• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తినే ఆహారంలో, తాగే నీళ్లలో విషం.. ట్రక్కులతో తొక్కిచ్చి..: భారతలో మారణహోమానికి ఐసిస్ ప్లాన్!

By Ramesh Babu
|
  భారత్‌లో మారణహోమానికి ఐసిస్ ప్లాన్! ట్రక్కులతో తొక్కిచ్చి | Oneindia Telugu

  న్యూఢిల్లీ: ఐఎస్‌ ఉగ్రవాదులు భారత్‌లో మారణహోమం సృష్టించబోతున్నారా? యూరప్‌ తదితర దేశాల్లో భారీ వాహనాలను జనాలమీదకు పోనిచ్చినట్లుగా నరమేధానికి ప్లాన్‌ వేసుకున్నారా? ముఖ్యంగా హిందూ పండగలే లక్ష్యంగా దాడులకు ప్లాన్‌ చేస్తున్నారా?

  ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వచ్చేలా ఐఎస్‌ ఉగ్రవాది అబ్దుల్‌ రషీద్‌ విడుదల చేసిన ఆడియో టేప్‌ ఒకటి కలకలం రేపుతోంది. ఆఫ్ఘన్‌లోని టెలిమెసెంజర్‌ అలాగే ఇన్‌స్టాంట్‌ చాట్‌ అప్లికేషన్స్‌ ద్వారా ఈ ఆడియో క్లిప్‌ ప్రచారం అవుతున్నట్లు భద్రతా అధికారులు గుర్తించారు. రషీద్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. కేరళ పోలీసులు కూడా రషీద్‌ నేపథ్యంపై ఆరా తీస్తున్నారు.

   ISIS asks followers to poison food and water at Maha Kumbh, Thrissur festival

  'హిందువులు తినే ఆహారంలో, తాగే నీళ్లలో విషం కలపండి. త్రిస్సూర్‌ పూరమ్‌, మహా కుంభమేళ జరిగే ప్రాంతాల్లో జనాలపైకి భారీ వాహనాలను నడపండి..' అంటూ ఆ ఆడియో టేప్ లో ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులకు రషీద్‌ పిలుపు ఇచ్చాడు.

  పదినిమిషాల ఆ ఆడియో టేప్‌ మలయాళం భాషలో ఉంది. భారత్‌కు చెందిన రషీద్‌ ఇంజనీరింగ్‌ పట్టభద్రుడు. ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై ఆఫ్ఘన్‌ కేంద్రంగా ఐఎస్‌ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు.

  ఒక్కో ఉగ్రవాది 'ఒంటరి తోడేళ్ల' మాదిరి హిందువులపై విరుచుకుపడాలని అబ్దుల్ రషీద్ తన ఆడియో మెసేజ్ లో పిలుపిచ్చాడు. 'మన మద్దతుదారుడు లాస్‌వెగాస్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌కు వచ్చిన అనేక మందిని చంపేశాడు. మీరు కూడా ప్రయత్నించండి. రైళ్లను పట్టాలు తప్పించండి లేదా ఒక కత్తి అయినా ఉపయోగించండి..' అని రషీద్‌ చెప్పాడు.

  'మీలో ఎంతో మంది విద్యావంతులు ఉన్నారు. కాఫిర్లను చంపడానికి మీ తెలివితేటలు ఉపయోగించండి. చంపేయండి వారిని. ప్రజాస్వామ్యాన్ని, హిందూయిజాన్ని, క్రైస్తవాన్ని నాశనం చేయండి. అల్లా ఆదేశాలతో రాజ్య పాలన చేయండి. ఒకవేళ మీరు ఇలాంటి పనులు చేయలేకపోతే ఐసిస్ కు ఆర్థికంగా సాయపడండి..' ' అని ఆడియో టేప్‌లో రషీద్ సూచించాడు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In an audio tape terrorist organisation ISIS could be heard asking its followers to launch attacks on Kumbh Mela and Thrisoor Puram. The tape has the voice of an engineering graduate namely Abdul Rasheed who is asking the ISIS followers to Hindus at Kumbh Mela by poisoning water and food. “You are intelligent people, many of you have had higher education, you know how to implement it. Use your intelligence to kill kafirs, kill them, poison their food, poison all of their water. You could use trucks. Ram trucks into melas of Hindus, Thrissur Pooram, they have Maha Kumbh mela, all stupid things happen at these gatherings,” Rasheed said in the tape. He further said that truck attacks similar to the one carried out in the West should be used to kill non-Muslims.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more