వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: కొత్త రూ. 1,000 నోట్లు ఇవే ? వచ్చేశాయి, చూశారా !

కొత్త రూ.1,000 నోట్లు ఇవే అంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. ఆఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఆర్ బీఐ కొత్త రూ. 1,000 నోట్లను విడుదల చెయ్యలేదు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ముంబై: పెద్ద నోట్లు రూ. 1,000, రూ. 500 నోట్లు రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూ. 2,000, రూ. 500 నోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త రూ. 2,000, రూ. 500 నోట్ల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి.

ఈ విషయం ఇప్పుడు దాదాపుగా తెరమరుగు అయ్యింది. అయితే సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాఫిక్ ఏదో ఒకటి ఉండాలని అనుకుంటున్నారో ఏమో ? ఇప్పుడు సరికొత్తగా ఓ టాఫిక్ హల్ చల్ చేస్తున్నది.

కొత్తగా విడుదల అవుతున్న రూ. 1,000 నోట్లు ఇవే అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాస్తవానికి రూ. 2,000, రూ.500 కొత్ల నోట్లు విడుదల చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వం గతంలోనే వెయ్యి రూపాయల నోట్ల విషయంలో స్పష్టత ఇచ్చింది.

Is this News Rs. 1,000 note fake or real > Viral in Social Media

పాత వెయ్యి రుపాయల నోట్ల స్థానంలో కొత్త రూ. 1,000 నోట్లు ఇప్పట్లో తీసుకు వచ్చే ఉద్దేశం ఎంత మాత్రం లేదని కుండలబద్దలు కొట్టి మరీ చెప్పింది. అయితే కొందరు మహానుభావులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) కొత్తగా రూ. 1,000 నోట్లను ముద్రించిందని ప్రచారం చేస్తున్నారు.

ఆ కొత్త రూ.1,000 నోట్లు ఇవే అంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. ఆఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొత్త వెయ్యి నోట్లు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారిపోయింది.

నిజానికి ఆర్ బీఐ కొత్త రూ. 1,000 నోట్లను విడుదల చెయ్యలేదు. కనీసం డమ్మీ నోట్లను ముద్రించినా వాటి మీద సీనియల్ నెంబర్లు ఉండవు. కాబట్టి ఇవి నకిలీ నోట్లు అని, ఇలాంటి వార్తలను నమ్మరాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

మీరు మాత్రం ఇలాంటి కొత్త రూ. 1,000 నోట్లు చూసినా, ఎవరైనా మీకు ఇవ్వాలని ప్రయత్నించినా వెంటనే సమీపంలోని పోలీసులకు సమచారం ఇస్తే నకిలీ నోట్లు చలామణి కాకుండా చూడటానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా సమాజానికి సేవ చేసినట్లు అవుతుంది.

English summary
The Reserve Bank of India has started printing Rs 1000 note on a pilot basis. But RBI has no plan to roll out these new Rs 1000 immediately, a banking industry source said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X