వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులకు బెదిరింపు, జైలులో దాడి: ఎవరీ వికారుద్దీన్? (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని ఆలేరు - జనగామ మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాది వికారుద్దీన్‌కు పెద్ద నేర చరిత్ర ఉంది. 2008 డిసెంబర్ 3న ఐఎస్ సదన్ వద్ద పోలీసుల పైన కాల్పులు జరిపాడు. మలక్ పేటలో ఉంటూ సిమిలో క్రియాశీలకంగా పని చేశాడు.

వికారుద్దీన్ డీజేఎస్ పేరుతో హైదరాబాదులో కార్యకలాపాలు నిర్వహించాడు. వికారుద్దీన్‌కు లష్కరే తోయిబా, ఐఎస్ఐతోను సంబంధాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మూడేళ్ల క్రితం హైదరాబాదులో ఆరుగురు పోలీసులను పొట్టన పెట్టుకున్నాడు.

వికారుద్దీన్‌కు ఉగ్రవాద కార్యకలాపాలు, పలు పేలుళ్ల కేసులతో సంబంధాలు ఉన్నాయి. గుజరాత్ హోంమంత్రిపై దాడి కేసులో వికారుద్దీన్ నిందితుడు. శాలిబండ, సంతోష్ నగర్ తదితర పోలీసు స్టేషన్లలో దాడి, దేశద్రోహం కేసులు నమోదయ్యాయి.

వికారుద్దీన్

వికారుద్దీన్

గతంలో వికారుద్దీన్‌ను అరెస్టు చేసిన సమయంలో భారీగా ఆయుధాలు పట్టుపడ్డాయి. జైలులో ఉన్న సమయంలో తనకు బిర్యానీ కావాలని జైలు అధికారులను డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

 వికారుద్దీన్

వికారుద్దీన్

గత కొన్నేళ్లుగా జైలులో ఉన్న వికారుద్దీన్ హైదరాబాదు కోర్టుకు తరలిస్తుండగా పోలీసుల నుండి తప్పించుకోబోయి ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు.

 వికారుద్దీన్

వికారుద్దీన్

వికారుద్దీన్ 2008లో డిసెంబర్ నెలలో పోలీసులపై కాల్పులు, 2009లో మే 18న ఫలక్ నుమాలో పోలీసులపై కాల్పులు జరిపాడు.

 వికారుద్దీన్

వికారుద్దీన్

2010 మే 14న శాలిబండలో పోలీసులపై కాల్పులు జరిపాడు. 2010 జూలైలో వికారుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

 వికారుద్దీన్

వికారుద్దీన్

వికారుద్దీన్ గతంలో చంచల్ గూడ జైలులో వార్డర్ల పైన దాడి చేశాడు. వరంగల్ జైలులో కూడా పోలీసులను బెదిరించాడు.

 వికారుద్దీన్

వికారుద్దీన్

జైలు నుండి కోర్టుకు తీసుకు వస్తున్నప్పుడల్లా వికారుద్దీన్ తప్పించుకునేందుకు ప్రయత్నించేవాడు. పోలీసుల పైన దాడులు కూడా చేశాడు.

వికారుద్దీన్

వికారుద్దీన్

వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని ఆలేరు - జనగామ మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాది వికారుద్దీన్‌కు పెద్ద నేర చరిత్ర ఉంది.

వికారుద్దీన్

వికారుద్దీన్

2008 డిసెంబర్ 3న ఐఎస్ సదన్ వద్ద పోలీసుల పైన కాల్పులు జరిపాడు. మలక్ పేటలో ఉంటూ సిమిలో క్రియాశీలకంగా పని చేశాడు.

English summary
ISI Terrorist Vikaruddin encountered at Jangaon in Warangal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X