వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఐసిస్‌లో భారతీయులపై వివక్ష, స్త్రీలు ఐనా సెక్స్ బానిసలే, మళ్లీ వెళ్లను'

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అరీబ్ మజీద్.. తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఐసిస్ (ఐఎస్ఐఎస్) తరఫున పోరాడటం కోసం ఇరాక్ వెళ్లాడు. అయితే, అసలు అక్కడ ఏం జరుగుతుందో అసలు విషయం తెలుసుకొని, రియలైజ్ అయి తిరిగి భారత్ వచ్చాడు. దీనిపై ఎన్ఐఏ ఎనిమిది వేల పేజీల ఛార్జీషీట్ దాఖలు చేసింది.

'ఐసిస్ ఏం చెబుతోందో.. తీరా అక్కడికి వెళ్లాక అదేం కనిపించడం లేదు. అక్కడ భారతీయులను పక్కన పెడుతున్నారు. మహిళల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నార'ని అరీబ్ మజీద్ పేర్కొన్నాడని విచారణ అధికారులు పేర్కొన్నారు.

సమాచారం మేరకు అరీబ్ మజీద్ ఏం చెప్పాడంటే... ఐసిస్ చీఫ్ అభూ బకర్ అల్ బాగ్ధాది ప్రవక్త యొక్క సందేశకుడు అని చెప్పిందని, అయితే అదే నిజమైతే ఆ యుద్ధం పవిత్రంగా ఉండాలని, కానీ అలా లేదని చెప్పాడు.

నిజంగా బాగ్దాది ప్రవక్త సందేశకుడే అయితే మహిళల పట్ల అంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారని అన్నాడు. మహిళలను ఐసిస్ బానిసల్లా చూస్తోందని, వారిని వస్తువుల వలె చూస్తున్నారని చెప్పాడు.

ఐసిస్

ఐసిస్

భారత దేశానికి చెందిన పురుషులైన, మహిళలు అయినా.. ఎవరైనా సెక్స్ బానిసలుగా చూస్తారన్నాడు. వివక్ష గురించి తాను అడిగానని, అయితే వారు చెప్పిన సమాధానం ఇలా ఉందని అన్నాడు.

ఐసిస్

ఐసిస్

భారతీయులను వారు నమ్మరని, అందుకే ముఖ్యమైన బాధ్యతను అప్పగించమని చెప్పాడని వివరించాడు. అందుకే తమకు క్లీనింగ్ వంటి బాధ్యతలను అప్పగిస్తామని అతడు చెప్పాడన్నాడు. యుద్ధం చేసేందుకు తమకు అనుమతించాలని తాను ఎన్నిసార్లు అడిగినా వారు నిరాకరించారని తెలిపాడు.

 ఐసిస్

ఐసిస్

అరీబ్ మజీద్‌ను ఐసిస్‌కు పరిచయం చేసింది ఆదిల్ డోలారిస్ అనే అతను. అతనిని డోలారిస్... రెహ్మాన్ అనే ఆఫ్ఘన్ ఫైటర్‌కు పరిచయం చేశాడు. తనతో పాటు ఓ ఇరాకీ ఫైటర్‌ను కూడా పరిచయం చేశారని చెప్పాడు.

ఐసిస్

ఐసిస్

రెహ్మాన్ నిత్యం ఆప్ఘన్ నుండి భారత్‌కు వస్తాడని, తన లాంటి వారిని ఐసిస్ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తాడని చెప్పాడు. అతను తనకు రూ.1.25 లక్షలు ఇచ్చాడని, ఆ మొత్తం ఇచ్చి ఇరాక్ వెళ్లమని చెప్పాడన్నాడు. అయితే, మొత్తం ట్రిప్‌కు రూ.2.40 లక్షలు ఖర్చవుతుందన్నాడు. మిగతా డబ్బును తాము సేకరించి వెళ్లామన్నాడు.

 ఐసిస్

ఐసిస్

తాము బాగ్దాద్ వెళ్లాక, అక్కడ తమను అబు ఫాతిమా అనే వ్యక్తి కలిసి మోసుల్‌కు తీసుకు వెళ్లారని, అక్కడే తమ శిక్షణ ప్రారంభమవుతుందని చెప్పారన్నాడు. తామంతా అబూ ఫాతిమా కారులో మోసుల్ వెళ్లామని చెప్పాడు. తమను మసీదు బయట నిలబెట్టారని, అక్కడి నుండి మరో కారులో తమను తీసుకు వెళ్లారని చెప్పాడు.

 ఐసిస్

ఐసిస్

తొలుత తనను పక్కన పెడుతున్నారనే విషయాన్ని గుర్తించలేదని, శిక్షణ పూర్తయిందని చెప్పాక, తనకు ఓ పనిని అప్పగించారని, తాను సంతోషపడ్డానని, ఆ తర్వాత తనకు అప్పగించిన పనిని రద్దు చేశారని చెప్పాడు. తాను భారత దేశం నుండి వచ్చినందున దానికి తాను సరిపోనని వారి అభిప్రాయమని, అందుకే రద్దు చేశారని చెప్పాడు.

 ఐసిస్

ఐసిస్

కొద్ది రోజుల తర్వాత ఓ యుద్ధంలో తాను గాయపడ్డానని, క్యాంప్ నుండి తీసుకు వచ్చారని, తనకు చికిత్స చేయించాలని అడిగితే, ఎవరూ పట్టించుకోలేదని చెప్పాడు. ఇలాంటి పలు కారణాల వల్ల తాను వెనక్కి వచ్చేశానని చెప్పాడు. తనకు తిరిగి ఐసిస్‌లో చేరాలనే ఆలోచన ఏమాత్రం లేదని చెప్పాడు. ఐసిస్ చేసేది పవిత్ర యుద్ధం కాదన్నాడు.

ప్రవక్త చెప్పింది ఇది కాదన్నాడు. మహిళలను అగౌరవంగా చూడమని చెప్పలేదన్నాడు. బాగ్దాది దేవుడు పంపిన సందేశకుడు అనేది పెద్ద అబద్దమన్నాడు. ఎవరు కూడా ఐసిస్‌ను నమ్మరని చెప్పాడు.

ఐసిస్ నిత్యం పలు వీడియోలు బహిర్గతం చేస్తోంది. ఆ వీడియోల్లో ఐసిస్ వైపు యువతను మళ్లించేందుకు ఎన్నో చెబుతున్నారని, కానీ అక్కడ జరుగుతున్నది అందుకు విరుద్ధమన్నాడు.

ఐసిస్‌లో భారతీయులకు ప్రాధాన్యత లేదని చెప్పాడు. ఐసిస్‌లో భారతీయలను రెండో రకమైన పౌరులుగా చూస్తారన్నాడు. భారతీయులకు అక్కడ నీచమైన పనిని అప్పగిస్తారన్నాడు. భారతీయులను సెక్స్ బానిసలుగా చూస్తారన్నాడు.

ఐసిస్‌లో భారతీయుల పట్ల తీవ్రమైన వివక్ష ఉందని చెప్పాడు. అక్కడ తొలి ప్రాధన్యత అరబ్, యూరోపియన్ దేశస్తులకే అన్నాడు. అక్కడ భారతీయులకు ఎలాంటి ప్రధానమైన బాధ్యతను అప్పగించరని చెప్పాడు.

English summary
The 8,000 page chargesheet filed against Areeb Majeed tells a story of a reluctant jihadi. Areeb Majeed who along with three of his friends left for Iraq to fight alongside the ISIS returned to India dejected and helpless after he realized that he was sidelined.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X