వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంక్షలతో ఆపలేం.!ఎవరి ఖర్మకు వారే బాద్యులు.!కరోనా పట్ల ప్రధాని వ్యాఖ్యల వెనక ఆంతర్యం అదేనా?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : గురువు ఎప్పుడూ యుధ్దం చేయడు. యుధ్దం చేయడంలోని మెలకువలను మాత్రమే బోధిస్తాడు. అవి ఎంత ఎక్కువ మెదడుకు ఎక్కితే యుద్దంలో ఆ మేరకు విజయాన్ని చేజిక్కించుకుంటారు యుద్ద ప్రవీణులు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ముందు జాగ్రత్తలు తీసుకుని కరోనాను తరిమేయాల్సిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం విస్మయానికి గురిచేసే నిర్ణయం తీసుకుంది.

ఇక లాక్‌డౌన్ లు ఉండవు.. కరోనాను తరిమికొట్టే బాద్యత దేశ పౌరులదేనన్న మోదీ..

ఇక లాక్‌డౌన్ లు ఉండవు.. కరోనాను తరిమికొట్టే బాద్యత దేశ పౌరులదేనన్న మోదీ..

కరోనా కట్టడికి తీసుకోవల్సిన ముందు జాగ్రత్తలను, మెలకువలను గత నాలుగు విడతలుగా విధించిన లాక్‌డౌన్ ఆంక్షల ద్వారా వివరించామని, ఇక మీదట కరోనా కట్డడిలో ఎవరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారే తీసుకోవాలని, అందుకు ప్రభుత్వాలనుండి అందాల్సిన సహాకారం అందించామని, ఇక మీదట స్వీయ నియంత్రణ, కరోనా కట్టడికోసం తీసుకునే ముందస్తు చర్యలన్నీ ప్రజలే సొంతంగా తీసుకుని కరోనా బారిన పడకుండా ఉండాలని దశ ప్రధాని స్పష్టం చేసారు. అంటే కరోనా అంశంలో ఖర్మ సిద్దాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చెప్పకనే చెప్పుకొచ్చారు.

స్వీయ నియంత్రణ జాగ్రత్తలు నేర్పించాం.. మీ ఆరోగ్యం మీచేతుల్లోనే ఉందన్న ప్రధాని..

స్వీయ నియంత్రణ జాగ్రత్తలు నేర్పించాం.. మీ ఆరోగ్యం మీచేతుల్లోనే ఉందన్న ప్రధాని..

ప్రాణాంతక కరోనా వైరస్ ను తరిమికొట్టే క్రమంలో దేశ ప్రజలకు లాక్‌డౌన్ అనే ఆయుధాన్ని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో కరోనాను కట్టడిచేసే ప్రక్రియలో భాగంగా మొదట్లో ప్రజలకు అందుబాటులో పీపీఈ కిట్ తయారీ జరగలేదు. టెస్ట్ కిట్ల గురించి, వాటి వినియోగం గురించి తెలియదు. కరోనా నుండి ఎలా రక్షించుకోవాలో అనే అంశం అసలే తెలియదు. అలాంటప్పుడు భయభ్రాంతులకు గురయ్యేకన్నా దేశాన్ని షట్ డౌన్ చేసుకుంటే శ్రేయస్కరమనే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. దాదాపు నాలుగు విడతలుగా లాక్‌డౌన్ ఆంక్షలను అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో కొంతవరకు కరోనా వైరస్ కట్టడి కావడంతో పాటు కొన్ని ఆర్దిక పరమైన సమస్యలు కూడా తలనొప్పిగా పరిణమించాయి.

నాలుగు విడతలుగా లాక్‌డౌన్ విధించాం.. ఇక క్రమశిక్షణగా కరోనాకు దూరంగా ఉండాలన్న దేశ ప్రదాని..

నాలుగు విడతలుగా లాక్‌డౌన్ విధించాం.. ఇక క్రమశిక్షణగా కరోనాకు దూరంగా ఉండాలన్న దేశ ప్రదాని..

అంతే కాకుండా కరోనా చికిత్స గురించి, దానిని నివారించే వాక్సీన్ గురించి, కరోనా వ్యాప్తి గురించి వ్యక్తిగత అప్రమత్తత అవసరం ఎంతో ఉందనే అంశం వెలుగులోకి వచ్చింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలతో పాటు దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అంశం స్పష్టంగా తెలుస్తోంది. ఇదే అంశాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పష్టం చేసారు. కరోనా అంశం పట్ల ఎవరికి వారు సామజిక బాద్యతగా వ్యవహరించి కరోనాను తరిమికొట్టడమే అసలైన వ్యాక్సీన్ అని గుర్తు చేసారు. కరోనా వైరస్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక మీదట ఎలాంటి ఆంక్షలు అమలు చేయవని తెలిపారు.

కరోనా సోకితే మీదే బాద్యత.. ఖర్మ సిద్దాంతాన్ని గుర్తు చేసిన మోదీ..

కరోనా సోకితే మీదే బాద్యత.. ఖర్మ సిద్దాంతాన్ని గుర్తు చేసిన మోదీ..

భారత దేశంలో కేసులు పెరుగుతున్నప్పటికి కరోనా వైరస్ అదుపులో ఉందని, అందుకే లాక్‌డౌన్ ఆంక్షలు ముగిసి అన్లాక్ మార్గదర్శకాలు మొదలయ్యాయని ప్రధాని మోదీ వివరించారు. దేశంలో మళ్లీ లాక్‌డౌన్ ఉండదని, నాలుగు దశల్లో అమలు చేసిన లాక్‌డౌన్ సడలిపోయిందని, ప్రస్తుతం అన్లాక్ 1.0 నడుస్తోందని అన్నారు. ఇక కరోనా అంశంలో జాగ్రత్తలు తీసుకునే అధికారాలను ముఖ్యమంత్రులకు వదిలేసి నట్టు మోదీ స్పష్టం చేశారు. విభిన్న సంస్కృతులకు నిలయమైన భారత దేశంలో కరోనా వైరస్ ను తరిమికొట్టే బాద్యత 130 కోట్ల భారత పౌరులదేనని మోదీ చెప్పుకొచ్చారు. కరోనాను నియంత్రించేందుకు కేంద్రం ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసిందని, ఇక మీదట చేయాల్సిన బాద్యత దేశ ప్రజల మీదే ఉందని ప్రధాని వివరించారు.

English summary
Regarding the corona aspect, they were reminded that the social distance was the original vaccine for the corona.The central government would no longer implement any restrictions against the coronavirus. Prime Minister Narendra Modi has made the same point.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X