.. డ్రగ్స్ కేసు విచారణలో ఇంకా ఎన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో కాలమే చెబుతుంది.

English summary
With Drug case erupting in the bollywood there are many who are raising doubts that Sushanth Singh Rajput case has been diverted in the name of drugs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X