• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇషా అంబానీ - ఆనంద్ పిరమల్ : ఇటలీలో నిశ్చితార్థం..మరి పెళ్లి ఎక్కడో తెలుసా..?

|

ముంబై: దేశంలో అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో త్వరలో పెళ్లి బాగా మోగనున్న సంగతి తెలిసిందే. అంబానీ ఇంట్లో వివాహం అంటే ఇటు దేశీయ మీడియానే కాదు.. అటు అంతర్జాతీయ మీడియా సైతం ఆసక్తి కనబర్చింది. కొడుకు ఆకాష్ అంబానీకి ముందుగా అమ్మాయి సెట్ కాగా... ఆ తర్వాత కొద్ది రోజులకే ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీకి కూడా మ్యాచ్ ఫిక్స్ అయ్యింది. దీంతో రెండు పెళ్లిళ్లు ఒకే సారి జరుగుతాయని వార్తలొచ్చాయి. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం ముందుగా ఇషా అంబానీ వివాహమే జరుగుతున్నట్లు సమాచారం. అది కూడా ఈ ఏడాది డిసెంబర్‌లోనే అని తెలుస్తోంది.

లవ్ ప్రపోజల్‌కు ఓకే: ఈశా అంబానీకి కాబోయే భర్త ఇతడే

ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాలకే ముందుగా ముంబైలో నిశ్చితార్థం జరిగింది. ఆ వెంటనే ఇషా అంబానీ-ఆనంద్ పిరమల్‌లు ఒక్కటవబోతున్నారనే వార్త పొక్కింది. మహాబలేశ్వర్ ఆలయంలో ఆనంద్ ఇషాకు తన ప్రేమను వ్యక్తపరిచినట్లు సమాచారం. ముందు ఆకాష్-శ్లోకాల వివాహం అవుతుందని అంతా భావించారు. అయితే అన్న కంటే ముందుగా చెల్లి వివాహం చేసుకోబోతోంది.

Isha Ambanis Wedding to be held this December?

ఇషా అంబానీ-ఆనంద్ పిరమాల్ వివాహం ప్రపంచలోని అత్యుత్తమ ప్రదేశాల్లో జరగనుంది. వీరి ఎంగేజ్‌మెంట్ సెప్టెంబర్ 21న ఇటలీలో పండగ వాతావరణంలో జరగనుంది. ఆ తర్వాత అంబానీ-పిరమల్ కుటుంబాలు ప్రీవెడ్డింగ్ సెరిమొనీలో పాల్గొంటారు. ఇందుకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది.ఈ వరస ఈవెంట్లు నవంబర్ చివరి వారంలో మొదలై డిసెంబర్ మొదటి వారం వరకు కొనసాగుతాయి. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరవనున్నట్లు సమాచారం.

ఇక ఇషా అంబానీ- ఆనంద్ పిరమల్ వివాహం ముంబైలో డిసెంబర్ 12న జరగనున్నట్లు సమాచారం. నిశ్చితార్థమే అంత గ్రాండ్‌గా చేస్తున్నారంటే...ఇక పెళ్లి ఇంకెంత ఘనంగా చేస్తారో అని దేశమంతా చర్చించుకుంటోంది. ఇదిలా ఉంటే ఆకాష్ శ్లోకాలు మాత్రం వచ్చే ఏడాది 2019లో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mukesh and Nita Ambani's daughter, Isha Ambani's marriage with Anand Piramal may be happening sooner than anyone expected.The most anticipated wedding of the year is speculated to take place around December 2018.The couple's engagement news came right after Isha's brother Akash got engaged to Shloka Mehta in a starry bash at their Mumbai residence, Antilia.Anand had proposed to Isha at a temple in Mahabaleshwar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more