వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లోనూ కమలేశ్ తివారీ.. రెండేళ్ల క్రితమే..

|
Google Oneindia TeluguNews

హిందూ సమాజ్ పార్టీ నేత, హిందు మహాసభ లీడర్ కమలేశ్ తివారీ హత్య తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నాం లక్నోలోని పార్టీ కార్యాలయంలోనే దుండగులు కత్తితో పొడిచి హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు అతని మట్టుబెట్టేందుకు ఐఎస్ ఉగ్రవాదులు ప్రయత్నించారనే విషయం వెలుగులోకి వచ్చింది.

కమలేశ్ తివారీని ఐఎస్ ఉగ్రవాదులు హతమార్చేందుకు 2017లోనే ప్రయత్నించారని యాంటీ టెర్రరింజ స్కాడ్ (ఏటీఎస్) అధికారులు తెలిపారు. అతను ఐఎస్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో కూడా ఉన్నారని అంశం హత్య తర్వాత వెలుగులోకి వచ్చింది. 2017లో గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఐఎస్ ఉగ్రవాదులు ఉబైద్ మిర్జా, ఖాసీమ్‌ను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా తమ టార్గెట్‌లో కమలేశ్ తివారీ కూడా ఉన్నారని పేర్కొన్నారు.

IS terrorists had plans to kill Hindu Samaj Party leader Kamlesh

అప్పుడు ఏటీఎస్ అధికారులు ఉగ్రవాదులు చెప్పిన అంశంపై చార్జీషీట్ కూడా దాఖలు చేశారు. కమలేశ్‌ను హతమార్చేందుకు కుట్రపన్నారని అభియోగాలు కూడా మోపారు. 2015లో కమలేశ్ తివారీ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఉగ్రవాదులకు, ముస్లింలకు కమలేశ్ అంటే గిట్టదు. శుక్రవారం కమలేశ్‌ను మట్టుబెట్టింది కూడా ఉగ్రవాదులేనని పోలీసులు భావిస్తున్నారు.

కమలేశ్ లక్నోలోని తన కార్యాలయంలో ఉండగా శుక్రవారం మధ్యాహ్నం కొందరు కాషాయ వస్త్రాలు ధరించి లోపలికి వచ్చారు. రెండు స్వీట్ బాక్సులు తమ వెంట తీసుకొచ్చారు. అందుల్లోంచి తుపాకీ తీసి కాల్చారు. తర్వాత కత్తితో గొంతు కోశారు. దాదాపు 15 సార్లు కత్తితో పొడిచినట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. తర్వాతే అక్కడినుంచి పారిపోయినట్టు విజువల్‌లో కనిపించింది. సంఘటనస్థలంలో పిస్టోల్, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Kamlesh Tiwari was also on target of Islamic State (IS) terrorists. Ubaid and Qasim, said that they were asked to kill Kamlesh Tiwari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X